‘‘నీకిష్టమే! కాని, నిన్ను అంత దూరం పంపించడం నాకిష్టం లేదు.’’



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!

ముందు భాగం కోసం ఇక్కడ  క్లిక్ చేయండి

 

(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)

 

‘‘నువ్వు చెప్పావని ఉద్యోగం మానేస్తాడు. తర్వాతేం చేస్తాడు?’’ అడిగాడు మళ్ళీ.‘‘ఆడతాడు. పాడతాడు. చూడలా.’’ అన్నారు బాబా.

చెప్పినట్టుగానే తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు దాసగణు. బాబా భక్త బృందంలో ఒకడయ్యాడు.

దాసగణుది మంచి గొంతు.సంగీతం అతనికి బాగా తెలుసు. కీర్తనలు పాడేవాడతను. వినసొంపుగా ఉండేవవి.‘‘దాసగణు హరికథలు కూడా బాగా చెబుతాడు బాబా’’ అన్నాడు నానా.

‘‘మరింకనేం? చెప్పమను.’’ అన్నారు బాబా. ఆ మాట పట్టుకుని, బాబా మీద హరికథను అల్లాడు దాసగణు. దానిని గ్రామగ్రామాన ప్రచారం చేయసాగాడు.

బాబా మహిమలూ, లీలలూ దాసగణు గానం చేస్తోంటే, ఎందరికో ఆయన్ని చూడాలనిపించింది. వారి పాదాలను ఆశ్రయించాలనిపించింది. పరుగుదీసి రాసాగారు. వేలాది మంది భక్తులు ద్వారకామాయిని చేరుకోసాగారు.

ఒకరోజు పొద్దునే బాబాని దర్శించి ఇలా అడిగాడు దాసగణు.‘‘నేను సింగ్బాకు వెళ్ళి గంగలో స్నానం చేసి వస్తాను.’’గోదావరినే అక్కడంతా ‘గంగ’ అంటారు.‘‘అంత దూరం దేనికి? వద్దులే’’ అన్నారు బాబా. ఆశ్చర్యపోయాడు దాసగణు.

గంగలో స్నానం అంటే బాబా ఒప్పుకుంటారు. వెళ్ళి రమ్మంటారు అనుకున్నాడు. ఇలా వద్దంటారని ఊహించలేదు.

‘‘గంగాస్నానం బాబా! నాకు చాలా ఇష్టం.’’ అన్నాడు దాసగణు.‘‘నీకిష్టమే! కాని, నిన్ను అంత దూరం పంపించడం నాకిష్టం లేదు.’’ అన్నారు బాబా.

‘‘అంత దూరం ఏముంది బాబా? దగ్గరేగా, పైగా సింగ్బా కన్నా దగ్గరలో ఏముంది?’’ అన్నాడు దాసగణు. అతనికి గంగలో మునిగి రావాలని కోరిగ్గా ఉంది. వెళ్ళేందుకు ఉత్సాహపడుతున్నాడు.

‘‘సింగ్బా కన్నా దగ్గర్లోనే గంగా యమునలు ఉన్నాయి. నీ ఎదురుగానే ఉన్నాయి. ఇక్కడే స్నానం చెయ్యి.’’ అన్నారు బాబా.

‘‘ఎక్కడ’’ నవ్వాడు దాసగణు.‘‘ఇక్కడ’’ అన్నారు బాబా. తన పాదాలను చూపించారు.‘‘గంగాజలం కోసం దోసిలి పట్టు, పడుతుంది.’’ అన్నారు.

బాబా తనని ఆటపట్టించడం లేదుకదా అనుకున్నాడు దాసగణు. బాధగా చూశాడు బాబాని.‘‘చెబుతుంటే వినవేఁ! దోసిలి పట్టు, గంగాజలం అందుకో’’ రెట్టించారు బాబా.

దాసగణు దోసిలి పట్టాడు. బాబా పాదాల దగ్గరగా కూర్చున్నాడు. బాబా కళ్ళు మూసుకున్నారు. ప్రార్థించసాగారు. అంతే! ఆయన కాలి బొటన వేళ్ళ మీదుగా గంగా యమునలు ధారగా ఎగజిమ్మసాగాయి. దాసగణు దోసిలి నిండుకుంది.

ఆశ్చర్యపోయాడు దాసగణు.‘‘బాబా’’ అన్నాడు ఆనందంగా. దోసిట నీటిని త ల మీద జల్లుకున్నాడు. శరీరం అంతా పులకించిపోయింది. పునీతమయినట్టుగా పరవశించిపోయింది.

అడిగితేనే కాని అమ్మ పెట్టదంటారు. బాబాని అడగక్కర్లేదు, మనకి ఏం కావాలో బాబాకి తెలుసు. దాన్ని సునాయసంగా అందిస్తారాయన.

గంగా యమునలే కాదు, కావాలంటే సప్త సముద్రాలనీ మన ముందు పొంగిస్తారనుకున్నాడు దాసగణు. చేతులు జోడించి, తన్మయత్వంగా ఊగిపోసాగాడు.

 

తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “‘‘నీకిష్టమే! కాని, నిన్ను అంత దూరం పంపించడం నాకిష్టం లేదు.’’

Mallika

Saibaba Saibaba Saibaba…

Baba premanu ma andariki inka inka panchutunanduku Srinivas Murthy gariki… Sai Suresh gariki… Prathiba gariki chala chala thanks andi…

Nenu Hemadpath garu rasina satcharitra exact translation from Marathi to Telugu book chaduvudam anukunnanu andi… ma nanagaru parayanam chesaru… book ma intlo undhi….. but nenu Ikkadiki(USki) ela tepinchukovala anukedanini…. mi dvara eh posts dvara Baba naku anda chestunnaru….. Saibaba Saibaba….

Sai Suresh

మాదేముందు సాయి. అంత బాబా అనుగ్రహమే సాయి

prathibha sainathuni

thak u mallika garu..i agree with sai suresh garu..

Sreenivas

Thanks Madam…Sai Baba..Sai Baba

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles