Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
మా చిన్నబ్బాయికి పెళ్లి అయ్యాక వాళ్ళు ఉద్యోగ రీత్యా అమెరికా వెళ్లారు. కొన్నాళ్ళకి మా కోడలు గర్భవతి అయ్యింది.
ముందు నుంచే మేము కానీ, కోడలి అమ్మ నాన్న కానీ అమెరికాకి వెడితే, ఆరు నెలలకి మించి ఉండకూడదు కాబట్టి, డెలివరి టైం కి వెళ్ళవచ్చు అని మేము కానీ వాళ్ళు కానీ దగ్గర లేము.
ఇంకా మా వియ్యాల వారికైతే వీసాలు, పాసుపోర్ట్స్ కూడా ఏమీ లేవు. అప్పుడే apply చేసుకున్నారు.
కోడలికి ఆరవ నెల గడుస్తుండగా డాక్టర్ దగ్గరికి వెడితే లోపల పాప రెండు వారాల ఎదుగుదల తక్కువగా ఉంది అని చెప్పి తగిన జాగ్రత్తలు చెప్పి మందులు రాసిచ్చారట.
ఏడవ నెల వచ్చిన రోజే మా వాడు ఆఫీసుకు వెళ్ళగానే మా కోడలు ఫిట్స్ లాగా వచ్చి పడిపోయింది.
చుట్టుపక్కల వాళ్ళు చూసి అబ్బాయి కి ఫోన్ చేసి చెబితే మా వాడు ” ఏం ఫరవాలేదులే నిన్ననే డాక్టర్ దగ్గరికి వెళ్లి వచ్చాము. కాస్త రెస్ట్ తీసుకుంటే అదే తగ్గిపోతుంది అన్నాడట.
సాయంత్రం ఇంటికి వచ్చాక మా వాడు కోడలి కండిషన్ చూసి, వెంటనే హాస్పిటల్ కి తీసుకువెడితే, డాక్టర్ చూసి కండిషన్ చాలా బ్యాడ్ గా ఉంది.
తల్లి గానీ, పాప గానీ ఎవరో ఒకరే బ్రతికే ఛాన్స్ ఉంది, అని డాక్టర్ చెప్పారుట. వెంటనే ఆపరేషన్ చెయ్యాలి అన్నారుట, ఆపరేషన్ చేసి పాప ని బయటికి తీసారట.
పాప ఎదగలేదు కాబట్టి, లంగ్స్ తయారవలేదట. కాళ్ళు, చేతులు పుల్లల్లాగా ఉన్నాయట, పాపకి ప్రాణం ఉంది.
వెంటనే డాక్టర్స్ ఇంక్యూబేటర్ లో పాపని ఉంచారుట. నాకు ఫోన్ చేసి అంతా వివరంగా చెప్పాడు.
నాకు వీసా, పాస్పోర్ట్ రెడీ గా ఉండటాన వెంటనే బయలు దేరి అమెరికా వెళ్లాను. ఈ లోగా పాపకి ట్యూబ్ లు, గొట్టాలు అన్నీ పెట్టారట.
అలా ఉన్న పాపకి ఫోటో ఒకటి తీసి, ఆ ఫోటో ను అమెరికా లో ఉన్న మా అబ్బాయి ఇంట్లో ఉన్న సాయిబాబా ఫోటో కొని పాదాల దగ్గర అతికించాడు.
మా వాడు కూడా సాయిబాబా భక్తుడు. బాబా ని 100 శాతం నమ్ముతాడు.
నేను ఇంట్లోకి వస్తూనే బాబా పాదాల దగ్గర ఉన్న పాపాయి ఫోటో చూసి, ” ఒరేయ్ ! పిల్లని చేర్చవలసిన చోటకే చేర్చావు రా!” అన్నాను.
నేను హాస్పిటల్ కి వెళ్లి పాపని, కోడల్ని చూసాను. డాక్టర్ని కలిసి విషయం అడిగాను.
పాప పరిస్థితి ఏమి బాగాలేదని కొన్ని రోజులు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేమని, 90 % బ్రతకదని, బ్రతికిన ఎదో ఒక లోపంతో అంటే మెంటల్లీ రిటార్డడ్ & physically handicapped గా ఉంటుందని చెప్పాడు.
పాపని చూస్తే భయం వేసింది. పుల్లల్లాగా ఉన్న కాళ్ళు చేతులు, మిరియాల్లాటి కళ్లు పేరుకు ప్రాణం ఉంది.
నేను ఇంటికి వచ్చాక, బాబా ముందు నిలబడి, ” ఓ ! సాయి నీ చాలీసా 40 రోజులు 108 సార్లు పారాయణ చేస్తాను. పిల్ల బావుంటుందా ఉంచు.
ఏ మాత్రం బావుండదా. ఎదో ఒక లోపంతోటి దాన్ని భూమి మీద ఉంచకు ఎందుకంటే దాన్ని మేము అలా చూసి బాధ పడలేము.
అదీ పాపం! బ్రతికినన్నాళ్ళు కష్టపడుతూనే ఉంటుంది. అదేదో ఇప్పుడే తీసుకు పోయావనుకో, కొద్ధి రోజులు ఏడుస్తాం. ఆ తర్వాత ఉరుకుంటాము.
అది అనాకారిగా, అంగ వైకల్యంతో బ్రతికితే జీవితాంతం ఏడవాలి. మరి ఏం చేస్తావో బాబా నీ ఇష్టం ” అని దండం పెట్టుకొని పారాయణ మొదలుపెట్టాను.
రోజూ హాస్పిటల్ కి వెళ్లి పిల్లని చూసి రావడం, పారాయణ గురుపౌర్ణమికి ముందు రోజు పూర్తి అయింది.
రోజు హాస్పిటల్ కి వెళ్లి పాపని చూసి వచేదాన్ని గురుపౌర్ణమి ముందు రోజు, పాపకి కాస్త మెరుగైంది, ఇంటికి తీసుకెళ్లండి. అని డాక్టర్ అన్నాడు.
ఆ పాప ఇప్పుడు చాల ఆరోగ్యం గా ఉంది. అందరికంటే ఎంతో యాక్టీవ్ గా, ఆట పాటలతో చురుగ్గా ఉంటుంది.
అంగ వైకల్యం తో కానీ, మానసికంగా గానీ బావుండదు అని చెప్పిన డాక్టర్ ఆశ్చర్య పోయాడు.
The above miracle has been typed by: Mrs. Rajarajeswari Sainathuni
Latest Miracles:
- కొంత సమయం తరువాత పాప బ్రతికింది అందరూ బాబా లీలను చూసి ఆశ్చర్యపోయారు.
- ఒక డాక్టర్ గారి భార్య శరీరం లో ఉన్న భూతం వదిలించిన బాబా వారు
- నిరుపేద విద్యార్థిని డాక్టరును చేసిన బాబా
- ” ఊదీ ” మహిమతో ఎంతటి నొప్పి అయినా మటుమాయం …………………!
- కష్టములొ ఉన్న భక్తురాలికి, మరచిన మ్రొక్కును గుర్తు చేసిన బాబా వారు….
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments