ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ఇంత దూరం వచ్చాను.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!

ముందు భాగం కోసం ఇక్కడ  క్లిక్ చేయండి

 

(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)

 

‘‘నన్ను మీరే కాపాడాలి బాబా! నాకు మీరే దిక్కు.’ అన్నాడు.‘నిన్ను కాపాడే పూచీ నాది. భయపడకు.’ అభయం ఇచ్చాను.

చెన్నబసప్పను కొట్టడానికి వచ్చిన వీరభద్రప్పను వారించాను. నచ్చజెప్పి పంపించేశాను. నన్నూ, చెన్నబసప్పనీ, భార్య గౌరినీ ద్వేషిస్తూ అసహ్యించుకుంటూ మంచం పట్టాడు వీరభద్రప్ప. చనిపోయాడు ఆఖరికి.

అతగాడే ఇప్పుడు ఈ పాముగా జన్మించాడు. చెన్నబసప్ప కూడా చనిపోయి పాపం, కప్పలా పుట్టాడు. కసి తీర్చుకునేందుకు వెతికి వెతికి పట్టుకున్నాడు వీరభద్రప్ప. నోటికి చిక్కాడు చెన్నబసప్ప.’ అని నవ్వాను.

భక్తుడు ఆశ్చర్యపోతూ కళ్ళు పెద్దవి చేశాడు.‘ఆ పాము, కప్పని పట్టుకోవడం వెనుక ఇంత కథ ఉందా?’ అడిగాడు భక్తుడు.అవునన్నట్టుగా తలూపాను.

‘తనని కాపాడతానని చెన్నబసప్పకు మాట ఇచ్చాన్నేను. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ఇంత దూరం వచ్చాను.

జన్మ జన్మలకూ చెన్నబసప్పను కాపాడుతూ వస్తున్నానని ఈనాడయినా వీరభద్రప్ప తెలుసుకుంటే ఇకమీదటయినా అతని జోలికి రాకుండా ఉంటాడు.

వచ్చాడా! నా బాధ్యత నేను నిర్వర్తించక తప్పదు.’ అన్నాన్నేను.

కథ ముగిసింది.బాబా చెప్పడం ఆపారు. శ్యామా, కాశీరాం, షిండే, తాత్యాలు ఒకరినొకరు చూసుకున్నారు. సత్యాన్ని తెలుసుకున్న వారిలా ఒకరికొకరు వెలిగిపోతూ కనిపించారు.

పునర్జన్మలు ఉన్నాయి. చేసిన పాపాలు చెల్లిపోయే వరకు పుడుతూ గిడుతూ, గిడుతూ పుడుతూ ఉండాలి. తప్పదనుకున్నారంతా.

‘‘మనం చేసే ప్రతిపనీ ఎవరికి మంచి చేస్తుంది? ఎవరికి చె డు చేస్తుంది? సత్ఫలితాలు ఏ మేరకు ఉంటాయి.

ఆ సత్ఫలితాలు తరతరాలుగా ఏ విధంగా రూపు దిద్దుకుంటాయి? అవి సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? అన్నది ఆలోచించగలిగితే ప్రతి పని చేసే ముందూ ఒక్క క్షణం ఆలోచిస్తాం.

ఆ క్షణాన్ని నేనే! అది నాదే! నన్ను తలచుకుంటే అంతా మంచే జరుగుతుంది.’’ అన్నారు బాబా.చేతులు జోడించారంతా.‘‘అల్లా మాలిక్‌’’ అన్నారు బాబా. ద్వారకామాయి పైకప్పుకేసి చూశారు. ఒక్కసారిగా సంకీర్తనలు వినవచ్చాయి.

సాయంత్రం అయినట్టుగా ఉంది. భక్తులంతా దేవుణ్ణి ప్రార్థిస్తూ ద్వారకామాయికి చేరుకుంటున్నారు. బాబా దర్శనానికి భక్తులకు అవకాశం ఇచ్చేందుకు అయన ముందు నుంచి లేచి పక్కకి తప్పుకున్నారు శ్యామా తదితరులు.

తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles