కలలో బాబా నిజ సమాధి దర్శనం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

కర్నూల్ నుండి వీరభద్రప్ప గారు తమకి బాబా ప్రసాదించిన అనుభవాలను భువనేశ్వర్ కి చెందిన మాధవి గారి అభ్యర్ధన మేరకు saileelas.com ద్వారా సాయి బంధువులతో పంచుకొనేందుకు నాకు పోస్టల్ ద్వారా పంపించారు. వారికీ, వారి కుటుంబానికి బాబా ఆశిస్సులు సదా ఉండాలని కోరుకుంటూ వారి అనుభవాన్ని మీ ముందు ఉంచుతున్నాను. వారి మాటలలో చదివి ఆనందించండి.

సాయి బంధువులరా సాయిని కొలిచిన ధన్యులగుదురు. S. వీరభద్రప్ప అను నేను కర్నూల్ నివాసస్తుడను. కర్నూల్ నందు గల ద్వారకమాయి సాయిబాబా గుడికి నిత్యం వెళ్లి ఆ సాయినాధుని సన్నిదిలో ఎక్కువగా సమయాన్ని గడుపుతూ ఉంటాను.

ఆ భాగ్యాన్ని బాబా వారు నాకు ఇచ్చినందుకు నేను ధన్యుడను. నేను 11 సంవత్సరాలుగా బాబా మాల ధరించి షిరిడి వెళ్లి బాబాను దర్శించుకుంటున్నాను. నా లైఫ్ లో జరిగిన బాబా లీలలలో ఒకటి ఇప్పుడు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.

2006 డిసెంబర్ 24వ తేదిన నాకు గురువు గారైన దయాళ్ శరణ్ గారితో కలిసి నేను షిర్డీ వెళ్లియుంటిని. ద్వారకమాయి, తరువాత సమాధి మందిరం లో సాయినాధుని దర్శనం చేసుకున్నాము. తరువాత మా గురువు గారు బాబా గారి సమాధి క్రింద భూ గృహంలో ఉన్నదని చెప్పినారు.

అందులకు నేను మనం చూడవచ్చునా అని అడుగగా, అందులకు మా గురువు గారు సంస్థాన పూజారులు మాత్రమే అక్కడకు వెళ్లి సమాధి వద్ద పూజలు చేసెదరు, మనలను వెళ్ళనివ్వరు అని చెప్పినారు.

ఆరోజు రాత్రి ఇరువురుము నిద్రించుటకు ముందు తెల్లవారుజామున 4.30 గంటల హరతికి పోవుదమా? అని గురువు గారిని అడిగాను. అందులకు అయన ఆ టైం లో మనం పోలేక పోవచ్చు అని చెప్పగా, సరేనని నిద్రకు ఉపక్రమించితిమి.

మా గురువు గారు పెద్ద వయస్సు అయినందువలన త్వరగా నిద్రించినారు. నాకు మాత్రం నిద్రపట్టక రూమ్ లో టీవీ చూస్తూ ఉన్నాను. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఒక వ్యక్తీ వచ్చి రూమ్ తలుపు తిట్టినాడు. నేను తలుపు తీసి ఆ వ్యక్తితో తెలుగులో ఏమిటి అని అడిగాను. అందులకు అతను వేరే బాషలో ఏదో చెప్పగా నాకు అర్థంకాక మా గురువు గారిని లేపినాను.

ఆయన వచ్చి ఆ వ్యక్తితో మాట్లాడినారు. అతను మా గురువు గారితో  “మీ ఇరువురికి మా ఓనర్ గారు 4.30గంటల హరతికి అనుమతి తెచ్చినారు” అని చెప్పి వెళ్లి పోయాడు.

అప్పుడు మా గురువు గారు “నీకు బాబా వారి కాకడ హారతి చూడవలెనని సంకల్పం ఉన్నందువలన బాబా గారికి దయకలిగి మనకు కాకడ హరతికి పోవుటకు ఏర్పాటు చేసినారు” అని నా వీపు తట్టి చెప్పినారు.

కనుక మనకు ఏ సంకల్పం ఉన్న బాబాగారు ఇలా తమ అనుగ్రహాన్ని మనపై చూపిస్తారు. ఇది గుర్తు పెట్టుకొని ఆయనపట్ల సదా విశ్వాసంతో ఉండండి

నేను షిర్డీ నుండి కర్నూల్ చేరిన తర్వాత రాత్రి పడుకున్నాను. సుమారు 12గంటల సమయంలో ఒక కల వచ్చింది. ఆ కలలో నేను మళ్ళి షిర్డీ పోయినాను.

సమాధి మందిరం ముంగిట తెల్లటి గుడ్దలు ధరించిన ఒక వ్యక్తీ “ఇక్కడ బాబా గారి సమాధి ఉన్నది. మీరు చూసారా?” అని అడిగారు. అక్కడకు పోనీయారు కదా! అని నేను అనగా, అతను “మీరు చూడాలనుకుంటే నేను చూపించగలను” అని చెప్పినారు.

ఆ కలలోనే నాకు బాబా సమాధి దర్శన భాగ్యం కలిగినది. నేను బాబా సమాధి దర్శించినందుకు ధన్యునిగా బావిస్తున్నాను.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles