Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై !!
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై !!
హాస్టల్ లో సత్సంగం పెట్టుకున్న తరువాతి రోజు మధ్యాహ్నం నిద్రపోయా,కలలో,రజని అక్క వాళ్ళ హాస్టల్ ముందు ఒక పక్కన కూరగాయల బండి లాగా ఒకటి ఉంది దానికి ఒకవైపు పెద్ద చెక్కలాగా ఉంది దానిపైన,నేను అందరి మహాత్ముల ఫొటోస్ ని పేస్ట్ చేస్తున్నాను .
ఆ వీధిలో నుండి ఒక గుంపు సాయిబాబా సాయిబాబా నామం చేసుకుంటూ వెళ్తున్నారు.నేను బాబా భక్తులు అయి ఉంటారు అనుకుని మల్లి పేస్ట్ చేస్తున్నా,ఆ భజన గుంపులో నుండి ఒకతను వెనక్కి తిరిగి న దగ్గరకు వచ్చి,నేను చెక్కపై పేస్ట్ చేస్తున్న మహాత్ములలో ఒకరిని వేలితో చూపిస్తూ మీరు శరత్ బాబూజీ కి సంబదించిన వాళ్లా అని అడిగారు.
నేను ఆమ్మో ఏంటి ఇలా అడుగుతున్నాడు అనుకుని,ఆలా ఏం కాదు నాకు బాబా అంటే ఇష్టం.మహాత్ములందరిని గౌరవిస్తాను.అందుకే అందరి ఫొటోస్ ని ఇలా పేస్ట్ చేస్తున్నాను అని చెప్పా.మరి మీరు ఎవరు అని తనని అడిగితె.మేము మనోహర్ వర్గానికి సంబందించిన వాళ్ళం అని చెప్పాడు.నేను మారుతికి చెప్పాను. ఇలా వచ్చింది అని.
తాను ఐతే నీకు గురువు గారే గురువు అని బాబా ఆలా చెప్పిస్తున్నారని నాకు అర్ధమవుతుంది అని చెప్పింది నేను తనని ఏమి అనలేదు కానీ నాకు ఎదోలాగా అనిపించింది.
మారుతి అంది నీకు నచ్చిన నచ్చకున్నా నీకు గురువు గారి గురించి కలలు వస్తున్నాయి కాబట్టి ఈ రోజు సాయంత్రం రజని అక్క వాళింట్లో సత్సంగం ఉంటుంది.ఒకసారి రా,నువ్వు గురువు గారిని సరిగ్గా చూడలేదు కదా చూద్దువుగాని రా అంది.
సరేలే అని సాయంత్రం అక్క వాళ్ళింటికి సత్సంగం కి వెళ్ళాను.వెళ్ళగానే బాబా ఫోటోకి ఫస్ట్ నమస్కరించుకుని తరువాత గురువు గారి ఫోటోకి నమస్కరిస్తుంటే గురువు గారి దగ్గరి నుండి నా చేతి పై రోజ్ ఫ్లవర్ పడింది.నాకు కొంచం హ్యాపీగానే అనిపించింది.
అక్కవాళ్ళు అందరు గురువు గారు నీకేదో చెప్పాలనుకుంటున్నారేమో ఎప్పుడు ఇలా జరగలేదు మా సత్సంగం లో అన్నారు.వెంటనే ఆమ్మో ఇదేదో బాలేదు అనుకుని గురువుగారు నాకేం చెప్పాలనుకుంటాడు.ఆలా ఏమి అయిఉండదు అన్నాను.
అక్కడ కూర్చున్న కానీ నాకు బాబా ఫోటో మీద కన్నా గురువు గారి ఫోటో మీద ఫోకస్ ఎక్కువైంది.చాల ప్రకాశంగా కన్పిస్తున్నారు ఫోటో లో.నేను ఈయనేంటి ఇంత ప్రకాశంగా ఉన్నారు అనుకున్నాను.
జనార్దన్ అంకుల్ వాళ్ళింట్లో లాగా గురువుగారి ఫోటోని చూడకుండా బాబా ఫోటో మీదనే ద్రుష్టి పెట్టాలనుకున్నాను కానీ ఎంతగా అనుకుంటున్నా కూడా గురువుగారి ఫోటో పైకే వెళ్తున్నాయి కళ్ళు,మనసు.ఏమైంది నాకు నేను బాబా మీద కాకుండా గురువుగారికి అట్రాక్ట్ అవుతుందేంటీ ఈ రోజు న మనసు అనుకున్నాను.
సరేలే బలవంతంగా బాబా మీద కి మనసు తిప్పడం కన్నా, ఆటోమేటిక్ గ ఇటు వెళ్తుంది కాబట్టి ఇతన్నే కొంత సేపు చుస్తే అయిపోతుంది కదా అనిపించింది.సరే ఏదో చెప్పాలనుకుంటున్నారట కదా ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి.అనుకున్నాను.నా చేయి మీద ఆలా ఫ్లవర్ఆ పడడం నాకు హ్యాపీ అనిపించింది.
ఆలా అని శరత్ఆ బాబూజీ ని గురువుగా అనుకోలేకపోయాను.అలా ఆరోజు సత్సంగం అయిపోయింది.
రాత్రి కలలోఎవరెవరో మహాత్ములు అందరి ఫేస్ లు కనిపిస్తున్నాయి కానీ క్లారిటీ లేదు . ఎవరిదో సమాధి చుట్టూ ఒక స్త్రీ ప్రదక్షణలు చేస్తుంది చేస్తుంది.
తాను పసుపు కలర్ చీర రెడ్ కలర్ అంచు,రెడ్ కలర్ బ్లౌజ్ ,రెడ్ అండ్ యెల్లో కలర్ ఫ్లవర్స్,పసుపు యెర్రని గాజులు వేసుకుని ఉంది.ప్రదక్షిణలు చేస్తూ నన్ను చూసి ఆగిపోయి నావైపు వేలుతో చూపించుకుంటూ ఏదో చెప్తుంది కానీ నాకేమి అర్ధం కాలేదు.
నాకెందుకో ఆమె అలివేణి మంగమ్మ గారు కావచ్చు అనిపించింది అంతకు ముందు నేను తీసుకెళ్ళినవి అన్ని పెట్టుకుని కనిపించారేమో అనుకున్నాను,కానీ సమాధి ఎవరిది అనుకుంటే మారుతి అది మాస్టర్ గారిది అయి ఉంటుంది.ఏం చెప్పిందో అర్ధం కాలేదు అంటే ఎప్పుడు ధర్మాన్ని అంటి పెట్టుకో అని చెప్పి ఉంటారు.
మాస్టర్ గారు ఎప్పుడు అలానే చెప్పేవారట తాను ఎక్కువగా ధర్మాన్ని పాటించేవాళ్ళని ఇష్టపడేవారంట.అలంటి వాళ్ళ కలలోకి వచ్చి కనిపించేవారట.నీకు కనిపించారంటే.నువ్వు ధర్మాంగా ఉంటున్నావు అనేమో.అమ్మగారు ఆ ధర్మాన్ని ఎప్పుడు పాటించు అని చెపుతున్నారేమో.ఏమో నాకు అర్థమైంది చెపుతున్నాను అంది.
సరేలే ఏమైతే ఏంటి.అమ్మగారు,మాస్టర్ గారి దర్శనం ఐంది.అన్నిటికి మించి అమ్మగారు అంతకుముందు నేను తీసుకెళ్ళినవి అన్ని పెట్టుకుని కనిపించారు నాకు అదే చాలు హ్యాపీ అనుకున్నాను.
Latest Miracles:
- గురుబంధువుతో కళ్యాణ బంధం
- నా గురువు తన పాదుకులతో నన్ను ఆశీర్వదించారు
- నేనెప్పుడూ గురువుగారికి, బాబాకి గారాల కూతురినే అని చాల హ్యాపీ గా అనిపించింది.
- మనసులో చిన్న అసంతృప్తినైన బాబా తీరుస్తారు
- సచ్చరిత్ర చదవడంతో గురువు అంటే ఎవరో, దైవం అంటే ఎవరో తెలిసింది
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments