Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ఓం సాయి రామ్.
నా పేరు లక్ష్మి ప్రసన్న.
బాబా ఒక్కో భక్తునికి ఒక్కో రీతిన ఆ భక్తుని స్థితిని కనుగొని వారి పురోగతికి సహాయపడుతూ, వారిని ఎల్ల వేళలా కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు బాబా.
ఎవరితో ఏమి చేయించాలో బాబాకే తెలుసు.
ఒకసారి మేము షిరిడి లో గురుస్థానం వద్ద ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నాము.
బాబా చెప్పారుగా గురు,శుక్ర, వారాలలో దూపం వేస్తె మంచిది అనీ. అక్కడకు వెళ్ళగానే అప్పట్లో అక్కడ జరిగినవి అన్నీ విషయాలు గుర్తు చేసుకుంటూ అలానే బాబాని చూస్తూ ఉంటె టైం తెలియదు.
ఇంతలో ఒక అతను మా దగ్గరకు వచ్చి ఈరోజు ఇక్కడ దూపం వేస్తే మంచిది ,ఆవు పిడకలు వెయ్యండి అన్నారు.
మా దగ్గర ఆవు పిడకలు లేవు , అయినా ఇక్కడ అలా వెయ్యనివ్వరుకదా ఎలా అన్నాను.
లేదు అమ్మా వేస్తె మంచిది, మీకు ఎందుకు నేను తెస్తాను, మీరు వెయ్యండి, అనీ చెప్పి వెళ్ళారు.
అక్కడ చాలా మంది ఉన్నారు ఇతను మమ్మల్ని ఎందుకు ఇలా వెయ్యమన్నారు అనీ అనుకున్నా.
ఈలోగా మా వారు ఇప్పుడు పిడకలు ఇస్తారు, తరువాత డబ్బులు అడుగుతారు చూడు అన్నారు.
నాకు ఆ మాటలు నచ్చలేదు ఎందుకు అంటే నేను షిర్డీ లో ఉన్నా అంటే బాబా ఒడిలో ఉన్నాను.
నేను ఎంత నిర్బయంగా ఉండాలి, షిర్డీ లో ఎవరు నాతో మాట్లాడినా బాబానే ఎటు చూసినా బాబానే నా కళ్ళకి.
అప్పుడు నేను చెప్పా, అతను డబ్బులు అడిగితె నా తాత (బాబా) కాదు.
ఏమీ అడగలేదు అంటే నా తాత అని ఓకే నా అని అడిగాను. హా సరే అప్పటికైనా నీ పిచ్చి తగ్గుద్ది అని నవ్వారు.
ఈలోగా అతను కొన్ని పిడకలు తెచ్చి మాకు ఇచ్చి వెయ్యమన్నారు. ప్రదక్షిణాలు చేసి వేసాము. అతను సంతోషమా అని అడిగినట్టుగా నా వైపు చూసారు.
నేను కృతజ్ఞత చెప్పాను తను వెళ్ళిపోయారు. పాపం తను ఏమీ అడగలేదు,సంతోషంగా వెళ్ళారు.
కానీ దునిలో ఇలా పిడకలు వేస్తారు అనే విషయం నాకు తెలియదు.
తరువాత ఒకసారి ద్వారకామాయి లో చూసాను ఉదయం 3 గంటల 30 నిమిషాలకి ద్వారకామాయి తలుపులు తీసి శుభ్రం చేసి ధునిలో బస్తాల కొద్ది పిడకలు వేసి వెలిగించారు.
అప్పుడు ఒక పిడక నేను తీసుకొని దండం పెట్టుకొని మళ్ళీ ఆ బస్తాఫై ఉంచాను. నేను చూస్తూ ఉన్నాను అది దుని లో చేరింది.
మన పాప కర్మలు కాల్చి వేసేందుకే దుని వెలిగిస్తారు.
ఓ !!! నాతో బాబా బలేగా పిడకలు వేయించారు అని మురిసిపొయ్యాను.
ధన్యవాదాలు చెప్పుకొని ఆనందంతో కాకడ హారతి ముగించుకొని వచ్చాము.
Thank You బాబా.
Latest Miracles:
- ఆవు పిడకల ఆవశ్యకత…Audio
- దైవలిఖితం…. మహనీయులు – 2020… జూలై 18
- శంకర్ లాల్ కె. భట్
- గోవిందా రావు గార్డె
- బాబా ఆశీర్వదించి దృష్టిని ప్రసాదించారు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
One comment on “ఆవు పిడకల ఆవశ్యకత.”
kishore Babu
May 12, 2018 at 12:58 amమీ లీలలు చదువుతుంటే మనసు అంతా బాబా వారితో నిండి పోయింది అనిపిస్తుంది…Thank you..