Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
భక్తుడు: సుబ్రహ్మణ్యం
నివాసం: రాజమండ్రి
నా పేరు సుబ్రహ్మణ్యం. నేను రాజమండ్రి వాస్తవ్యుడను. నాకు కలిగిన అనుభవాలను సాయి బంధువులతో, గురు బంధువులతో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు బాబా గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను.
ఒకసారి గురువు గారి ఆరాధనోత్సవాలకు గురుబంధువులతో కలిసి శిరిడీ వెళ్ళాను. అక్కడ ఆనందంగా గడిపి తిరుగు ప్రయాణo అవుతున్నాం.
అప్పుడు గురుబంధువు సుధాకర్ అనే అతను అంకుల్ ట్రైన్ లో అందరి కోసం టిఫిన్ ఏర్పాటు చేస్తున్నాను. మీకు కూడా తీసుకుంటాను, మీరు టిఫిన్ ఏమి తెచ్చుకోకండి అని చెప్పారు.
నేను అలాగే తీసుకోవయ్య అని చెప్పాను. తరువాత అందరం ట్రైన్ ఎక్కేసాము. గురు బంధువులందరు ఒక కోచ్ లో ఉన్నారు. నేను వేరే కోచ్ లో ఉన్నాను.
రాత్రి 8.30 సమయంలో నేను వాళ్ళ కోచ్ కి వెళ్ళాను. అప్పటికే అందరు అలిసిపోయి నా సంగతి మరిచిపోయి, టిఫిన్ చేసి పడుకుని ఉన్నారు.
సుధాకర్ ని లేపి ఏదయ్యా నా టిఫిన్ అని అడిగాను. అతను లేదు అంకుల్. ఒకటి ఎక్సట్రా వచ్చింది, ఎవరిదో అని, మీ సంగతి మర్చిపోయి తినేసాము అన్నారు.
నేను పర్వాలేదు అని చెప్పి నా కోచ్ కి వచ్చేశాను.నా ఎదురుగా ఉండే అతను టిఫిన్ చేస్తూ మీరు టిఫిన్ చేసారా అని అడిగారు.నేను లేదని చెప్పాను.
అంతకుముందు కోచ్ లో ఒకసారి మాట్లాడాను కానీ మాకు పరిచయం లేదు. అతను రెండు టిఫిన్ ప్యాకెట్లు తెచ్చారట.
ఎవరైనా వారికి కావలిసినంత తెచ్చుకుంటారు కానీ, ఎక్సట్రా తెచ్చిపెట్టుకోరు కదా! మరెందుకు ఎక్సట్రా తెచ్చారో? అది కూడా బాబా ప్రేరణే అనుకుంట. ఇదిగో టిఫిన్ చేయండని నా చేతికి ఇచ్చారు.
నాకు వెంటనే అనిపించింది ఏమిటంటే, ఇలా జరుగుతుందని ముందే తెలిసి బాబా ఈ ఏర్పాటు చేసారు. మనం జరిగే ప్రతి చిన్న విషయాలను గమనిస్తూ ఉంటే, బాబా వారి రక్షణ, వారు మనపై చూపిస్తుండే ప్రేమని స్పష్టంగా అర్ధం చేసుకోగలుగుతాము.
~~~~సర్వం సాయినాధార్పణమస్తు~~~~
***సాయిసూక్తి:
“పసిబిడ్డ కాలిపై మల విసర్జన చేస్తే కాలు కడుక్కుంటాం కానీ బిడ్డని నరుక్కుంటామా”?.
Latest Miracles:
- ఇదంతా బాబా దయ నాదేమీ లేదు. ఆ సమయం లో బాబా అలా ప్రేరణ కలిగించాడు.
- సాయినాథులవారు గజదొంగల నుండి మమ్మల్ని రక్షించారు,నా ఆరోగ్యం బాగు చేసారు మరియు ప్రాణం తీసే జబ్బు నుండి మా పాపను కాపాడారు.
- చిన్న దెబ్బ కూడా తగలకుండా, పెద్ద యాక్సిడెంట్ నుంచి కాపాడిన బాబా వారు
- బాబా నైవేద్యం కొరకు వేసిన పిండి, తీసినకోద్ది డబ్బాలు డబ్బాలు వచ్చుట…..
- ఏ నిమిషానికి ఏమికావలో మనము వెదుక్కుంటూ వెళ్లనక్కర్లేదు, అవి మన దగ్గరకే వస్తాయి బాబా కృపవుంటే–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments