మహమ్మదీయ భక్తుని చేత “సాయి దీక్ష” కంకణం కట్టించి, అతనికున్న చెడు అలవాట్లను మాన్పించిన బాబా వారు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


ఇస్మాయిల్ గారి అనుభవములు మొదటి భాగం

నా పేరు ఇస్మాయిల్, నేనొక మహమ్మదీయ సాయి భక్తుడను.

యుక్త వయసులో ఆట పాటలతో కాలం గడుపుతూ గురువారాలప్పుడు రంగు రంగుల బట్టలతో ఆడపిల్లలు ముస్తాబు చేసుకుని గుడికి వస్తారు కాబట్టి ఆ ఆడపిల్లల్ని చూడటానికి బాబా గుడికి ఫ్రెండ్స్ తో వెళ్ళేవాడిని, అలా తెలుసు నాకు బాబా.

నేనొక పెట్రోల్ బంకులో అకౌంట్స్ రాసే వాడిని. ఆ బంకుకు రోజూ ఒక కస్టమర్ వచ్చేవాడు.

ఆయన నన్ను ఒక రోజు ఈ దగ్గర లో శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం నిర్మాణం జరుగుతుంది అక్కడ ఖర్చు లెక్కలు వ్రాయాలిట.

నువ్వు అక్కడకి వెళతావా? అంటూ అడిగాడు. ఆ గుడి అప్పుడే కడుతున్నారు.

అకౌంట్స్ రాస్తుండగా లోపల నుండి ‘సబ్ కా మాలిక్ ఏక్ ‘ ‘అల్లా అచ్చా కరేగా’ ‘రామ్ రహీం ఏక్’ అని మాటలు వినిపిస్తూ ఉండేవి.

ఇదేంటి మా ముస్లిం మాటలు వినపడుతున్నాయి? అని అనుకునేవాడిని.

రాముడు కృష్ణుడు అల్లా అంతా ఒక్కరైనా మా మతాన్ని కించపరిచే మాటలు అంటున్నారని కోపం కూడా వచ్చేది.

ఇక్కడ మా మతం వాడుకుంటున్నారని ఉక్రోషం కూడా వచ్చేది. అసలు ఏం చేస్తున్నారో చూద్దాం అని ఒక రోజు లోపలి వెళ్లాను.

లోపల సర్వాంగ సుందరంగా, మనోహరంగా ఉన్న బాబా వారి రూపం నన్ను బాగా ఆకర్షించింది.

ఇంతకు ముందు నేను బాబా గుడికి వెళ్ళినా ఆయన్ని ఎప్పుడూ పట్టించుకోలేదు. ఆనాడు మేము వెళ్ళినది ఆడపిల్లలని చూడడానికి కదా! మాకు బాబా ఎక్కడ కనపడతాడు?

ఇప్పుడు ఆయన్ని ఎప్పుడూ చూడాలని మనసు తహతహ లాడుతోంది.

ఉదయాన్నే హారతి, ఆ తర్వాత అభిషేకం చేస్తారని తెలిసి, రోజూ ఆ సమయానికి గుడికి వెళ్లి 5 రూపాయలు పెట్టి రోజా పూలు కూడా తీసుకువెళ్ళే వాడిని.

గుడి శుభ్రం చేయడం, హారతి అయ్యాక అభిషేకానికి నీళ్లు, అన్నీ ఏర్పాటు చేయడం పూలతో బాబాని అలంకరించడం అన్నీ చేసేవాడిని.

నెమ్మదిగా బాబా వారి సందేశాలు, వారి ప్రేమ, మానవత్వం ప్రదర్శించే ఎన్నో సన్నివేశాలు పారాయణలో నన్ను మంత్రం ముగ్దున్ని చేశాయి.

నా అడుగులు సాయి వైపు సాగాయి. నా నోరు సాయి నామం పలికింది. ప్రతి నిత్యం నాలుగు హారతులకు హాజరవ్వటం, పల్లకీ సేవ చూసుకోవటం, అభిషేకం అయినా తరువాత ఆ నీళ్ళని శుభ్రం చేయడం, ప్రసాదం పంచడం ఇలా మందిరము ఇల్లుగా సేవ చేయడం జరుగుతోంది.

అమ్ముల సాంబశివరావు గారి (సాయి తత్వ ప్రచారకులు) శిష్యులు కొంతమంది ఆ గుడికి వచ్చారు. వారు అక్కడ సాయి దీక్ష కొంతమందికి ఇస్తున్నారు.

దానికోసం వారు కంకణాలు కడతారు. అదేమిటో, ఎలా చేస్తారో ఎలా ఉంటుందో నాకేమి తెలియదు.

నాకు తెలిసిన సేట్లు కొందరు ముందువరుసలో కూర్చున్నారు. ఏం చేస్తారో చూద్దాం అని నేనూ కూర్చున్నాను.

వాళ్ళలో ఒకరిద్దరిని అడిగాను, ఏమిటిది? ఏమి చేస్తున్నారు? అని, మనమేమిచేయాలి? దీని ఫలం ఏమిటీ? అని అడిగాను.

అప్పుడు వాళ్ళు “మనకేదైనా చేడు అలవాట్లుంటే ఈ దీక్ష తీసుకోవడం వాళ్ళ పోతాయని” చెప్పారు.

నాకు ఆనాటికి గుట్కా తినే అలవాటు ఉంది. రోజుకి 6 నుండి 8 పాకెట్స్ తినేవాడిని. నాకది చేడు అలవాటు అని తెలుసు. మానుకోవాలని ఉండేది.

కానీ తినాలనే కోరిక బలంగా ఉంటూ మానేద్దామనుకున్నా తిరిగి ఆ సమయానికి వెళ్లి తినడం చేస్తూ ఉండేవాడిని.

సరే ఈ దీక్ష తీసుకుంటే నాకున్న ఈ చెడు అలవాటు గుట్కా తినడం పోతుందా? సరే అనుకుని అందరి మధ్యలోంచి వాళ్ళ దగ్గరగా వెళ్లి దీక్షా కంకణం కట్టించుకున్నాను.

దానికి కొన్ని నియమాలున్నాయి. 1 మాంసాహారం ముట్టుకోకపోవడం 2 దీపారాధన చేయాలి 3 సచ్చరిత్ర పారాయణ చేయాలి 4  సత్సంగం చేయాలి అని చెప్పారు.

మాంసాహారం మానేసాను. దీపారాధన ఇంట్లో చేయకూడదు కాబట్టి గుడిలో చేసేవాడిని. పారాయణ కూడా గుడిలో చేసేవాడిని. సాయంత్రం నలుగురం కూర్చుని సత్సంగం చేసుకునేవాళ్ళం.

మా మతానికి ఏ ఇబ్బంది లేదు అనుకున్నాను. 21 రోజుల దీక్ష అది. 20 రోజులయ్యేటప్పటికి శ్రద్ధ, సహనం తెలిసాయి.

కంకణం కట్టుకున్న రెండవ రోజు నుండి నేను గుట్కా మానుకుంటానా? నిజంగా ఇది జరుగుతుందా? అని అనుమానం వచ్చింది.

20 రోజులయ్యాక నాకే ఆశ్చర్యం, ఏమిటంటే 5 ఏళ్ళుగా నన్ను వేధిస్తున్న అలవాటు నేను ఎంత మానాలనుకున్నా మానలేకపోయిన అలవాటు పోయింది.

నేను గుట్కా కొనే షాప్ ముందు నిలబడినా నాకేమి అనిపించడం లేదు. అసలు నేను ఈ అలవాటు నుండి ఎట్టి పరిస్థితుల్లో బయట పడలేను అనుకున్నాను.

చేతికి కంకణం కట్టించి నన్ను ఆ అలవాటు నుండి బయట పడేసిన బాబా పై పూర్తి భక్తి విశ్వాసాలు పెరిగాయి.

ఇంక నేను ఈ అలవాటు నా దగ్గరకి రానీయను అని బాబాకి ప్రమాణం చేసాను.

రెట్టించిన ఉత్సాహంతో, మరింత శ్రద్ధతో బాబా కి సేవ చేసుకుంటున్నాను.

చీకటిలో మగ్గిపోయే జీవితానికి సాయిబాబా వెలుగు చూపించాడు. నా ఆనందానికి హద్దులు లేవు.

The above miracle has been typed by: Shiva Kumar Bandaru,

ఇస్మాయిల్ గారి అనుభవములు రెండవ భాగం….

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles