సాయి అమ్మ.. సాయి నాన్న.. సాయే అన్ని ఈ జీవితానికి, ఇంతకు మించి ఏమి కావాలి



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


 

సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా

 

నా జీవితం లో జరిగిన ఈ అనుభవం నేను ఎప్పటికి మరువలేనిది.

నేను గురువారం సాయి కి ఇంట్లో నే పూజ చేసి వంట చేసి ఆ పదార్థాలు సాయి ముందు పెడతాను కానీ నా మనసులో ఎప్పుడు ఒక అనుమానం ఉండేది.

బాబా నిజంగా దాన్ని స్వీకరిస్తారా అని..చాలా సార్లు తింటున్నావా బాబా అని మనసులోనే ఆడిగేదాన్ని,

నీ నుండి నేను ఏమి ఆశించకుండా నేను నీకు చేయగలిగింది, నీకు భోజనం పెట్టడమే సాయి తండ్రి అని వేడుకునేదాన్ని.

ఒకరోజు అలానే చేసాను, మధ్యాహ్నం ఆరతి చూస్తూ పాడుతూ ఉన్నాను మెయిన్ డోర్స్ దగ్గరకు వేసి ఎదురుగా హలో లో ఒక మనిషి డోర్స్ ఓపెన్ చేసి నాకు ఎదురుగా నిలబడి ఉన్నట్లు ఫీలింగ్ వచ్చింది.

నాకు సడన్ గా భయం వేసింది నా గుండె చాలా ఫాస్ట్ గా కొట్టుకున్నది.

నా ఎదురుగా బాబా ఫోటో ఉంది అప్పుడు నా మనసు కు ఆలోచన వచ్చింది నేను నువ్వు వస్తున్నావా, తింటున్నావా నాకు తెలియాలి అని అడిగినందుకు ఆ సాయి నాకు నీ మాటలు నేను వింటున్నాను అని నిరూపించాడు

ఓ బాబా నీ కృప ఎప్పుడు నాపై ఇలానే ఉండేలా చూపించు తండ్రి.

నీవు తప్ప ఈ జీవితానికి ఎవ్వరు దిక్కు లేరు నువ్వు ఉన్నవనే నమ్మకం తోనే బ్రతుకుతున్నాను

ఓం సాయి రాం

ఆ బాబాని గురువు గా కాకుండా

దేవుడిలా కాకుండా

ఒక తండ్రి లా ప్రేమించే

నీ కూతురు

శ్రావణి

మైలవరం కృష్ణా జిల్లా.

 

 

సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా

 

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్ఫూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles