సచ్చా పాదుషా …. మహనీయులు – 2020… జూన్ 19



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


ఇతరుల మాట విని జహంగీర్, సిక్కుల ఆరవ గురువైన హర్ గోవింద్ ను గ్వాలియర్ కోటాలో బంధించాడు.

తన గురుదేవులను దర్శించుకోవటానికి 450 మైళ్ళ దూరాన్ని కూడ లెక్కచేయక వచ్చేవారు. ఆ భక్తుల ప్రేమను, ఆ గురుమూర్తి స్వభావమును మియాన్ మీర్ అనే సూఫీ యోగి గ్రహించాడు.

మీయాన్ మీర్ ను విశ్వసించేవాడు జహంగీర్. మియాన్ మీర్ మాటలవలన ప్రేరణ పొంది ఆయనను విడుదల చేయటానికి సిద్ధపడ్డాడు జహంగీర్.

తననే కాదని, బందీలైన మరో 52 రాజులను విడుదల చేయాలన్నాడు గురువు. గురువుల దుస్తులను ఎంతమంది పట్టుకోగలరో అంతమందినీ విడుదల చేస్తానన్నాడు జహంగీర్.

గురువు తన వస్తానికి చుట్టు 52 పీలికలు కుట్టించి, తాను ఆ వస్త్రాన్ని ధరించి, తనతోపాటు, ఆ పీలికలను పట్టుకొనిన 52 మందిని విడుదల చేయించాడు ఆ సద్గురువు.

జహంగీర్ కు ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయాడు. తన వద్దకు రమ్మని జహంగీర్ హర్ గోవిందును వేడుకున్నాడు.

హర్ గోవింద్ ను జహంగీర్ ప్రత్యేకంగా తయారు చేయించిన సుగంథపు ఆసనముపై కూర్చొండబెట్టాడు.

తేజోవంతమైన గురువు ముఖాన్ని చూచి నివ్వెరపోయాడు, ఆనందపరవశ్యుడయ్యాడు పాదుషా జహంగీర్.

జహంగీర్ కు హర్ గోవింద్ పై ఉన్న అనుమానాలన్నీ తొలిగిపోయాయి. గురు హర్ గోవింద్ ధరించే రెండు కత్తులలో ఒక కత్తి పీఠి  అని, రెండవ కత్తి మీఠి అని తెలుసుకున్నాడు పాదుషా.

పీఠి ఆధ్యాత్మిక శక్తికి, మీఠి భౌతిక శక్తికి ప్రతీకలని అతడు గ్రహించాడు. తనతోపాటు కొద్దీ రోజులు రాజమహల్ లో ఉండమని జహంగీర్ వేడుకున్నాడు హర్ గోవింద్ ను.

జహంగీర్ పాదుషా కాగా, జనులు గురు హర్ గోవింద్ ను సచ్చా పాదుషా (నిజమైన పాదుషా) అని ఎదుకంటారు? అని అడిగాడు.

“గురువును జనులు ఎవరికీ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు  పిలుస్తారు” అన్నాడు గురువు. జహంగీర్ ఆ సమాధానానికి సంతృప్తి చెందలేదు.

ఒక రోజున గురువు, జహంగీర్ వేటకు వెళ్ళి మధ్యాహ్నం అలసి, చెరొక చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటున్నారు.

గురువు అడవిలో ఉన్నారనే వార్త వెల్లడైంది. అడవిలో గడ్డి కోసుకుంటున్న ఒక వ్యక్తి తాను కోసిన పచ్చగడ్డి మోపును, రెండు పైసలను జహంగీరే సద్గురువనుకొని జహంగీర్ పాదాల వద్ద పెట్టి “ఓం సచ్చా పాదుషా” నా చివరి ఘడియలలో నన్ను కాపాడు” అని ప్రార్ధించాడు.

ఈ ప్రార్థన వినిన జహంగీరుకు అసలు విషయం అర్థమైంది.

“నేను ఈ రాజ్యానికి ప్రభువును మాత్రమే. అసలు సిసలైన రాజు అడుగో” అని జహంగీర్ గురు హర్ గోవింద్ ను చూపాడు.

ఆ వ్యక్తి గడ్డి మోపును, రెండు పైసలను తన సద్గురువు పాద పద్మాలవద్ద ఉంచి ప్రార్ధించాడు.

జూన్ 19 (1595)న గురుహర్ గోవింద్ జన్మించాడు.

నేడు జూన్ 19. సచ్చా పాదుషా ను ప్రార్దించెదము గాక!

ఆయన ఆశీస్సులు పొందుదాము గాక!!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles