పిచ్చుక రూపంలో వచ్చిన బాబా



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

 పిచ్చుక రూపంలో వచ్చిన బాబా

ఈ రోజు మనము శ్రీమతి ప్రియాంకా గారి ఆంగ్ల బ్లాగులోని ఒక బాబా లీలను తెలుసుకుందాము. బాబా సర్వాంతర్యామి. మనము యెక్కడ వున్న, యేమి చేస్తున్నా,  మన మనసులో యేది అనుకున్న ఆయనకి తెలుస్తుందని గ్రహించుకుంటే, బాబా మనతోనే యెప్పుడు ఉన్నారన్న అనుభూతి మనకి కలుగుతుంది.

భగవంతుడిని గురించి తెలుసుకోవడమనేది మన మనస్సు మీద ఆథారపడి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆత్మ కనపడకుండా ఒక గట్టి తెర అడ్డుగా ఉండటంతో మనము ఆత్మ ని చూడలేకపోతున్నాము.  మనం ఆ తెరని కనక ఒక్కసారి అడ్డు తొలగించుకుంటే మనలో ఉన్న సాయిని సులభంగా చూడగలము. సాయి అంతటా నిండి ఉన్నాడు. ప్రేమ, నమ్మకం అనే గాజుద్వారా ఆయన గోచరమవుతాడు.

ఈ రోజు నేను షాలిని గారి మథురమైన బాబా అనుభూతిని ప్రచురిస్తున్నాను. ఆమె అనుభవాన్ని చదివితే సాయి అంతటా నిండి ఉన్నాడని  అర్థమవుతుంది. … 
నేను ప్రతీరోజు రాత్రి పొద్దు పోయేదాకా  బాబా భక్తుల అనుభవాలను చదువుతూ ఉంటాను. అవి చదువుతుంటే నేను యెంతో సంతోషిస్తాను అది నా భాగ్యం అనుకుంటాను. బాబా తో నాకు కలిగిన అనుభూతిని చెపుతాను. శ్రీ షిరిడీ సాయి బాబాతో నా స్వీయానుభవాన్ని మీఅందరితో కలిసి పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.
ఇప్పుడు నేను యూ.ఎస్. లో ఉన్నాను. కాని నేను భారతదేశంలో హైదరాబాదు లో ని ఒక మథ్య తరగతి కుటుంబం లోని దానిని. మేము ముగ్గురం అక్కచెళ్ళెళ్ళం. మా తల్లితండ్రులు మాకు మంచి చదువులు చెప్పించటానికి చాలా కష్ట పడ్డారు.  యింకా వాళ్ళు చేయగలిగినదంతా చేశారు. మా నాన్నగారు గొప్ప సాయిభక్తులు. అందుచేత చిన్నప్పటినించి ప్రతీ గురువారము మా యింటిలో పూజ చేస్తూ ఉండేవారము. నా చిన్నప్పటినించి నేను బాబా సాన్నిహిత్యాన్ని చవి చూశాను. ఆయన నా జీవితంలో ప్రతీ విషయంలోను దగ్గరుండి నడిపించారు.
మా అమ్మగారు పాఠశాలలో ఉపాథ్యాయురాలు. యింటి దగ్గర కూడా చదువు చెపుతూ ఉండేది. నా తల్లితండ్రులను సంతోష పెట్టడానికి నేను కూడా యేదైనా చెయ్యాలి అనుకునేదాన్ని. ఆర్థికంగా కాకపోయినా యేదో కొంత చేద్దామని ఫీజు లేకుండా మంచి కళాశాలలో య్లింటర్మీడియెట్ లో చేరడానికి నాకు మంచి మార్కులు యిమ్మని సాయిబాబాని ప్రార్థించేదాన్ని.  నా శాయశక్తులా నేను చేయగలిగింది చేసి మిగిలినదంతా బాబా కే వదలి వేసేదాన్ని.
ఆశ్చర్యకరంగా బాబా అనుగ్రహంతో నాకు ఎస్.ఎస్.సీ లో రాష్ట్రంలో మూడవ రాంక్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నించి నాకు నగదు బహుమతి, యింటర్మీడియెట్లో ఉచితంగా ప్రవేశం, ఉచితంగా పుస్తకాలు లబించాయి.
బాబా దయ వల్ల నాకు మంచి యింజనీరింగ్ కళాశాలలో ప్రవేశం లబించింది. కళాశాలనించి వచ్చిన తరువాత నేను యింటి దగ్గిర హైయ్యర్ స్టూడెంట్స్ కి పాఠాలు చెపుతూ ఉండేదాన్ని.  నేను చేయగలిగిన ఈ చిన్న సహాయం మా కుటుంబానికి చేసేదాన్ని.
ఒకసారి మాయింటిలో కరెంట్ బిల్లులు చెల్లించని కారణంగా  3 నెలలలపాటు కరెంట్ లేని సందర్భం కలిగింది. ఈ పరిస్థితినించి బయట పడవేయమని, సహాయం చేయమని నేను బాబానిప్రార్థించాను. బాబా ప్రేమానురాగాలతో నాకు యూనివర్సిటీనించి  బ్యాచ్ టాపర్  మరియు  కళాశాల టాపర్ గా వచ్చినందుకు రెండు బంగారు ఫతకాలు వచ్చాయి. మంచి మల్టి నేషనల్ కంపనీలో నాకు కాంపస్ ప్లేస్మెంట్ కూడా వచ్చింది.
నా తల్లితండ్రుల కళ్ళలో సంతోషాన్ని చూశాను. యివన్ని కూడా బాబా అనుగ్రహంతోనే జరిగాయి. ఒకసారి ఉదయం మా అమ్మ గారు నాకు గింజలు లేనియెండు ద్రాక్షపళ్ళు (షిరిడీనించి తెచ్చినవి) సాయంత్రం ఆఫీసునించి తిరిగి వచ్చాక తినడానికి యిచ్చారు. సాయి సచ్చరిత్రలోని అథ్యాయం మీకు గుర్తుండే ఉంటుందని అనుకుంటున్నాను.
అందులో బాబా గింజలున్నయెండు ద్రాక్ష పళ్ళని గింజలు లేనివిగా మారుస్తారు. నేను ఈ లీలని గురించి ఆలోచిస్తూ, నామీద కనక ప్రేమ ఉంటే నేను తినబోయే తరువాతి దానిలో గింజ ఉండాలని బాబాని ప్రార్థించాను. నేను సంతోషంలో మునిగిపోయాను యెందుకంటే నేను తరువాత తిన్న పండులో గింజ ఉంది. అంతకుముందు తిన్నవాటిల్లోనూ, తరువాత తిన్నవాటిల్లోనూ దేనిలోకూడా ఒక్క గింజ కూడా లేదు.  మనము కనక స్వచ్చమైన హృదయంతో, మనస్సుతో నమ్మితే, చిన్నసంఘటనలలో కూడా బాబా తన ఉనికిని చాటుతారు.
ఇప్పుదు యూ.ఎస్. లొ నా బాబా అనుభూతి ప్రారంభమవుతుంది. నాకొచ్చే జీతం సరిపోదు కాబట్టి నాకుటుంబానికి సహాయ పడటానికి పై చదువుల కోసం అమెరికా వచ్చాను. బ్యాంకు  నుంచి అప్పు తీసుకుని బాబా దయతోడిసెంబరు 2008 లో నేను మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాను. ప్రస్తుత పరిస్థితులలో మార్కెట్ యెలా ఉందో మీకు తెలుసు. అప్పటి నుంచి నాకు ఉద్యోగం రాలేదు, రోజు రోజుకీ నేను కృశించిపోతున్నాను. అమెరికాలో కూడా తన ప్రేమని, ఉనికిని చూపించమని బాబా ముందు రోదించాను.
నేను భారతదేశంలో ఉన్నప్పుడు ఆయన చిన్న విషయాలలో కూడా నేను కోరినప్పుడు తన లీలలను చూపెడుతూ ఉండేవారు. కాని  ఇక్కడ నాకు సహాయం చేయడానికి. యూ. ఎస్ చుట్టు పక్కల బాబా లేరేమో అని యెందుకనో ఆ భావం కలిగింది. తన ఉనికిని చూపమని నేను బాబాని ప్రార్థించినప్పుడు ఆ రోజు నా గదిలోకి ఒక పిచ్చుక యెక్కడినించో వచ్చింది. నా గదిలో పిచ్చుకని చూసి నేను ఆశ్చర్యపోయాను. అది నా గదిలో కూర్చుంది.
నేను కొంచెం భయపడి బయటకు వెళ్ళి హాలులోకూర్చున్నాను. అప్పుడు బాబాని ప్రార్తించాను…. నువ్వే కనక పిచ్చుకగా నాగదిలోకి వస్తే, ఆకాశంలోకి క్షేమంగా వెళ్ళిపో”.. నా మదిలో ఈ ఆలోచన వచ్చిన మరుక్షణమే పిచ్చుక బయటికి వచ్చి యెగిరిపోయింది. ఇది నాజీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు.
బాబా నా కళ్ళు తెరిపించి తాను సర్వంతర్యామినని నేను గ్రహించేలా చేశారు. ఆయన తన భక్తుల కోసం సప్త సముద్రాలనైనా దాటి రాగలరు.  యింతవరకు నాకు ఉద్యోగంరాలేదు. కాని నాకు తెలుసు యేది జరిగినా అది మనమంచి కోసమే జరుగుతుందని.
సాయిబాబాకి తెలుసు మనకుయెప్పుడు యేది ఇవ్వాలో. ఇక్కడ నాకు పీ.హెచ్.డీలో ప్రవేశం దొరికింది మంచి థన సహయం కూడా లభించింది.  మన గురించి బాబా మనసులో యేముందో మనకి తెలియదు. బాబా తన బిడ్డలనెప్పుడు ప్రేమిస్తారు తను ఇవ్వగలిగినది ఇస్తారు.
నా అనుభవాని మీరందరూ చదివినందుకు థన్యవాదాలు. బాబా తన ప్రేమతో,అభిమానంతో మిమ్ములనందరిని దీవించు గాక!
ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles