Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ఒకసారి సప్తాహానికి 4 రోజుల ముందు, ఇంట్లో ఎప్పుడూ సప్తాహానికి ఒక ఫోటో పెడతాము. ఆ ఫోటో ఏ గాలీ లేదు ఎవరూ కదపనూ లేదు. ఏమైయ్యిందో ఉన్నట్లుండి గోడ మీద నుండి జారి కింద పడి అద్దం పగిలిపోయింది.
తీరికగా అద్దం వేయించటానికి సమయం లేదు. ఆ అద్దం చిన్న ముక్క బాబాగారి ముఖాన గీసుకుని కొంచెం చిరిగింది.
మా వారు ఆ ఫోటో చిరిగింది కదా అది మార్చి వేరే ఫోటో తీసుకుందాం అంటారు. అది చిరిగినా సరే అదే ఫ్రేమ్ చేయిద్దాం అంటాను నేను,
కాసేపు వాదనలు అయ్యాక సరే అలాంటిదే మరొకటి తీసుకుందాం అనుకున్నాం మేము ప్రయత్నించాం ”హరి” అని ఫ్రేములు చేస్తుంటాడు అతను ప్రయత్నించాడు,
2 రోజులు గాలించినా అటువంటిదే మరొక ఫోటో దొరకలేదు. చివరికి ఎక్కడో ఒక చోట అలాంటి ఫోటోనే హరి పట్టుకువచ్చి ఫ్రేమ్ చేయటానికి కుర్చున్నాడట.
అతని షాప్ లో స్టేషనరీ వస్తువులు కూడా ఉంటాయి. ఆ ఫోటోకి అంత దూరంలో ఇంకు సీసా ఉందట.
ఎవరో పుస్తకం కోసం వచ్చారట ఆ ఫోటోని వదిలి ఆ కస్టమర్ కి కావాల్సింది (పుస్తకం) ఇచ్చి వచ్చి వెనక్కి చూశాడట ఆ ఇంకు సీసా, ఫోటో మీద ఒలికిపోయి ఉందట.
ఇది ఇలా జరిగేటప్పటికి అతనికి ఏం చేయాలో పాలుపోలేదు. ఎందుకంటే ఆ ఇంకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఫోటో మీద పడే అవకాశమే లేదట.
అలాంటిది అలా జరిగింది. చివరికీ విషయం చెప్పి పాత ఫోటోనే ఫ్రేమ్ చేసి ఇచ్చాడు,
నాకు కొత్త ఫోటో చేయడం ఇష్టం లేదు ఏదో చిన్నగా చిరిగిందే అనుకోండి తండ్రినే మారుస్తామా అని నా బాధ అదే ఫోటో అలాంటిదే అయినా కూడా నాకు అలా అనిపించండి.
అందుకేనేమో మళ్ళీ పాత ఫోటో రూపంలోనే బాబా వచ్చి మా ఇంట కూర్చున్నాడు .
ఒకసారి మా వారు హనుమాన్ చాలీసాను, హనుమాన్ దండకమూ చదవడానికి కూర్చున్నారు.
మా వారు అప్పటికి చాలా రోజులనుండి అప్పుడప్పుడు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తుండేవారు.
అదే అలవాటు ఆయన పోయాక కూడా నేను కొనసాగిస్తున్నాను. మా ఇల్లు చూసిన వాళ్ళు కొందరు మా ఇంట్లో వాస్తు దోషం అవుతుంది. అందుకే మీరు ఆర్ధికంగా ఎదగటం లేదు అనేవారు.
నేను చాలా రోజులు ఒక స్కూల్లో టీచర్ గా పనిచేసాను ఆ స్కూల్లో నాతోపాటు పని చేసే ఒక టీచర్ మా చుట్టలాయన ఒకాయన దుర్గాదేవి ఉపాసకులు ఆయనని మీరు కలిస్తే మీ ఇంట్లో దోషాలు చెబుతారు అంది.
నాకిష్టం ఇష్టం లేకపోయినా ఆవిడ బలవంతం పైనా ఒకరోజు ఆవిడా. నేను కలిసి వెళ్ళాము.
అక్కడ ఆయన మా వారి నక్షత్రం అడిగారు, నేను చెప్పాను. ఆయన ఈ పాటికే మీ వారు ఉండి ఉండకూడదు అన్నారు.
ఇంకా మీ ఇంట్లో ఎదో ఒక పూజ చేస్తుండాలి. దుష్టశక్తి అయినా ఉంటుంది, లేదా దైవ శక్తి అయినా ఉంటుంది.
దైవ శక్తి ఆగిపోతే దుష్ట శక్తి ఆవహిస్తుంది అందుకని పూజలు మాత్రం ఎట్టి పరిస్థితులలో ఆపకండి అన్నాడు.
ఆ తర్వాత మా వారు ఆంజనేయ స్వామి పూజకి చాలీసాను దండకం చదవడానికి కూర్చున్నారు.
నేను లోపల వడలు తయారు చేస్తున్నాను. చాలీసా బదులుగా ముందుగా దండకం మొదలుపెట్టారు. అదేమిటి అని అడిగేలోపల ఆపేసారు. సరే అనుకోని నేను లోపలికి వెళ్ళిపోయాను.
ఆ ఆపేయటం ఆపేయటం ఒక గంట వరకు అలాగే కూర్చున్నారు. ఆ తర్వాత మళ్ళీ చదవడం మొదలుపెట్టారు.
పూర్తైన తర్వాత నైవేద్యం అది అయిపోయిన తర్వాత నేను మా వారిని అడిగాను, ఎందుకంత సేపు చదువుతూ, చదువుతూ మధ్యలో ఆపేసారు అని.
”నేను ఉన్నట్లుండి ధ్యానంలోకి వెళ్ళిపోయాను ఆంజనేయ స్వామి కనిపించి మన గుమ్మం గేటుకు నడుమ ఒక 3 అడుగుల స్థలం వుంది, ఆ స్థలంలో గుంటలాగా తవ్వాడు,
అందులోనుంచి చేతిలోకి కొన్ని నల్ల బొమ్మలు, నల్ల గుడ్డలు నిమ్మకాయలు అన్ని తీసి చేతిలో పోసుకుని సంజీవ పర్వతం తీసుకుపోయినట్టు ఆంజనేయ స్వామి తీసుకువెళ్లిపోయాడు.
ఆ బొమ్మలకి సూదులు కూడా గుచ్చి ఉన్నాయి. ‘అప్పుడు బాబా గారు ”నీ కీడునంతా ఆంజనేయ స్వామి చేత తీయించేసాను” అని చెప్పాడు అని మా వారు జరిగినదంతా చెప్పారు.
The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni
Latest Miracles:
- సంశయంతో ఉన్న వ్యక్తికి కలలో బాబా వారు చేసిన బోధ
- లాటరీ ద్వారా ఇంటికి వచ్చిన బాబా.
- జాప్యం చేస్తున్న మొక్కును గుర్తు చేసి, నా చేత ఇరవై రూపాయలు దక్షిణ ఇప్పించుకుని వెళ్లిన బాబా వారు
- తనకు ఆరోజు నైవేద్యం పెట్టలేదని భక్తుని కలలో కనిపించి గుర్తుచేసిన బాబా వారు
- బాబా ఊదీ మహిమతో ఇంట్లో ఉన్న దృష్ట శక్తులు మాయమగుట.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments