Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
Author:Kota Prakasam Garu
భగవద్గీత,బాబాచరిత్ర ఏ గ్రంధాలైనా అవి మనోధర్మంకోసం ఉద్దేశింపబడినవేతప్ప, శరీరభోగాలకొరకు కాదు
*****
దర్మం దారితప్పుతోంది అని ఒకరు, సన్నగిల్లిపోతోందని ఒకరు, ఆచారాలూ, సాంప్రదయాలు మంటకలిసిపోతున్నాయని మరికొందరు గగ్గోలుపెడుతూ వాపోతుంటారు.
సృష్టిధర్మానికి ఆపద వాటిల్లినప్పుడు, దర్మ రక్షణకొరకు ఎన్నో అవతారాలు ఒచ్చాయి, ఎడతెరిపిలేకుండా సూక్ష్మమార్గంలో ధర్మోపదేశాలు చేసే సద్గురువులు ఇప్పటికీ ప్రకటమై హితబోధ చేస్తూనేవున్నారు.
నీతి తప్పినచోట ధర్మానికి తావుండదు అంటారు.
సూర్యుడు, చందృడు ప్రణవాయువు మొదలూ సప్తసముద్రాల వరకు సృష్టిలో అనాదిగా తనధర్మాన్ని అది కొనసాగిస్తూనే ఉన్నాయి.
సృష్టి ధర్మంలో ఎంతమాత్రము వ్యత్యాసం వొచ్చినా, ప్రలయం సంభవించి , జీవరాశి మనుగడకే ముప్పువాటిల్లకతప్పదు.
ఆస్తులు , హోదాలు వీటికోసమే మనిషి నిరంతర ప్రయత్నమైపోయింది.
మహాభారతాన్ని చదివితె, ఇది యిప్పటిదికాదు, ఎప్పటినుండో ఉన్నదే అని అవగాహనకొస్తుంది .
సాక్షాత్తూ కృష్ణపరమాత్ముడే ధర్మాధర్మాలమధ్య అనునయించే ప్రయత్నంచేసి, రాయబారం చేసినా,
దర్మం కొన్ని సంవత్సరాలపాటు అజ్ఞాత, అరన్యవాసాలు చెయ్యక, అధర్మాన్ని అణచలేకపోయింది.
భగవంతుడైన, సద్గురువులైనా, సద్గ్రంథాలలో ప్రతి అక్షరం ప్రబోధించేవైనా, మనిషిని భుజంతట్టి స్వధర్మాన్ని పాటించమనే.
ప్రతి ఒక్కరికి ఈ శరీరం, తల్లి తండ్రి అనే సృష్టికార్యంలో సంభవించినవే, శరీరమే లెకుంటే ఆస్తులు, హొదాలు మొదలూ అసలు సృష్టిలో ఏజీవి మనుగడకు అవకాశమేలేదు, బలహీనతతో నశించిపోవాలన్న, థర్మాన్ని నెరవేర్చి, ఉత్తగతులు పొందాలన్నా, కారణమైన శరీరంలేక సాధ్యమేకాదు.
మనిషి సంపాదన సముద్రంపై కెరటంలాంటిది, ఎప్పుడు పైకెత్తుతుందో, ఎప్పుడు దిగజారుస్తుందో ఊహకందని విషయం సృష్టికి మూలం ఒకటుంది, అది అందించిన దర్మం ఎప్పటికి కుంటుబడదు, ఆ థర్మాన్ని గ్రహించి సృష్టిధర్మాన్ని అనుసరించేందుకు, ఆ ధర్మంలో ఒకభాగం ఈ శరీరం .
సృష్టికార్యంలో ఈ శరీరానికన్నా మించిన ఆస్తి, మిగతా మానవ ప్రయత్నాలముందు దిగదుడుపే అనిపిస్తుంది.
భగవద్గీత, బాబా సచ్చరిత్ర అవి ఏ గ్రంధాలైనాసరే, అవి మనోధర్మానికి సహకరించేవే తప్ప కృత్తిమమైన భోగాలకు ఉద్దేశింపబడినవికాదు.
మనిషి తనను తాను తెలుసుకునే ప్రయత్నంచేస్తె, సృష్టి ధర్మానికి తనవొంతు ఆచరించవలసిన ధర్మంకూడా ప్రబోధమౌతుంది.
సృష్టి తనవొంతు థర్మాన్ని అది ఎడతెరిపిలేకుండా సాగిపోతూనేవుంటుంది, దర్మం సన్నగిల్లినా, ధర్మానికి విఘాతంఏర్పడినా అది గతితప్పిన మనిషి మనోచర్యలవల్లనే అని పెద్దలంటారు.
జయ్ సమర్థ సద్గురు సాయి దేవ
***
Latest Miracles:
- ఏ నిమిషానికి ఏమికావలో మనము వెదుక్కుంటూ వెళ్లనక్కర్లేదు, అవి మన దగ్గరకే వస్తాయి బాబా కృపవుంటే–Audio
- బాబా నాతో భగవద్గీత చదివించారు.
- మనిషిరూపంలో- శిరిడీ సమాధిమందిరములో వుండే బాబావారి విగ్రహంముఖములా…Audio
- కాదు సుమా! కల కాదు సుమా!! …..సాయి@366 జనవరి 10…Audio
- సాయి అమ్మ.. సాయి నాన్న.. సాయే అన్ని ఈ జీవితానికి, ఇంతకు మించి ఏమి కావాలి
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments