మీ భారములు నాపై పడవేయుడు నేను మోసెదను



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


భక్తుడు: V V S సుబ్రహ్మణ్యం

నివాసం: రాజమండ్రి

సదాసత్స్వరూపం చిదానందకందం – జగత్సంభవ స్దాన సంహారహేతుం  స్వ భక్తేచ్చయామానుషం దర్శయంతం-నమామీశ్వరంసద్గురుమ్ సాయి  నాథం.

 

భావము: సచ్చిదానంద స్వరూపుడవు, జగదుత్పప్తి సంహార హేతుడవు. భక్తుల కోరికననుసరించి మానవరూపంలో కన్పించువాడవు. అట్టి ఈశ్వరుడు, సద్గురువు అయిన శ్రీ సాయినాథునకు నమస్కరించుచున్నాను.

సాయిబాబా గారికి మరియు మాగురువు గారు  శరత్ బాబూజీ గారికి నమస్కారం.

నా పేరు V V S సుబ్రహ్మణ్యం రాజమండ్రి నివాసిని. సాయి బంధువులందరికి   బాబా, మరియు గురువు గారి    ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.

నేను బజాజ్ ఫైనాన్స్ PSC ఎండోమెంట్ ఎంప్లాయిని. అప్పట్లో జీతాలు చాలా తక్కువగా వచ్చేవి.

మా అబ్బాయి పెళ్లి నిశ్చయం అయింది. అయితే అమ్మాయి తరుపు వాళ్ళు కూడా మధ్య తరగతి వాళ్ళు. మేం కూడా మధ్య తరగతి వాళ్ళమే.

అయితే అమ్మాయి తరుపు వాళ్లకు చెప్పాను. వివాహానికి అయ్యే ఖర్చు నేను భరిస్తాను దిగులు పడొద్దని.

ఇంకేముంది ఉభయ ఖర్చులు నాపై పడ్డాయి, నా ఆలోచన ఏమిటంటే బజాజ్ వాళ్ళు ఫైనాన్స్ సంబందించిన వాళ్ళు కదా! ఫైనాన్సియల్ గా సహాయం చేస్తాం అన్నారు.

ఆ భరోసాతో ఉభయ ఖర్చులు పెట్టుకోవడానికి రెడీ అయ్యాను. కానీ వాళ్ళు ఇవ్వమన్నారు.

బాబా గారు అంటారు కదా! ఏకాదశ సూత్రములలో మీ భారములు నాపై పడవేయుడు నేను మోసెదను అని అదే జరిగింది.

ఒక రోజు ఆఫీస్ కు వెళ్లే ముందు చిలకలూరు బాబా మందిరంకి వెళ్లి బాబాకు చెప్పాను. ఏం చేయాలి బాబా అర్ధం కావడంలేదు. పెళ్లి సమయం దగ్గర పడుతుంది అని మనస్ఫూర్తిగా బాబాను ప్రార్థిస్తూ నా భారం తనపై వేసాను.

అంతే గుడి నుండి బయటకు రాగానే నా రెండవ కుమారుడు ఫోన్ చేసాడు.

నాన్న మా స్నేహితుడు అడుగుతున్నాడు నీ కేమైనా డబ్బు సహాయం కావాలా అని.

తన దగ్గర రెండు లక్షలు ఉన్నాయట అవసరం అయితే ఇప్పుడు తీసుకొచ్చి ఇస్తానని లేదంటే బ్యాంకులో వేస్తానని చెప్పాడని నా కుమారుడు చెప్పాడు.

అది కూడా వడ్డీ లేకుండా. ఏం చేయాలో అర్ధం కాలేదు.

బాబాకి విన్న- వించుకుని బయటకు రాగానే, నా సమస్యకు పరిష్కారం చూపించారు బాబా. అసలు ఆనందానికి   అవధులు లేవని అనిపించింది.

బాబా యొక్క ప్రేమతో తడిసిపోయాననుకోండి. బాబా కనుక ఆ డబ్బు సమయంకి అందించకపోయి ఉంటే నాకు రెండు వైపులా మాట పోయేది.

బాబాకు ఋణ పడిపోయి ఉన్నాననుకోండి. అంతే కాదు మా పిల్లల చదువు విషయంలో కూడా బాబా  చాలా సహాయం చేసారు.

మా గురువు గారు  చెపుతారండి. బాబాగారి అనుగ్రహం ఎల్లప్పుడూ కుండపోతగా పడుతూనే ఉంటుందని, కానీ మనము అజ్ఞానం అనే గొడుగును తొలిగించాలని ఇప్పటి వరకు నాకు జరిగిన ప్రతి సంఘటనలో బాబాగారు నా పక్కనే ఉన్నారనేది నిజం.

నాకు తోడుగా, నీడగా ఉండి నడిపిస్తున్న బాబాకు మరియు శరత్ బాబూజీ మా గురువు గారికి కృతఙ్ఞతలు.

    ~~~~సర్వం సాయినాధార్పణమస్తు~~~~

 *** సాయి సూక్తి:

“నన్ను ఆశ్రయించాక ఇక భయానికి తావేది ?”

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles