సంశయంతో ఉన్న వ్యక్తికి కలలో బాబా వారు చేసిన బోధ



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


నాగమణి గారి అనుభవములు మొదటి భాగం:

నా పేరు నాగమణి, మా వారి పేరు సత్యనారాయణ. మేము కర్నూల్ లో నివాసం  ఉంటాము.

మా వారు కర్నూల్ లో గవర్నమెంట్ స్కూల్ లో టీచర్ గా పని చేసి రిటైర్ అయ్యారు.

మాకు ముందులో బాబాతో పరిచయం అంటూ ఏమి లేదు. మాకు తెలిసిన H .M గారు ఉన్నారు. ఆ స్కూల్ లో మా వారు పని చేసే వారు.

ఆయన పేరు ‘రాధాకృష్ణా నంద గారు’. ఆయన ‘బాబా’ భక్తుడు. ఆయన ఎప్పుడు చూసిన బాబా బాబా అంటుండేవాడు.

ఆయన ఒకసారి మా ఇంటికి వచ్చి వెళ్ళిపోతూ, బాబా పారాయణ పుస్తకం నా చేతిలో పెట్టి ఇది చదువమ్మా! నీకు చాలా బాగుంటుంది అని చెప్పి వెళ్ళిపోయాడు.

ఆయన నాకు పెద్దగా పరిచయం కూడా లేదు. నేను పూజలు కూడా ఇంట్లో పెద్దగా ఏమి చేసేదాన్ని కూడా కాదు.

ఎప్పుడైనా హనుమాన్ చాలీసా బుద్ధి పుట్టినపుడు చదవటం తప్ప, నాకేమి తెలియదు, అలాంటిది నాకీ పుస్తకం ఇచ్చాడు.

నేనేం చెయ్యాలో అనుకుని పుస్తకం తీసుకెళ్లి బీరువాలో పెట్టాను. కనీసం అందులో ఏముందో కూడా నేను చూడలేదు.

నాలుగు రోజుల తరువాత, ఆయన మళ్ళి కలిసి “ఎమ్మా! చదివావా? అని అడిగారు. నేను తెరవానైనా తెరువని పుస్తకాన్ని ‘కొద్దిగా ఉంది సార్! అయిపోయింది” అని చెప్పాను.

15 రోజుల తరువాత అయిపోయింది సార్! చదివేసాను, అంటూ ఆయనకా పుస్తకాన్ని తిరిగి ఇచ్చేసాను.

ఇది జరిగిన దాదాపు 15 రోజుల తర్వాత ఎదో పత్రిక లో మా వారు చూసి చదివి , ఇదిగో ఇది చూడు భార్యాభర్తలు కానీ, తల్లి పిల్లలు కానీ, ఎవరు సంపాదించుకున్న పుణ్యం వారిది, ఎవరి పాపం వారిది, వారు అది అనుభవించాలి, ఒకరి పుణ్యం ఒకరికి రాదు అని నాకు చదివి వినిపించారు.

నేనన్నాను “పొండి! మీరలాగే అంటారు. మన పెద్ద వాళ్ళు ఎం చెపుతారు, భర్త చేసిన దానిలో భార్యకి సగం వస్తుంది కదా? మేము చేసేది కూడా ఎందుకు? “తల్లితండ్రులను కూడా వదులుకొని వచ్చేది ఎందుకు? అని ఆయనతో వాదించి పడుకున్నాను.

ఆ రోజు బుధవారం, నాకు రాత్రి ఒక కల వచ్చింది, ఆ కలలో మా ఇంట్లో దేవుడి రూంలో ఎర్రబట్టలతో ఉన్న బాబా ఫోటో వుంది. ఆ ఫోటో అప్పటికే ఎవరో తెచ్చి ఇచ్చారు, ఆది మేము దేవుడు గదిలో పెట్టాము,

‘యద్భావం తత్భవతి’ అని నా  భావన  అలాగే వుంది కాబట్టి, బాబా కూడా నా కలలోకి అలాగే వచ్చారు. మా ఇంట్లో దేవుడి రూమ్ ముందు ఒక స్టూల్ వుంది, ఆ స్టూల్ మీద బాబా కాలుమీద కాలు వేసుకొని కూర్చున్నాడు.

నేను బాబాయే ఉన్నాము మరెవ్వరు లేరక్కడ. ఒక గంట సేపు ఆయనకు నాకు వాదన జరిగింది, ఒక చిన్న పిల్లకి చెప్పినట్లుగా నాకాయన చెప్పాడు.

“నీకాకలి వేస్తే నువ్వే భోజనం చెయ్యాలి. నీ భర్త తింటే నీ ఆకలి తీరదుగా, అలాగే ఎవరి పాపం వారిది, ఎవరి పుణ్యం వారిది. అలాగే నీకు ఒంట్లో బాగోపోతే మెడిసిన్ నువ్వే  తీసుకోవాలి తానుకాదు తీసుకోవాల్సింది” ఇలా ఎనో ఉపమానాలు చెప్పాడు.

‘అయినా నేను ఆయన చెప్పింది కరెక్టే’ అనలేదు. ఒక అరగంట తర్వాత “అయితే మీ ఆయన పుణ్యం కానీ పాపం కానీ నీవు స్వీకరిస్తావా? అన్నాడు.

నేను ఆ స్వీకరిస్తాను అన్నాను, అయితే చూడు అంటూ నాలుగు చిన్న చిన్న పళ్ళేలు పెట్టాడు. రెండు పళ్ళేలు నీవి, రెండు నీ భర్తవి ఆ రెండింటి లో కూడా ఒకటి పాపం, మరొకటి పుణ్యం ఇవి తిను అన్నాడు.

మళ్ళీ తనే పాపం అంటే చేదుగా ఉంటుంది. అందుకని మొదట నువ్వు నీ పుణ్యమే తిను, ఆ తరువాత మీ ఆయన పుణ్యం తిందువు గాని అన్నాడు. నేను “రెండు తినేస్తాను” అన్నాను.

వెంటనే నేను నా పుణ్యాన్ని తినటం మొదలు పెట్టాను, పరమాన్నం లాగ ఉంది గబగబా తిన్నాను. ఇంకా ఒక్క మెతుకు మాత్రం ఉండగా ఆయన అన్నాడు, “ఒక మెతుకు కూడా మిగల్చకూడదు” ఆ ఒక్క మెతుకు కూడా గబుక్కున నోట్లో పెట్టేసుకున్నాను.

వెనకాలే మా ఆయన పుణ్యం కూడా తినాలి పళ్ళెం తీసాను. అంతే నాకు ఇంకా నాకు తినడానికి చేతకావడం లేదు, ఎంత ప్రయత్నించినా తినలేక పోయాను. వెగటయి పోతుంది. నా వాళ్ళ కావటం లేదు,

అప్పుడు బాబా అన్నాడు “నువ్వు పుణ్యమే స్వీకరించలేక పోతున్నావ్”? పాపమేమి స్వీకరిస్తావు? కాబట్టి ఇది ఎవరిది వాళ్ళది, ఇప్పుడైనా నీకు నమ్మకం కుదిరిందా?” అన్నాడు. ఆయనింకా వెళ్ళిపోయాడు. ఇదీ కల,

అప్పటి నుండి బాబా అంటే భక్తి ప్రేమలు మొదలయ్యాయి. ఆ తరువాత మేము కర్నూల్ వచ్చేసాము.

ముందు మేము రామన్న కోట అనే పల్లెలో ఉండే వారం. కర్నూల్ వచ్చేసరికి మేము 2 హారతులు ఉదయం కాకడ హారతి, రాత్రి శేజ్ హారతి చేస్తుండే వాళ్ళం.

వచ్చిన కొత్తలో ఇంకా మాకు ఎవరితోటి పరిచయం లేదు, నేను బాబా గుడికి వెళ్ళాను.

సుదర్శనం గారని ఆయన నా దగ్గరకు తానుగా వచ్చి, ” మీరు ఇంట్లో పారాయణం ఎందుకు చేయరు? చేయండి! అన్నాడు.

ఈయనెవరో మనకి పరిచయం లేకుండానే వచ్చి ఇలా చెపుతున్నాడు ‘అధిక ప్రసంగి’ అనుకున్నాను.

నాలుగు రోజుల తరువాత్త తిరిగి అదే గుడికి వెళితే, రైల్వే లో పని చేసే ప్రభాకర్ అన్న ఆయన ఈయన కూడా తానుగా మా దగ్గరకు వచ్చి, “మీరు ఉదయం హారతి, రాత్రి హారతి మాత్రమే చేస్తున్నారు, మధ్యాహ్న సాయంత్ర హారతులు ఎందుకు చేయడం లేదు? అన్నాడు.

మా ఇంట్లో హారతుల సంగతి మేము ఎవరికీ చెప్పలేదు. అప్పుడు నాకనిపించింది. బాబాయే వీళ్ళ చేత ఇలా చెప్పిస్తున్నాడు, అది బాబా ఆజ్ఞ అని అనుకున్నాము.

అప్పటి నుండి రోజు నాలుగు హారతులు ఇవ్వటం నిత్య పారాయణం, సప్తాహ పారాయణం అలా చెయ్యసాగాము.

ముందులో నాకు పారాయణ గ్రంధం ఇచ్చిన రాధాకృష్ణానంద గారు కూడా తరచూ మా ఇంటికి వచ్చి పోతూ, ఆయన అనుభవాలు కూడా మాతో పంచుకుంటుండేవారు.

The above miracle has been typed by: Shiva Kumar Bandaru,

నాగమణి గారి అనుభవములు రెండవ భాగం తరువాయి…..

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles