నేను ఆనందం ఆశ్చర్యం లో వుండగానే, Postman వచ్చి మేడమ్, మీ Courtcase తేలిపోయింది



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


నేను, నా కుటంబం గత 15 సంవత్సరాలుగా బాబా భక్తులం అయ్యాము, ప్రతి క్షణం ఆయన కృప వల్ల జీవిస్తున్నాము.

గత కొన్ని సంవత్సరాలుగా మేము చాలా కష్టాలను ఎదుర్కుంటున్నాము. ఎందుకంటే, మా కోడలు, మా మీద, మా కొడుకు మీద, వరకట్నం అడిగామని అబద్దపు కేసు పెట్టింది.

ఇది అందరికి తెలిసిన విషయమే వరకట్నం తీసుకోవడం నేరం అని. అందువల్ల, కోర్టు వ్యవహారాలు చూసుకోలేక మేము, రోజు రోజుకు మానసికంగా, శారీరకంగా వేదన పడేవాళ్ళం.

అమ్మాయి వైపు వాళ్ళు కేసు వేస్తె న్యాయస్థానం, అమ్మాయినే సమర్దిస్తుంది. కొడుకును అత్తగారి వాళ్ళనే ముందు అనుమానిస్తారు, దాని వలన మేము చాలా దుఃఖ పడేవాళ్ళము. చెయ్యని తప్పుకు శిక్ష పడుతుందేమోనని భయంగా బతికేవాళ్ళము.

నేను ఎప్పుడు బాబా నామస్మరణ చేసుకుంటూ వుండేదాన్ని. నాకు పూర్తిగా బాబానే రక్షాకవచం లాగా నాతొ వుంటాడనే నమ్మకం వుండేది.

2007 వ సంవత్సరం డిశంబర్ 9వ తేది, ఆ రోజు నేను మా పని అమ్మాయితో మాట్లాడుతూవున్నాను ఉదయం 11 గంటలప్పుడు ఒక ఆయన మా గేటు దగ్గరికి గంటలు వాయించుకుంటూ వచ్చారు. పూర్తిగా బాబా వేషములో వున్నారు.

నేను అడిగాను బాబా ఏమి కావలి మీకు అని. అప్పుడు ఆ బాబా అన్నారు, నాకు టీ వద్దు, భోజనము వద్దు. నేను శిరిడీ వెళ్ళడానికి కొంచెం పైసలు ఇవ్వు చాలు అన్నారు.

నేను ఆనందంతో పైసలు తేవడానికి ఇంటి లోపలికి వెళ్ళాను. ఇంతలో మా ఇంటి ముందు నుంచి బాబా వెళ్లిపోయారు.

నేను 101 రూపాయలు తీసుకొని పరుగు పరుగున బయటికి వచ్చాను. ఆయన రెండు ఇండ్లు వదలి మూడో ఇంటి ముందు వున్నారు. నేను పరుగు పరుగున వెళ్ళి 101 రూపాయలు ఇచ్చాను.

ఆయన తీసుకొని, సాయి… సాయి… సాయి అని జపం చేస్తూవుండు, అన్ని కస్టాలు దూరం అవుతాయి.

నేను ఒక Courtcase సరిచేయాలని శిరిడీ నుంచి వచ్చాను, తిరిగి శిరిడీ వెళ్ళడానికి నా దగ్గర పైసలు లేవు, అందుకే నిన్ను అడిగాను. ఇక వెళ్లి వస్తాను అని నన్ను ఆశీర్వదించి, నీ కష్టాలు తొలగిపోయే రోజు వచ్చింది అని చెప్పి వెళ్లిపోయారు నేను చూస్తూవుండగానే కొంచెం దూరం వెళ్ళి అంతర్దానమైనారు.

ఆయన లీల చుడండి ఎలా వుంటుందో, నేను ఆనందం ఆశ్చర్యం లో వుండగానే, Postman వచ్చి మేడమ్, మీ Courtcase తేలిపోయింది, మీరు నిర్దోషులని తెలిసింది. ఇంక మీరు court కు రానవసరం లేదు అని చెప్పి papers వెనక్కి ఇచ్చివెళ్ళాడు.

ఈ విధంగా బాబా మాకు కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. ఎప్పుడు భగవంతుడు ధర్మం పక్షాన్నే వుంటాడు. ధర్మ సమ్మతమైన కోరికను దగ్గర వుండి తీరుస్తాడు. నన్ను నమ్మండి, ఆ బాబా అనంత దయకు మీరు పాత్రులు అవ్వండి.

సర్వం సాయి నా దర్పణమస్తు

సుమన్ జైన్
పీతమ్ పూర్, ఢిల్లీ

ఈ బాబా వారి లీల తెలుగు లోకి అనువదించిన వారు : మాధవి, భువనేశ్వర్.

సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో  వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles