బాబా నైవేద్యం కొరకు వేసిన పిండి, తీసినకోద్ది డబ్బాలు డబ్బాలు వచ్చుట…..



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


గురువుగారు పుస్తకాలు ఇస్తున్నప్పుడు మా వాడు అక్కడ ఉన్నాడు. వాడికి ఇవ్వబోయారు. మా వాడు అందుకోకుండా వద్దు అని అన్నాడు. గురువు గారు ఆశ్చర్యంగా వాడివంక చూసారు.

ఎందుకంటే వాడికి తెలుగు చదవటం రాదు, పైగా బాబాపై శ్రద్ధ, భక్తీ లేవు అందుకని వద్దు అన్నాడు.

ఆ తర్వాత చంద్రకళ గారు ఏంటి మీ అమ్మగారు మీ కోసం మీ భవిష్యత్తు కోసం ఇంత చేస్తుంటే మీరు ఆవిడకి ఈ పాటి సహకారం చెయ్యరా చదువు అంటూ మా వాడికి శ్రీ సాయి సచ్చరిత్ర చేతలో పెట్టి బలవంతంగా కుర్చోపెట్టింది.

బలవంతంగా ఒక రోజు చదివాడు. రెండో రోజు బయటకి వెళ్లి పోతుంటే. ఏమిటి వెళ్ళిపోతున్నావు రా రా ఈ రోజుది, చదవాలి. ఈ వారం అంతా చదవాలి అంటూ వాడిని బలవంతంగా కుర్చోపెట్టింది ఆవిడ. మా వాడు ఆవిడ మాట కాదనలేక ఒక వారమంతా పారాయణం చేసాడు.

ఒక రోజు నాకు కొంచెం నలతగా వుంది. నేను పక్కింటావిడని కొంచెం బాబాకి అన్నం కూర వండి నైవేద్యానికి ఇస్తారా అని అడిగితే ఆమె సరే అంది. ఆవిడ. అన్నం కూర చేసి ఇచ్చింది. మధ్యాహ్నం హారతి అయ్యాక నైవేద్యం పెట్టాను.

ఆ మర్నాడు బుధవారం నాడు గణపతికి వుండ్రాళ్లు చేసుకొని నైవేద్యం పెట్టాలనుకున్నాను. మా పక్కింటావిడ నువ్వు వుండ్రాళ్లు చేసుకొని నైవేద్యం పెట్టుకో, నేను బాబాకి నిన్నటిలాగా అన్నం వండి కూర చేసి, నైవేద్యం పెడతానులే అంది.

నాకు ఉన్నట్టుండి రోజూ ఈవిడ పెట్టేది ఏంటి అని అహంకారం పుట్టుకొచ్చింది. వద్దులే నేనే పెట్టుకుంటానులే అన్నాను.

బియ్యం కడిగి రైస్‌ కుక్కర్లో పెట్టి గుడికి వెళ్లి వస్తే ఈ లోపల అన్నం తయారు అవుతుంది కదా అని అనుకొని బియ్యం కడిగి రైస్‌ కుక్కర్లో పెట్టాను.

గబగబా తయారుచేసిన ఉండ్రాళ్ళు పట్టుకొని గుడికి వెళ్ళి వచ్చి బాబాకి నైవేద్యం పెడదామని రైస్‌ కుక్కర్‌ చూసాను.

ఇంకేముంది నేను ఎలా పెట్టి వెళ్ళానో అలాగే ఉంది. దానికి కారణం నేను స్విచ్‌ వేయటం మర్చిపోయాను.

ఇంక అప్పుడు స్విచ్‌ వేసినా ఉడకటానికి సమయం లేదు. హరతికి సమయం అయిపోయింది. ఇంక చేసేది ఏమి లేక పక్కింటావిడనే. ఆశ్రయించ వలసి వచ్చింది.

ఆవిడనే అన్నం అడిగి తీసుకున్నాను. నా అహం అణిగించాడాయన.

 ఒకావిడ రోజూ పారాయణానికి వస్తోంది. ఆవిడ నన్ను “బాబాకి. ఏ టిఫిన్‌ పెడుతున్నావు” అని అడిగింది.

నేను “నాకు కుదరటం లేదు. ఎవరో ఒక్కళ్ళు ఏదొకటి తయారుచేసుకొనివచ్చి వాళ్ళే నైవేద్యం పెట్టి వెళ్ళిపోతున్నారు” అన్నాను.

ఆవిడ అనుకుంటుందట ‘పాపం ఈవిడకి ప్రత్యేకించి బాబా కోసం తయారు చేయటానికి అవ్వట్లేదు. అదే నేను తీసుకు వచ్చి ఇస్తే తప్పకుండా పెడుతుంది” అనుకుందట.

మర్నాడు ఆవిడ మామూలుగా వాళ్ళ ఇంట్లో రోజు వారి టిఫిన్‌ కోసం పప్పు పోసుకుని వెట్‌  గ్రైండర్ లో పప్పు వేసి రుబ్బుకుంటోందట.

మనం రోజు పోసుకునే పప్పుకి ఒక కొలతలో పిండి ఎంత వస్తుందో మనకి తెలుస్తుంది. కానీ, ఆవిడకి డబ్బాలు డబ్బాలు నిండిపోతోందట తీసినకోద్ది పిండి వస్తోందట.

ఆవిడ వాళ్ళ అమ్మాయితో నాకు పిండి పంపించి ‘ఈ పిండి గురించి అమ్మ తర్వాత చెబుతుందట. ప్రస్తుతానికి బాబాకి టిఫిన్‌ చేసి పెట్టమని చెప్పింది అమ్మ’ అని చెప్పి పిండి డబ్బా నాకిచ్చి వెళ్లిపోయింది.

ఆ పిండితో నాలుగు రోజులు బాబాకి టిఫిన్‌ చేసి పెట్టాను. నేను ఇది బాబాకి చేస్తే బాగుండును అని అనుకోగానే ఆ పదార్ధం ఆ రోజు ఎవరో ఒకరు తెస్తూండేవారు.

పూలు కూడా అంతే, ఈ రోజు 108 పూలతో పూజ చేస్తే బాగుందు అని అనుకోగానే ఎవరో ఒకరు అలా ఆ పూలు తీసుకుని వచ్చి ఇచ్చి వెళ్ళిపోయేవారు.

The above miracle has been typed by: Sreenivas Murthy Muppalla

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles