Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
భక్తురాలు: ప్రియాంక
నివాసం:హైదరాబాద్
నా పేరు ప్రియాంక మేము ఎస్. ఆర్. నగర్ లో ఉంటాము. ఫిబ్రవరి 21st శుక్రవారం రోజు మా కాలనీలో ఒక ఆంటీ వచ్చి మా చెల్లికి చెప్పింది.
ఆరోజు వాళ్ళ ఇంటికి బాబా మహల్సాపతికి ఇచ్చిన పాదుకలు మధ్యాహ్నం 1:30 కి వస్తున్నాయి మమ్మల్ని రమ్మని చెప్పింది.
ఆరోజు నేను, మా అమ్మ బయటకు వెళ్లి ఇంటికి వచ్చేసరికి ఆంటీ వచ్చిన విషయం మా చెల్లి మాకు చెప్పింది.
అప్పుడు మా అమ్మకు ఫీవర్ సో, నేను చెల్లి 1:30 PM కి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము.
పాదుకలు ఇంకా రాలేదని 03:00 PM కి అలా వస్తాయని, అవి వచ్చే ముందు ఫోన్ చేసి చెప్తాను అంది.
అప్పుడు మాటల మధ్యలో నేను ఆంటీని అడిగాను. అసలు ప్రాసెస్ ఏమిటి ఆంటీ పాదుకలు ఇంటికి రావాలంటే అని, అప్పుడు నాకు కూడా సరిగా తెలియదు ఎవరో వస్తున్నాయి అంటే మా ఇంటికి కూడా తెప్పించండి అన్నాను అన్నది.
3 ఇయర్స్ బ్యాక్ కూడా ఆంటీ వాళ్ళు ఆ పాదుకలు తెప్పించుకున్నారు. అప్పుడు అవి చూసిన నేను ఆ పాదుకలు మా ఇంట్లోకి కూడా వస్తే బాగుండేది.
సాక్షాత్తు బాబా వచ్చినట్టే కదా! అనుకున్నాను.
ఆంటీతో మాట్లాడి ఇంటికి వచ్చేసాను. కాసేపటికి పాదుకలు వస్తున్నాయి అని అంటే ఆనందంతో మనం ముందు వెళ్లి బాబా ని ఆహ్వానించాలి అని అనుకుని నేను, చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్లి బాబా నామం చెప్పుకున్నాము.
ఇంతలో పాదుకలు వచ్చాయి. యేవో పూజాలు చేసి, పూలు వేశారు.
అందరం పాదుకలకు నమస్కారం చేసుకున్నాక హారతి ఇచ్చి, ప్రసాదం పెట్టారు. ఆరోజు పాదుకలు తెచ్చినవారు ఎవరు అని అడిగాను.
మహల్సాపతి వాళ్ళ మనుమడు, మార్తాండ్, ఆయన భార్య, మరి ఇద్దరు, ముగ్గురు వచ్చారు.
అందులో ఒక ఆయనకి తెలుగు వచ్చు. అప్పుడు ఆంటీ తంనంతట తానే నా మనసులోని మాటను చదివినట్లుగా ఆ పాప వాళ్ళు ప్రాసెస్ ఏమిటి అని అడుగుతున్నారని, ఆ అంకుల్ వాళ్ళకి చెప్పింది.
వీళ్ళు బాబాని బాగా నమ్ముతారు. వాళ్ళ అమ్మగారు రోజు హారతులు వాళ్ళ ఇంట్లో పాడుతారు. వాళ్ళు మతం పుచ్చుకున్నట్టుగా మొత్తం అన్ని బాబాకే చేస్తారుఅన్నది.
ఆయన అన్నారు నెక్స్ట్ టైం చూద్దాం. ఈ రోజు మేము వెళ్ళిపోతున్నాం బస్సు టైం కూడా అవుతుంది. ఇంకా లంచ్ చేయలేదు అని.
ఆంటీ ఆలా చెప్పడంతో ఆయనంతట ఆయనే ఒక్క అయిదు నిముషాలు ఏ హారతులు, పూజాలు లేకుండా తీసుకొని వెళితే మీ ఇష్టం అన్నారు.
నా మనసులో మాట నేను అడగకుండానే, ఆంటీ అంకుల్ తో మాట్లాడి మా ఇంటికి పాదుకలు పంపించారు.
బాబా పాదుకలు, కఫ్నీని ఒక సూట్ కేసులో మా తలపైన పెట్టుకుని మా ఇంటికి తెచ్చాము.
మేము ఇంటికి తెస్తుంటే మా అమ్మ ఏడుస్తుంది.ఏమంటే బాబా పాదుకలు వస్తే ఈ ఫీవర్ వల్ల చూడలేకపోయాను అని. పాదుకలు చూడగానే బాబానే తన ఇంటికి వచ్చాడని అమ్మ ఏడ్చేసింది.
ఆ పాదుకలు ఇల్లంతా తిప్పి దక్షిణ నమస్కరించుకుని మళ్లీ తలపైన అందరం పెట్టుకుని వాళ్ళకి ఇచ్చాము.
మాకు చాలా ఆనందం వేసింది.
అక్కడ బాబా నా మనసులో కోరికను మా అమ్మ బాధను రెండూ ఒకేసారి తీర్చారు.థాంక్ యు బాబా.
~~~~సర్వం సాయినాధార్పణమస్తు~~~~
Latest Miracles:
- బాబా నిజ పాదుకలు ఇంటికి వచ్చిన వైనం
- గురువుగారి పాదుకలు చూస్తే గురువుగారిని చూసినంత ఆనందం కలిగింది.
- బాబా సచ్చరిత్ర పారాయణం లీల
- భక్తుని ఇంటికి వచ్చిన సాయి–Audio
- లాటరీ ద్వారా ఇంటికి వచ్చిన బాబా.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
One comment on “బాబా నిజ పాదుకలు ఇంటికి వచ్చిన వైనం”
Sreenivas
May 14, 2018 at 9:10 amఈ లీల సందర్భానుసారముగా చాలా బాగుంది సాయి….అందరం దిలుసుఖ్ నగర్ సాయి బాబా temple లో బాబా పాదుకలను దర్శించుకున్న feel లో ఇంకా ఆనందంగా ఉన్నాం….సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా