Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ముందు భాగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై !!
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై !!
ఒకసారి మళ్ళీ మా నాన్నకి వాకింగ్ ప్రాబ్లెమ్ వచ్చింది.హాస్పిటల్కి తీసుకువెళితే ,jr డాక్టర్, రిపోర్ట్స్ అన్ని చెక్ చేసి మళ్ళీ వెన్నుముకపై ఎక్స్ట్రా బోన్ గ్రోత్ ఐంది.సర్జరీ చేయాల్సిందే తప్పదు అని చెప్పారు.sr .డాక్టర్ తో సంప్రదించి సర్జరీ డేట్ కూడా ఇచ్చారు.
నాకు బయమేసింది.బాబాకి చెప్పుకున్నాను.బాబా మా నాన్న మిమ్మల్ని నమ్మడు కావచ్చు కానీ,తాను మీ బిడ్డనే కదా.తన బిడ్డ ని ఐన నేను మిమ్మల్ని నమ్ముతున్నాను కదా,నా కోసమైనా తనకి బాగయ్యేలా చెయ్యి ప్లీజ్.
మా అమ్మ నాన్న హ్యాపీ గ ఉంటేనే కదా నేను హ్యాపీ గ ఉంటాను.వాళ్ళకి బాగాలేక బాధపడుతూ ఉంటె,మీరు నాకు ఎన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చిన నేను హ్యాపీ గ ఉండలేను.నాకు మీరంటే ఇష్టం.అలానే మా పేరెంట్స్ అంటే కూడా ఇష్టం.మీరు కావాలి,వాళ్ళు కావాలి.మా నాన్న తెలియక,తెలిసి చేసిన తప్పులని మన్నించి తనకి ఆరోగ్యాన్ని ప్రసాదించు.
ఒకవేళ తాను చేసుకున్న పుణ్యం సరిపోదు అనుకుంటే.నేనేమైన పుణ్యం చేసుకుని ఉంటె అది మొత్తం తనకి ట్రాన్సఫర్ చేసి తన ఆరోగ్యం బాగు చేయి.తరువాత నాకు ప్రాబ్లెమ్ వచ్చినా పర్లేదు.కానీ తనకి బాగవ్వాలి.
ఒక కూతురిగా మా పేరెంట్స్ కష్టపడకుండా నేను చూసుకోవాలికదా.సరే ఆలా కుదరదు కర్మ ని అనుభవించే తీరాలి అని మీరనుకుంటే, మా నాన్న హెల్త్ ప్రాబ్లెమ్ నాకు ఇవ్వు.ఆ కర్మ ని తన కూతురిగా నేను అనుభవిస్తాను.ఇంత కన్నా ఎలా అడగాలో ఏం చెయ్యాలో నాకు అర్ధం కావడం లేదు అని చెప్పుకున్నాను.
అంతకుముందు దత్తుణ్ణి నాన్న హెల్త్ గురించి అడగగానే సర్జరీ లేకుండా చేసారు కదా అని మళ్ళీ దత్తుణ్ణి కోరుకున్నాను.ఎందుకో మా నాన్న హెల్త్ ని దత్తుడే కాపాడుతున్నాడు అని నాకు అనిపించేది.అందుకోసం దత్తునిది వజ్రకవచం బుక్ ని పూజారి ఇస్తే రోజు చదివేదాన్ని.అప్పటికి మా నాన్న కీ మెడిసిన్స్ తో కొంచం క్యూర్ ఐంది.కానీ పూర్తిగా కాలేదు.
సర్జరీ డేట్ దగ్గరికి వచ్చింది కదా ఎప్పుడు హాస్పిటల్ లో జాయిన్ అవ్వాలి అని తెలుసుకోవడానికి నేను హాస్పిటల్ కీ వెళ్ళాను.వెళ్లే ముందు దత్తుని నామం చెప్పుకుంటూనే ఉన్నాను.jr డాక్టర్ జూన్ 2 కి జాయిన్ అవ్వండి.అంత రెడీ గానే ఉంది .ఒకసారి sr .డాక్టర్ తో డేట్ కన్ఫమ్ చేసుకుంటాను ఆరోజు ఇంకా ఏమైనా సర్జరీస్ ఉన్నాయా అని, చెప్పి లోపలికీ వెళ్ళాడు నేను వెళ్లాను తనతో పాటు.
మనసులో నామం చెప్పుకోవడం మాత్రం ఆపలేదు ఏదో చిన్న హోప్.sr .డాక్టర్ రిపోర్ట్స్ చూసి సర్జరీ అవసరం లేదు.జస్ట్ మెడిసిన్ ఇవ్వండి చాలు అన్నాడు.
jr డాక్టర్ సర్జరీ కీ డేట్ కూడా డిసైడ్ చేసాము కదా అంటే.అవునా? కానీ సర్జరీ అవసరం లేదు అని స్ట్రాంగ్ గా చెప్పాడు.jr డాక్టర్ ఆశ్చర్యం తో మళ్ళీ మళ్ళీ sr .డాక్టర్ ని అడుగుతున్నాడు.
sr .డాక్టర్ సర్జరీ అనేది లాస్ట్ ఆప్షన్ ఇప్పుడు అవసరం లేదు అన్నాడు. .నాకు ఫుల్ హ్యాపీ అనిపించి నాన్నకి కాల్ చేశాను.తాను నమ్మలేదు.నేను సర్జరీ అంటే బయపడతాను అని నువ్వు ఆలా చెపుతున్నావేమో లేకుంటే డేట్ కూడా ఇచ్చి, ఇప్పుడు ఎలా వద్దంటారు అన్నాడు.
నేను మళ్ళీ వెళ్లి sr .డాక్టర్ తో మాట్లాడించాక అప్పుడు హ్యాపీ గా ఫీల్ అయ్యారు.కొన్ని రోజులకిఎలాంటి సర్జరీ లేకుండా మా నాన్న వాకింగ్ నార్మల్ అయిపోయింది
.నాకు చాల హ్యాపీ అనిపించింది.బాబా,దత్తుడు మా నాన్నకి ఆలా క్యూర్ చేసారని.వాళ్ళు చేసిన మేలుని ఎప్పుడు ఆలా గుర్తుపెట్టుకుని వాళ్ళని తలుచుకోవడమే నేను వాళ్లపై చూపించే కృతజ్ఞత అనుకుంటాను.
తరువాతి భాగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Latest Miracles:
- ప్రాణ గండం నుండి కాపాడిన కాలాతీతుడు
- బాబా నే స్వయంగా వచ్చి అభయం ఇచ్చారు…2
- సాయి అమ్మ.. సాయి నాన్న.. సాయే అన్ని ఈ జీవితానికి, ఇంతకు మించి ఏమి కావాలి
- సైనస్ కి సర్జరీ వద్దు – నామీద నమ్మకముంచు–Audio
- నేనెప్పుడూ గురువుగారికి, బాబాకి గారాల కూతురినే అని చాల హ్యాపీ గా అనిపించింది.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “మా అమ్మ నాన్న హ్యాపీ గ ఉంటేనే కదా నేను హ్యాపీ గ ఉంటాను.”
Sreenivas
January 23, 2017 at 8:42 amSai Baba…Sai Baba….Sai Baba
Maruthi.Velaga
January 23, 2017 at 10:58 amSaibaba saibaba saibaba saibaba..