యు . కే భక్తురాలి అనుభవాలు 2వ బాగం..



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

ముందు బాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి….

యునైటెడ్ కింగ్డం నుండి ఒక సాయి భక్తురాలి కొన్ని అనుభవాలు నిన్న తెలుసుకున్నాము, మరి  కొన్ని  బాబా లీలలను ఈ రోజు తెలుసుకుందాము.

యింకొక మంచి అనుభూతి యేమిటంటే రాత్రి నేను శివుడి గుడినించి వస్తున్నప్పుడు, నా వెనకాల ఒక ముసలాయన నడుస్తున్నాడు. అతని గడ్డం తెల్లగా ఉంది, తెల్లని దుస్తులు, చిన్న తెల్లని టోపీ, కఱ్ఱ కూడా ఉంది. అది రాత్రివేళ కాబట్టి నేను యింకా వేగంగా నడవడం మొదలుపెట్టాను, కాని అదే సమయంలో నేను నా వెనకనే నడుస్తున్న మనిషి గురించే ఆలోచిస్తున్నాను. నేను గమనించింది మీరనుకుంటున్నట్టు అది ఆథునికమైన వాకింగ్ స్టిక్ కాదు, కాని బాగా పాత కఱ్ఱ.  వేగంగా నడుస్తున్నప్పుడు, నావెనక కఱ్ఱ చప్పుడు వేగం విన్నాను. నేనప్పుడు సాయిబాబాని ప్రార్థించాను, “నాకు యిప్పుడు భయంగా ఉంది, బాబా నాకు సాయం చెయ్యి” అని. కఱ్ఱ యొక్క శబ్దం ఆగిపోయింది. నేను చుట్టూ చూసేటప్పటికి యెవరూ లేరు. నేను నడుస్తున్న రోడ్డు సన్నగా ఉంది. అతను కనపడకపోవటానికి యింకెవరూ నడుస్తున్నవాళ్ళు లేరు. ఆయన సాయిబాబా అని నేను నమ్ముతున్నాను, ఆయన ప్రేమకి నేను కృతజ్ణురాలిని.

ఒకసారిా బాబా మందిరంలో  ప్రతీవారికి కూడా, సాయి సచ్చరిత్రళొ ఒక అథ్యాయాన్ని చదివే అవకాశం లభిస్తుంది. నేను ముందర “నో” అని చెప్పాను. మనం బిగ్గరగా చదవాలేమో అనుకున్నాను, యెందుకంటే నాకు మొహమాటం, యింకా నాకు నమ్మకం లేదు. యేమైనప్పటికీ అది నా తప్పు. నీకు బాబా ఉంటే భయపడవలసిన అవసరం లేదు. కాని అటువంటి మంచి అవకాశానికి కొంతమంది తమ అజ్ణానం వల్ల దురదృష్టం వల్ల “నో” అని చెపుతారు. ఒక  రోజు నేను గుడికి వెళ్ళాను, అక్కడ పారాయణ కొనసాగుతోంది, కాని యెవరూ కూడా పైకి బిగ్గరగా చదవటల్లేదు. నన్ను క్షమించమని నేను సాయిబాబాని ప్రార్థించాను. అక్కడ చదివే వారి జాబితా నిండిపోయి ఉందని నాకు తెలుసు. యేమైనా గాని నేను బాబాని నన్ను క్షమించమని అడిగాను, ఆయన నన్ను క్షమిస్తే కనక, ఒక అథ్యాయం నన్ను చదివేలా చేయమని బాబాని అడిగాను. నేను ఇది అడగగానే ఒకాయన సాయిబాబా సచ్చరిత్రలో ఒక అథ్యాయం చదవడానికి ఒక ఖాళీ ఉందని చెప్పారు.  క్షమించినందుకు నేను బాబాకి థన్యవాదాలు తెలుపుకున్నాను.

యింకొక లీల గురువారము నాడు పల్లకీ ఉత్సవం. బాబాకి పళ్ళాలు పట్టుకోవడానికి కొంతమంది అమ్మాయిలని సెలెక్ట్ చేశారు. బాబా దయవల్ల ఈ ఉత్సవంలో పాల్గోడానికి నేను అనుమతించబడ్డాను.  యేమైనప్పటికి నేను అందులో ఎక్స్ ట్రా ఉన్నాను. నేను పట్టుకోవడానికి యే పళ్ళెమూ మిగలలేదు. ఆ సమయంలో నాకు చాలా బాథ వేసింది. కాని బాబా దయ వల్ల ఒకరు నాకోసం కొన్ని పరికరాలు లార్డ్ శివా మందిరానికి తీసుకువెళ్ళడానికి ఇచ్చారు, తిరిగి వచ్చేటప్పుడు మోసుకురావడానికి కొబ్బరికాయలు ఇచ్చారు. బాబాగారు నాకు, తన వద్దకు వచ్చే భక్తులందరికి చేసినట్లుగానే, యెల్లప్పుడు మన మనసులోని మాటలను విన్నట్లుగానె ,తన నిరంతర సహాయాన్ని కనపరిచారు. (బాబా థన్యవాదములు)

నిజానికి నేను శేజ్ ఆరతిలో పాల్గొందామనుకున్నప్పుడు, ఈ పల్లకీ ఉత్సవంలో పాల్గొనడానికి బాబా గారు అనుమతించి తన లీలను చూపారు. అలా చేయడానికి నాకు అవకాశమిచ్చారు (కొంతసేపు వేచి ఉన్నాక). పరుగెత్తుకుని వచ్చే భక్తులు ఆయనకి చాలా మంది ఉన్నారు. నేనెప్పుడూ ఆయనకి కృతజ్ణురాలిని. బాబా మాయింటికి భిక్షకు కూడా వచ్చినందుకు థన్యవాదములు, దయ చేసి మా అందరి యిళ్ళకు యెల్లప్పుడూ రండి.

నేను అందరికీ సలహా ఇచ్చేదేమంటే, సచ్చరిత్ర, భగవద్గీత కలిపి చదివితే, రెండిటికీ పూర్తి సంపూర్ణత కలిగి మంచి అనుభవాన్నిస్తుంది.

బాబా మనలనెప్పుడూ ఆశీర్వదించుగాక. బాబా మామీదెప్పుడు కోపగించవద్దు.

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles