Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
భక్తుడు: సుబ్రహ్మణ్యం
నివాసం: రాజమండ్రి
నా పేరు సుబ్రహ్మణ్యం. నేను రాజమండ్రి వాస్తవ్యుడను. నాకు కలిగిన అనుభవాలను సాయిబంధువులతో, గురుబంధువులతో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు బాబా గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను.
ఒకసారి నేను మా శ్రీమతి, మా అబ్బాయి గురువు గారితో (శరత్ బాబూజీ) గడపాలని శిరిడీ వెళ్ళాము.
ప్రతి రోజు ఉదయం 3:45 నిమిషాలకు నిద్ర లేచి గురువు గారి దగ్గరకు వెళ్లి తోచినదేదో చేసుకుంటూ, తరువాత బాబా దర్శనానికి టెంపుల్ కి వెళ్లి, వస్తుండే వాళ్ళము. మళ్ళీ సాయంత్రం గురువు గారి దగ్గరకు వెళ్లడం సేవ ఉంటే చేసుకోవడం, సత్సంగంలో పాల్గొనడం, ఇది మా దిన కృత్యము.
ఇలా పదిహేను రోజులు సంతోషంగా గడిపిన తరువాత నర్సాపూర్ ఎక్ష్ ప్రెస్ కి తిరుగు ప్రయాణం అవుతున్నాము.
రిటర్న్ వచ్చేటప్పుడు గురువుగారి దర్శనం తరువాత బాబా వారి దర్శనం చేసుకున్నాము.
ఆరోజు చాలా రద్దీగా ఉంది. ఊధీ తీసుకుందాం అంటే, అక్కడ క్యూలో చాలా జనం వేచి ఉన్నారు. లైన్ లో నిల్చున్న ఊధీ దొరికే అవకాశమే లేదు అనిపించింది.
మనం సాధారణంగా “సచ్చరిత్ర” లో “శిరిడీకి రండి. బండ్ల కొద్ది ఊధీ తీసుకు వెళ్ళండి” అని బాబా గారు చెప్పడం చదువుతుంటాం. అది గుర్తుకు వచ్చి ఈ చివరి రోజు ఊధీ దొరకలేదని ఏదో మనసులోఅసంతృప్తి కలిగింది.
టెంపుల్ నుండి సాయిపథంకు తిరిగి వచ్చేశాను. అక్కడే ఉండే రామకృష్ణ గారు ఒక డబ్బాలో బాబా ఊధీ ఇచ్చి సుబ్రహ్మణ్యం గారు ఇదిగో బాబా ఊధీ తీసుకు వెళ్ళండి అని నా చేతికి అందించారు.
ఒక్కసారిగా నాకు ఒళ్ళు జలదరించింది. మనలో ఉండే ఏ చిన్న అసంతృప్తినైనా బాబా వారు గమనిస్తుంటారని ఈ లీల ద్వారా నాకనిపించింది.
సాయిపథంలో ఒకవైపు బాబా, బాబావారి సత్సంగ హాలు మరోవైపు గురువుగారి సమాధి ఉంటుంది. ఈ పదిహేను రోజులు బాబా గారి వైపే సేవ చేసుకున్నాను,
కానీ గురువు గారికి ఏ మాత్రమూ సేవ చేసుకోలేక పోయానని బాధనిపించింది.
మరుక్షణమే అక్కడ పని చేస్తూ ఉండే హనుమంత్ గారు “సుబ్రహ్మణ్యం గారు గురువు గారికి వచ్చి దండ వేసుకోండి” అని చెప్పారు.
ఈ రెండు సంఘటనల ద్వారా మనలో ఉండే చిన్న అసంతృప్తిని కూడా బాబా, గురువు గారు గమనిస్తుంటారని అనుభూతి చెందాను.
~~~~సర్వం సాయినాధార్పణమస్తు~~~~
***సాయిసూక్తి:
“నేనుండగా భయమేలా”?.
Latest Miracles:
- సమస్య ఏదైనా సద్గురు అనుగ్రహంతో పటాపంచలు
- మీ భారములు నాపై పడవేయుడు నేను మోసెదను
- బాబా ప్రేరణ
- విద్యా ప్రదాత!…..సాయి@366 నవంబర్ 17…Audio
- కలలో బాబా నిజ సమాధి దర్శనం
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments