Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
నేను ఇవేమీ పట్టించుకునే స్థితిలో లేను హాస్పిటల్ లోపలి వెళ్ళాను, మా ఆయన్ని చూసాను, పడుకొని వున్నారు.
మా ఆయనది చాలా పెద్ద కుటుంబం. నలభై మంది దాకా వుంటారు. సాయంత్రానికల్లా అందరూ వచ్చేసారు.
అందరూ కూడా పగలు రాత్రి నా భుజం పైన చేయి వేసి నాకు ధైర్యం చెబుతూనే వున్నారు. నా కళ్ళముందే 13 మంది హార్ట్ ఎటాక్ తో ఎమర్జెన్సీ వార్డ్ నుండి విగత జీవులై బయటకి వెళ్లిపోయారు.
హాస్పిటల్లో ఏ డాక్టరు మాకు తెలియదు. ఎమర్జెన్సీ లో డాక్టర్స్ వచ్చి ఎవరైనా డాక్టర్ దగ్గరకి రిఫర్ చేస్తారా? అని అడిగింది.
“చూడమ్మా! నాకు ఎవరూ తెలియదు. నీకు ఎవరు మంచి అనిపిస్తే వారి చేత ట్రీట్మెంట్ చేయించండి ” అన్నాను. ” I THINK SHE IS REPRESENTATIVE OF BABA ” అనుకుంటూ,
DR. వెంకటేష్ అన్న ఆయనకి రిఫర్ చేసారు. నాకు ఆ హాస్పిటల్ టెన్షన్ కి డేట్ కాకపోయినా పీరియడ్స్ వచ్చేసాయి.
కొంతమందికి టెన్షన్ లో ఆలా అవుతుంది అని అక్కడ డాక్టర్ చెప్పింది. నాకు ఆవిడ హెల్ప్ చేసింది.
నేను ఇంటికి వెళ్ళిపోయి స్నానం చేసి బాగా తయారయ్యి, అంటే నేను మా వారు నన్ను ఎలా చూడటానికి ఇష్టపడతారో అంటే నవ్వుతూ, బొట్టు స్టికర్ బొట్టు కింద కుంకుమ కింద విభూది ఆలా పెట్టుకుంటే మా వారికి ఇష్టం. అందుకే ఆలా తయారయ్యి నవ్వుతూ వచ్చాను.
హాస్పిటల్ లో నాకు డాక్టర్ వెంకటేష్ గారు ఎదురయ్యారు. ఆయన నన్ను గమనించారు, కానీ ఏమి మాట్లాడలేదు,
6 గంటలకి పేషెంట్స్ ను చూడటానికి అనుమతి ఇస్తారు. ఆయనకి గుండెలో స్టంట్ వేసారు. కొన్ని రోజుల అనంతరం డిశ్చార్జ్ చేసారు.
ఆ సమయంలో డాక్టర్ వెంకటేష్ నన్ను అడిగారు ” పేషెంట్ ఇలా ICU లో సీరియస్ కండిషన్ లో ఉంటే నువ్వు రోజు ఉదయాన్నే అంత చక్కగా తయారయ్యి నవ్వుకుంటూ వస్తున్నావు అది నీకు ఎలా సాధ్యం అమ్మా!
పైగా నేను కనపడినా గాని నన్నేమి ప్రశ్నలు వేసి వేధించకుండా అతి సాధారణంగా ఎలా వుండగలిగావు తల్లీ! ” అంటూ ఆ నాటి నుండి ఆలా మనసులో ఉంచుకున్నారు కాబోలు అయన తన సందేహాలన్నీ బయట పెట్టారు.
” ఏం లేదండీ! మా వారికి నన్నలా చూడటం ఇష్టం. అందుకే ఆలా తయారు అయ్యాను ” అని చెప్పాను.
మేము ప్రతి నెల డాక్టర్ దగ్గరకి చెకప్ కి వెళ్తాము. సరిగ్గా ఏడాది తర్వాత వేసిన ‘ స్టంట్ ‘ ఫెయిల్ అయిపొయింది.
డాక్టర్ మళ్ళీ ఆపరేషన్ చేస్తాము అన్నారు. మేము చాలా భయపడ్డాము. చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్ రావడం. ఆపరేషన్ ఫెయిల్ అయిన తర్వాత ఒక సంవత్సరం పాటు ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా వుండటం చాలా కష్టం.
నేను అన్ని రకాలుగా ఫిజికల్ గా, మెంటల్ గా, డబ్బు పరంగా నొప్పిని అనుభవిస్తున్నాను. నేనింక ఈ భాదను అనుభవించడానికి సిద్ధంగా లేను అని మా వారు అన్నారు.
అందుకని నేను ఆపరేషన్ చేయించుకోను అని అన్నారు. ఆ డాక్టర్ గారు వయసులో, అనుభవంలో చాలా పెద్ద వారు.
నన్ను తన సొంత మనిషి లాగా పిలిచి కూర్చోపెట్టి ‘ ప్రియా నువ్వు ఒకసారి రామ్మా ‘ అంటూ తన ప్రక్కన కూర్చోపెట్టుకొని “
చూడమ్మా నీ భర్తకి ఏమి కాదు, తన ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డు వేస్తాను, ఈ ఆపరేషన్ కూడా నేనే చేస్తాను “, అని నాకు చాలా నచ్చజెప్పి ఒప్పించారు.
లక్ష రూపాయలు కంటే చాలా తక్కువ ఖర్చుతో మా వారికి ఆపరేషన్ చేసారు. ఇది మా జీవితంలో అద్భుతం కంటే మహా అద్భుతం అయిన ఈ సంఘటన,
ఇప్పటికి మా వారికి ఎటువంటి కంప్లైంట్స్, కాంప్లికేషన్స్ లేవు. ఆరోగ్యంగా, ఆనందంగా వున్నారు.
The above Telugu text has been typed by : Mr. Sai Krishna
Latest Miracles:
- సచ్చరిత్ర పారాయణ ఫలితం – కలలో వచ్చి వైద్యం చేసి ఆపరేషన్ అవసరం లేకుండా చేసిన బాబా గారు.
- జీవితంలో నా భర్త నడవటం కష్టం అని చెప్పిన డాక్టర్ మాటలను, అసత్యం చేసి, త్వరలోనే మామూలు మనిషిని చేసిన బాబా వారు
- ఆరోగ్యం బాగోలేని నా తమ్మునికి , స్వయంగా బాబా వారే ఆపరేషన్ చేసి జబ్బును నయం చేసిన వైనం …రవి కుమార్
- ఆ సాయి నాధుడే కదిలి వచ్చాడు ఒక కొత్త డాక్టర్ రూపం లో
- మా అమ్మాయికి ఆపరేషన్ చేసిన డా.సాయి
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments