దేశం కానీ దేశం లోను నన్ను కంటికి రెప్పలాగా కాపాడిన బాబా వారు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


ఒక రోజు నేను షాపు లో పనిచేసుకుంటూ ఉండంగానే నాకు తెలిసిన ఒకతను వచ్చాడు.

నువ్వు ఫారిన్ వెళ్లవచ్చు కదా ఇంత బాగా పనిచేస్తున్నావు. అక్కడికి వెడితే నువ్వు డబ్బు బాగా సంపాదించుకోవచ్చు కదా! అన్నాడు.

నేను అప్పటికే జపాన్ వెళ్ళటానికి ప్రయత్నం చేసాను. ఏదీ సఫలం కాలేదు. ఇప్పుడు ప్రయత్నం చెయ్యి నీతో పాటు నేను వస్తాను అన్నాడతను.

ఫారిన్ వెళ్ళటానికి ఇంటర్వ్యూ లు పెట్టారు. నన్ను బలవంతంగా ఆతను ఆ ఆఫీసుకు తీసువెళ్ళాడు.

నా సర్టిఫికెట్స్ చూసి ఒక నెల రోజులలో ఏ సంగతి చెబుతామన్నారు. ఒక నెల తరువాత ‘లిబియా’ వెళ్ళటానికి నన్ను సెలెక్ట్ చేసారు. ఈ వెళ్ళటం డిఫెన్స్ ద్వారా వాళ్ళు నన్ను పంపుతున్నారు.

నన్ను తీసుకెళ్ళేవాళ్ళని అడిగాను. ఏమనంటే అక్కడ నిజంగానే ఉద్యోగం ఉందా లేకపోతె ఏమిటంటే ఇప్పుడు నేను చేస్తున్న పని మానేసి రావాల్సి ఉంటుంది. ఇదంతా నేను ఆల్విన్ లో పని మానేయక ముందు జరిగింది.

నేను అక్కడ పని మానేసినప్పుడు నాకు ఒక లక్ష రూపాయల డబ్బు ఇచ్చారు. అవి మా ఇంట్లో ఇచ్చాను.

నేను లిబియా వెళ్ళే ముందు ఆ షాపు ఏం చేయాలి అన్న ఆలోచన వచ్చింది.

నేను వెళ్లి 2 సంవత్సరాల్లో వచ్చేస్తాను కాబట్టి అమ్మేస్తే నేను తిరిగి వచ్చేటప్పటికి అన్నీ మొదలు పెట్టాలి. అలా కాకుండా లీజ్ కి ఇస్తే బాగుంటుంది అని అనిపించింది.

అదీ బయట వాళ్ళకిద్దామా అని బాబా పుస్తకం లో బాబాను ప్రశ్న అడిగాను. ఇంట్లో వాళ్ళని నమ్మకు అని వచ్చింది.

బయట వాళ్ళు నెలకు 10 వేల రూపాయలు ఇస్తానంటే నేను బాబా మాటను లక్ష్య పెట్టకుండా మా అన్న కొడుక్కి ఇవ్వటానికి ప్రయత్నం చేశాను.

తీరా మా అన్న కొడుకు బయట వాళ్ళని పంపించేశాక నెలకి నాలుగు వేలు మాత్రమే ఇస్తాను లేదంటే 30000 వేల రూపాయలకి నాకు అమ్మేయమన్నాడు.

ఇంక లాభం లేదని బాబా ముందు చెంపలు వేసుకుని బాబా మాట మీద గురి ఉంచి మనుషులను పెట్టి మా మామ గారిని సూపెర్వైజర్ గా పెట్టాను.

నేను లిబియా వెళ్ళాను. నేను బయలుదేరే ముందు మా ఆవిడ ఆరు నెలల గర్భవతి. ఇండియా నుండి లిబియాకి నలుగురం వెళ్ళాము.

వెళ్ళాక అక్కడ ఆఫీస్ లో రూమ్ తాళం చెవి తీసుకుని నలుగురకు నాలుగు రూములు ఇచ్చారు. ఒక రూమ్ తలుపులు తీసి లోపలి వెళ్ళాము.

మరో రూమ్ తలుపు తీయంగానే అక్కడ గోడ మీద బాబా ఫోటో కనపడింది. నేను నీ కంటే ముందే గయలో నిన్నునేను కలుస్తానని శ్యామాతో బాబా అన్న మాటలు గుర్తుకు వచ్చి నా కళ్ళు చెమర్చాయి.

ఇంతకు ముందు ఆ రూమ్ లో ఎవరో ఇండియన్స్ ఉన్నారట. వాళ్ళు ఆ ఫోటోను తెచ్చి అక్కడ వుంచి వదిలి వెళ్లిపోయారుట.

మేము నలుగురము ఉన్నాము కదా అందరికీ 450 దినార్లు నాకు మాత్రం 500 దినార్లుగా జీతం ఫిక్స్ చేసారు.

నేను అసలు ఫారిన్ వెళ్ళే వాడినే కాదు కానీ అప్పులున్నాయి. అవి కాస్తా తీర్చేసి కాస్త ప్రశాంతంగా బ్రతుకుదామనిపించి బయలుదేరి వెళ్లాను.

లిబియాలో నేను అపార్ట్ మెంట్ పైవాటా లో ఆంధ్రావాళ్ళు. అక్కడ నలుగురు వాళ్ళ ఫామిలీస్ తోటే ఉంటున్నారు. వాళ్ళంతా బాబా భక్తులు కావటం బాబా చేసిన ఏర్పాటు.

రోజూ బాబా పారాయణాలు, భజనలు అందరూ ఒక్క దగ్గర చేరి తలా ఒక ప్రసాదం  తయారు చేసి తీసుకుని వెళ్లి నైవేద్యం పెట్టుకొని అందరం కలసి కూర్చొని ప్రసాదాలు తినేవాళ్ళం.

ఇంక ఇళ్లకు వెళ్లి వండుకొని తిననవసరం లేకుండా ఆ ప్రసాదాలే కడుపు నిండిపోయేది.

హైదరాబాద్ లో కంటే అక్కడే బాగా అనిపించింది. ఎందుకంటే నాకక్కడ బాబా నన్ను కంటికి రెప్పలాగా కాచుకుంటున్నాడు.

నేను వెళ్ళిన 3 నెలలకి నాకు బాబు పుట్టాడు. అప్పటికి నేను వెళ్లి మూడు నెలలే అయింది కాబట్టి నేను రాలేదు. ఆ తరువాత మూడు నెలలకి మా అమ్మ చనిపోయింది.

అప్పటికి నేను వెళ్లి 6 నెలలు అయింది. నాకు కబురు 2 వ రోజు తెలిసింది. వెళ్లేందుకు లేదు.

అందుకని 10వ నాడు గుండు చేయించుకుని పదిమందికి భోజనాలు పెట్టాను. నేను ఇండియాకి రెండు సంవత్సరాల అనంతరం వచ్చాను.

అప్పుడు చూసుకున్నాను నేను బాబుని. బాబుని తీసుకుని నేను నా భార్య షిరిడికి వెళ్ళాము. అక్కడ మూడు రోజులున్నాము.

అక్కడ వుండంగానే మా ఆవిడ పుట్టినరోజు కూడా వస్తే నేను ఏకాహం పారాయణం కూడా చేసాను.

ఆ తరువాత రెండు సంవత్సరాలకి మాకు పాప పుట్టింది. షిరిడి దర్శన అనంతరం నేను తిరిగి లిబియా వెళ్ళిపోయాను. రెండు నెలల తరువాత నాకు ఎగ్జిట్ స్టాంప్ వేసా`రు.

నువ్వు ఎప్పుడైనా ఇండియా వెళ్లి పోవచ్చు అని చెప్పారు. నేను అంతక్రితమే కొన్ని రోజులు మాత్రమే నా భార్య బాబు తో గడిపి వచ్చాను కాబట్టి, అయితే వెంటనే ఇండియా వెళ్ళిపోతానన్నాను.

లిబియా లో నాకు రావాల్సిన డబ్బు ఇండియా కరెన్సీ లో రావాలి కాబట్టి ఒకేసారి పెద్ద మొత్తంలో ఇండియాకి వచ్చాక చేతికందింది.

ఆ డబ్బుతో నేను మీర్ పేటలో ఇల్లు కొన్నాను. 5 లక్షల 50 వేల తో కొన్నాను. అక్కడికి మకాం మార్చేసాను. షాప్ అక్కడే మల్లేపల్లి లోనే ఉంది. రోజు అక్కడికి వెళ్లి వస్తుండేవాడిని.

2014 సంవత్సరం ఒక గురువారం నాడు మా ఇంట్లో మెట్లు ఎక్కుతుండగా నాకు బాగా ఆయాసం వచ్చింది. ఆ నాటికి మా అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నాడు.

వెళ్లి స్నానం చేశాను. అయినా ఎదోలాగా ఉంది. మా ఆవిడతో విషయం చెప్పను. మేము మొదటి అంతస్తులో ఉంటున్నాము. క్రిందంతా షాపులున్నాయి.

ఆ పక్కన ఇద్దరు కుర్రాళ్ళు రెంటుకు ఉంటున్నారు. మా ఆవిడ వాళ్ళని పిలిచి నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించమంది.

వాళ్ళు నన్ను తీసుకెళ్లి ECG తీయించారు. యాన్జీయోగ్రాం చేయాలన్నారు (కేర్ హాస్పిటల్) చేసారు.

మూడు వాల్వులు మూసుకుపోయాయి అన్నారు. స్టంట్స్ వేయాలన్నారు. నారాయణ హృదయాలయలో చేర్పించారు.

ఆపరేషన్ చేస్తున్నంత సేపు తెలుస్తుంటుందంట. నాకు కొంచెం నిద్ర పట్టేసింది.

నాకు నిద్రలో ఒక కల వచ్చింది. ఆ కలలో బాబా నాకు కనపడి గునపం తో గోడపగులగొడుతున్నాడు. బాబా ఆ గోడనెందుకు అలా బద్దలు కొడుతున్నావు అని అడిగాను.

ఇది అడ్డంగా ఉంది. అందుకే పగులగొడుతున్నాను అన్నాడు బాబా. కల అయిపోయింది.

The above miracle has been typed by: Shiva Kumar Bandaru,

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles