Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
నా పేరు ఎల్లయ్య, నా సతీమణి పేరు భారతమ్మ. నేను ఆర్. టి. సి లో పనిచేసి రిటైర్ అయ్యాను.
నా ప్రస్తుత నివాసం హైదరాబాద్, కర్మన్ ఘాట్ లోని యామ్ప్రో కాలనీ. నా సతీమణి ఇటీవలే కాలం చేసారు. మేము ఇరువరము కూడా బాబా భక్తులము.
మాకు 1975 వరకు బాబా అంటే ఎవరో తెలియదు. ఒక రోజు డిపో నుండి తిరిగి వస్తుండగా ఒక చోట రోడ్డు మీద లాటరీలు అమ్ముతున్నాడు.
ఒక పావలా (25 పైసలు) ఇస్తే నాలుగు చీటీలు ఇస్తాడు. ఆ చీటీలలో నంబర్లు ఉంటాయి. ఆయా నెంబర్లుకి తగ్గట్టు వస్తువులుంటాయి.
ఆ చీటీలలో ఏమైనా నెంబర్లు ఉంటే ఆ నెంబర్ కల వస్తువు మనకి ఇస్తారన్నమాట. నేను అక్కడ నిలబడి సరదాగా అదంతా గమనించి పావలా పెట్టి నాలుగు చీటీలు కొన్నాను.
ఒకదాంట్లో ఏమీలేదు, రెండవదాంట్లో ఏమీ లేదు, మూడవ దాంట్లో కూడా ఏమీ లేదు, నాల్గవది తెరిస్తే అందులో నాలుగవ నెంబర్ ఉంది.
అది చూపిస్తే ఆ లాటరీల వాడు ఈ నెంబర్ కు ఈ ఫోటో వస్తుంది అంటూ ఒక ఫోటో ఇచ్చాడు. నేను ఆ ఫోటో చూసాను. ఎవరో ఒక గడ్డం, నెత్తిన గుడ్డ కట్టుకున్న ముసలాయనది.
నేను అది చూసి ”ఎవరిదీ ఫోటో” అని అడిగాను. అతను ”సాయిబాబా” లే పో ! అన్నాడు.
ఆ ఫోటో జేబులో పెట్టుకుని ఇంటికి తీసుకువచ్చి అలా గూట్లో పెట్టాను.
ఒక 20 రోజులు అయ్యాక నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఒకాయన ”నన్ను తీసుకువచ్చావు నాకు పూజ చేయవా? నేనెందుకొచ్చాను మీ ఇంటికి, పూజ చెయ్యి” అని వినిపించింది.
నేను తెల్లవారాక మా ఆవిడతో చెప్పాను. ”ఆయన ఎవరో ఏమిటో అప్పుడనగా ఫోటో తెచ్చారు ఎక్కడైనా కనుక్కుందాం” అంది.
అప్పట్లో బాబా గుడులు ఎక్కువగా ఉండేవికావు. ఎక్కడో ఓల్డ్ సిటీలో ఒక గుడి ఉంటే ఆ ఫోటో పట్టుకెళ్ళి చూపించి మరీ అడిగాము.
”ఈయన పేరు సాయిబాబా గురువారం నాడు ఈయనకి పూజ చేస్తే మనకి మంచి జరుగుతుంది” అని చెప్పారక్కడ.
మేము ఇంటికి వచ్చి అప్పటినుండి గురువారం నాడు పూజ చేయడం మొదలుపెట్టాము.
The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni
Latest Miracles:
- వినాయక చవితి నాడు బాబా ఫోటో రూపంలో భక్తురాలి ఇంటికి వచ్చుట…Audio
- బాబా నిజ పాదుకలు ఇంటికి వచ్చిన వైనం
- భక్తుని ఇంటికి వచ్చిన సాయి–Audio
- మా ఇంటికి వచ్చిన బాబా
- నీ బాబా నీకంటే ముందే నీ ఇంటికి వచ్చారు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments