సహనం లేని భక్తి.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ  సచ్చిదానంద సాయి రాజ్ మహారాజ్ కి జై.

నా పేరు మేడా లక్ష్మి ప్రసన్న.

సాయి బందువులకు నమస్కారం. బాబా మనకు ఓరిమి గురించి చాలా సందర్బాలలో వివరించారు.

మొదటగా బాబా మనకు నేర్పించేది  శాంతి, సహనం.

ఎవరు మిమ్మల్ని ఏమైనా అన్నా సరే నాకోసం అన్నీ ఓర్చుకున్న వారే నాకు ఇష్టులు.

వాదోపవాదాలకు ఇచ్చట స్తానం లేదు,  ప్రేమే  ఆయుధంగా జీవించండి, అందరిలో ఉన్నది నేనే అన్నారు బాబా.

వీటి గురించి బాబా ఎంత వివరిచినా, ఎన్ని పుస్తకాలు పారాయణం చేసినా తెలుసుకోలేని, అర్ధం చేసుకోలేని మనసుతో, అజ్ఞానంతో, కొట్టుమిట్టాడుతున్న జీవితాలు.

చాలా రోజుల కిందట మేము హైదరాబాద్ లో ఒక స్థలం తీసుకున్నాము.

కొన్ని రోజులు వాటి గురించి ఆలోచన లేదు, కొన్నాము అవి అలా ఉన్నాయి అంతే.

కొద్ది రోజులకు మన గవర్నమెంట్  చట్టబద్దత సవరణ చేయాలని అని ఆర్డర్.

మేము డబ్బులు కట్టాము, కానీ పని ముందుకు వెళ్ళలేదు.

ఈ గవర్నమెంట్ పనులు ఎక్కడ అవుతాయి, ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి చెప్పులు కూడా అరిగిపోతాయి,  పైగా మొక్కులు సమర్పించాలిగా, ఇది అందరికి తెలిసిన విషయం.

ఒక మాట మాట్లాడాలి అంటే గేటు బయట చాల సేపు నించోపెట్టేవాళ్ళు.

పెద్ద కార్ లో వస్తే వాళ్ళకు ఉన్న విలువ అంతా ఇంతా కాదు, జనాలని వెంట వేసుకొని వస్తే వొంగి, వొంగి  నమస్కారాలు చేస్తున్నారు.

ఇవన్నీ చూస్తూ మేము బయట నిలబడి ఉన్నాము.

నేను బాబాని తాతా అని పిలుస్తాను, తాతా చూసావా, నువ్వు చెప్పినవి పాటిస్తే ఇదేనా ఫలితం.

సంపదకోసం, పేరు, ప్రతిష్ట, అని పాకులాడ వద్దు, నిడారంబంగా ఉండాలి, భగవంతుని మన్ననలు పొందుటకు  పాకులాడండి, ఇవి అన్నీ మీరు చెప్పారు.

కానీ ఇది కలికాలం మేము అలా బతకడం చాలా కష్టం. మేము ఆద్యాత్మికం కలిగిన వారము.

మేము భగవత్ చింతనలో ఉన్నాము అంటే మా మొహాలు చూస్తారా వాళ్ళు, నీ మాట విని మేము చాలా పోగొట్టుకున్నాము, అవి అన్నీ నీకు తెలుసు.

ఇప్పుడు మాకు నువ్వు తప్ప ఎవరి రికమండేషన్ లేదు, ఇవి అన్నీ తాతని, నా మనసులో నేను అడిగిన ప్రశ్నలు.

కాని పని కాలేదు, తిరిగి తిరిగి చివరకు సమర్పయామి చేయడానికి కూడా మేము సిద్దంగా ఉన్నాము.

అప్పటికైనా పని చేస్తారా !  లేదు . సాయినాథ తండ్రి మా చేత కాదు . ఇక తిరిగే ఓపిక లేదయ్యా. నాలుగు నెలల పాటు తాతకి ప్రశ్నల అబిషేకం చేశాను.

ఎప్పుడు, అయితే అప్పుడు మావల్ల కాదు అని వదిలి వేసాము.

ఈ మద్య కాలంలో మళ్ళీ ఒక ప్రయత్నం చేసాము. రేపు రండి అనడం, ఒక గంట ఆగిరండి అని షరా మామూలు.

ఈలోగా లాస్ట్ డేట్ అయిపోయింది, మన కర్మకి ఆయన ఏమి చేస్తారులే. !!

ఒక రోజు మళ్ళీ జస్ట్ ట్రై చేద్దాము అని వెళితే  చాలా రోజులుగా తిరుగుతున్నారు అనీ చిటికలో పని చేసారు.

ఇది మాకు ఇంకా నమ్మశక్యంగా లేదు, లాస్ట్ డేట్ అయిపోయింది, అయినా బాబా చేయాలి అనుకుంటే ఏమైనా చేస్తారు. నేను బాధ పడ్డప్పుడు పని  చేసి ఉంటే ఖర్చు అయ్యేది.

కానీ బాబా నన్ను అన్ని విదాలుగా సేవ్ చెయ్యాలి అంటే నేను తొందర పడుతున్నాను.

ఎలా కృతజ్ఞత చెప్పాలి బాబా మీకు. నన్ను క్షమిస్తారా బాబా.

సద్గురు సాయినాథ్ మహా రాజ్ కి జై.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles