ఏ డాక్టర్ దగ్గరా లేని, ఏ డాక్టర్లు ఇవ్వలేని ఔషధం నా దగ్గర ఉంది. అదే బాబా ఊది.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


నాకు ఒక సారి యూరిన్ తెల్లగా మజ్జిగ తేట లాగా రావడం మొదలు పెట్టింది.

రెండు, మూడు రోజులయ్యాక, మా వారికి చెప్పాను. మా వారు వేరే ఒక డాక్టర్ కి ఫోన్ చేసి లక్షణాలు చెప్పారు.

ఆయన, మీ ఆవిడకి ఒంట్లో ఉన్న ఫ్యాట్స్ అన్ని పోతున్నాయి. అలాగే కొనసాగితే కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి.

ఫ్యాట్ కి సంభందించిన పదార్దాలు తినవద్దని, అంటే నెయ్యి, నూనె, పల్లీలు, నువ్వులు, కొబ్బరి లాంటివన్నీ మానేయమని, ఒక సారి వచ్చి టెస్ట్ చేయించుకోమని, మందులు వాడితే మంచిదని చెప్పారట.

మా వారు వెంటనే చాలా డేంజర్ అట, పద హాస్పిటల్ కి పోయి టెస్ట్ చేయించుకొని వద్దాం అన్నారు . ” నేను రాను నా డాక్టర్ బాబానే. నా మందు ఊదియే. అదే వాడతాను.

యూరిన్ తెల్లగా అవటం మినహా నాకే బాధ లేదు. కడుపులో నొప్పి కూడా లేదు. నా పని నేను చేసుకుంటున్నాను. వండుతున్నాను. పెడుతున్నాను ఇంకేం కావాలి. అంతగా ఇంకేదైనా ఇబ్బంది అయితే అప్పుడు చూద్దాంలే ” అని దాట వేసాను.

అలా మొదలైన సమస్య కొన్ని రోజులకి ఇంకా ఇంకా చిక్కబడి, అందులో రక్తం కూడా రావడం మొదలైంది.

రక్తం లో గడ్డలుగా రావడం తో యురినేషన్ కి ఇబ్బంది గా మారింది. నాకు వేరే ఇబ్బంది అంటూ ఏమి ఉండేది కాదు. కానీ మనిషిని మాత్రం చాలా సన్నగా అయిపోయాను.

కొంచెం నీరసంగా ఉంటూ ఉండేది. ఇంట్లో పిల్లలు వాళ్ళు గొడవ చేస్తుండే వారు, డాక్టర్ దగ్గరికి వెడదాం అని, మందులు వాడడం అని.

ఏం వద్దు అంటూ రోజూ గ్లాసెడు నీళ్ళల్లో ఊదీని వేసుకొని , తాగుతుండేదాన్ని, అలా రెండేళ్లు బాధ అనుభవించాను. రోజులు గడుస్తుంటే, మా వాళ్ళు నన్ను శతపోరాటం మొదలు పెట్టారు.

బలవంతంగా డాక్టరుకి చూపిస్తాం అంటూ ఉన్నారు. వాళ్ళ ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఇంకా అప్పుడు నేను బాబాకి చెప్పుకున్నాను.

” ఏమిటి? బాబా ఏం చేస్తున్నావు? నా ఈ బాధ కంటే, వీళ్ళ బాధ పడలేకపోతున్నాను. నీదే భారం తండ్రి !” అని దండం పెట్టుకున్నాను.

నేను క్షీణించి పోతున్నాను, అంటే ముందుగా బాబాకేగా తెలిసేది. నేనెందుకు భయపడాలి? నా గురించి నేనే ఎందుకు ఆలోచించాలి? ఏ డాక్టర్ దగ్గరా లేని, ఏ డాక్టర్లు ఇవ్వలేని ఔషధం నా దగ్గర ఉంది. అదే బాబా ఊది.

రోజూ రెండు పూటలా గ్లాసుడు నీళ్ళల్లో చిటికెడు ఊది వేసుకొని తాగేదాన్ని.

బాబా నా సహనాన్ని పరీక్ష చేశాడా? లేదా ఈ బాధను తట్టుకోలేక డాక్టర్ దగ్గరికి పరిగెత్తుతానో లేదో చూశాడో, లేదా నా కర్మలన్నింటినీ తీసేసాడో, ఒక రోజు ఉన్నట్లుండి నాకు యూరిన్ మాములుగా రావడం మొదలు పెట్టింది.

అంతే! ఆ రోజు నుంచి నార్మల్ అయిపోయింది. మా వారి స్నేహితులు అలా ఉండకూడదు, ఎప్పటికైనా ప్రమాదం. ఒక సారి డాక్టర్ కి చూపించుకుంటే బావుంటుంది అన్నారట.

2009 లో మొదలైన సమస్య 2011 వరకు కొనసాగింది. ఇప్పుడు 2015 వచ్చింది. ఇప్పటి వరకు ఎటువంటి సమస్యనూ నేను ఎదుర్కొనలేదు.

ఇప్పటికి నాకు ఏ చిన్న సమస్య ఎదురైనా నా మందు ఊది మాత్రమే. సర్వ వ్యాధి నివారిణి ఈ ఊది .

”సర్వ రోగ నివారిణి ఈ ఊది”. ఆ సాయినాథుని దయతో మేము, మా పిల్లలు, మనవళ్లు ఎంతో ఆరోగ్యం గా, ఆనందంగా, సంతోషంగా హాయిగా ఉన్నాము.

సర్వం శ్రీ సాయినాథ చరణవిందార్పణ మస్తు

శుభం భవతు

The above miracle has been typed by: Mrs. Rajarajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles