Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)
‘‘ఎవరితను?’’ దీక్షిత్‌ను ఉద్దేశించి మిరికర్‌ని అడిగాడు శ్యామా. చెప్పాడు మిరికర్. అప్పుడు ఇలా అన్నాడు శ్యామా.‘‘ఆలోచిస్తుంటే అర్థం అవుతోంది. బాబా నన్ను ఇక్కడకి కావాలనే పంపించారు. నిన్ను కూడా కావాలనే కలవమన్నారు.
‘మిరికర్‌ని ఓసారి కలువు’ అన్నది దీక్షిత్ కోసమే అయి ఉంటుంది.’’‘‘అవును, అనుమానం లేదు. దీక్షిత్ కోసమే అయి ఉంటుంది.’’ అన్నాడు మిరికర్.‘‘దీక్షిత్ బాబా నుంచి పిలుపొచ్చింది. ఇక ఆలస్యం చెయ్యకు. షిరిడికి బయల్దేరు.’’ అన్నాడు మిరికర్.
ఆ క్షణమే శ్యామాతో బయల్దేరాడు దీక్షిత్. మర్నాడు ఉదయానికి షిరిడి చేరుకున్నారిద్దరూ. షిరిడికి చేరుకున్న దగ్గర్నుంచీ బాబా కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూడసాగాడు దీక్షిత్.
‘‘బాబా ఎక్కడ? ద్వారకామాయి ఎక్కడ’’ అంటూ అడగసాగాడు శ్యామాని. అతని ఆత్రాన్ని గమనించి తనలో తానే సన్నగా నవ్వుకున్నాడు శ్యామా.
అదిగో గురుస్థాన్ అంటే ఇదిగో ఇక్కడికి చేరుకున్నారిద్దరూ. వేపచెట్టు కింద నిలబడి ఎవరితోనో బాబా మాట్లాడుతున్నారు. విసురుగా చేతులూపుతున్నారు.
‘‘అరిగో, వారే సాయిబాబా’’ చూపించాడు శ్యామా. దీక్షిత్ ఉన్న చోటు నుంచే చేతులు జోడించాడు. అలా చేతులు జోడించడంతో చంకలో ఉన్న కర్ర జారిపడిపో యింది. దాన్ని పట్టించుకోలేదు దీక్షిత్.
‘‘బాబా నిల్చున్న చోటుని గురుస్థాన్ అంటారు. అక్కడ బాబాను దర్శించడం అదృష్టం.’’ అన్నాడు శ్యామా. అతని మాట పూర్తి కాకుండానే పరుగుదీశాడు దీక్షిత్.
ఒంటికాలు మీద పరిగెత్తాడు. బాబాని సమీపించాడు. అయన పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. భుజాలు పట్టి దీక్షిత్‌ను లేవనెత్తారు బాబా.
‘‘నువ్వు నా వాడివి. నిన్ను నేను వదులుకుంటానా? అందుకే రప్పించుకున్నాను.’’ అన్నారు బాబా.హర్షాశ్రువులతో చూడసాగాడు దీక్షిత్.
‘‘శరీర లోపాన్ని గురించి పట్టించుకోకు.దాన్ని నాకు వదిలేయ్, నేను చూసుకుంటాను. మనసులో లోపాన్ని మాత్రం అశ్రద్ధ చెయ్యకు. ముందు దాన్ని తొలగించుకునే ప్రయత్నం చెయ్యి.’’ అన్నారు బాబా.
‘‘నా ప్రయత్నం నేను చేస్తాను, మీ ఆశీస్సులు కూడా కావాలి బాబా.’’ అడిగాడు దీక్షిత్.‘‘నా ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి, కాకా సాహెబ్ దీక్షిత్.’’ అన్నారు బాబా. ‘కాకా సాహెబ్’ కొత్తపేరు. బాగుందనుకున్నాడు దీక్షిత్.
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ప్రమాదం అంతా మానసికమైన అవిటితనంతోనే! దాన్ని ఎవరికి వారే తొలగించుకోవాలి. తొలగించుకుంటేనే సుఖసంతోషాలు
- ‘‘మనం దర్శించుకోవాలనుకున్నంత మాత్రాన బాబా దర్శనం కాదు. అలాగే వెళ్ళాలనుకున్నంత మాత్రాన షిరిడికి వెళ్ళలేం. అన్నిటికీ బాబా అనుమతి కావాలి.
- ‘‘ఇక మీదట నేను మాట్లాడను. నా సమాధి మాట్లాడుతుంది.’’
- కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ – 4
- నువ్వు చెబితే నేను వినాలనేం లేదు. అలాగే నేను చెబితే పైవాడు వింటాడనుకోకు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments