సెక్యూరిటీ గార్డుకి అభయ హస్తంతో నిజ దర్శనం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


భక్తుడు: శ్రీనివాస్

నివాసం: హైదరాబాద్

జయదేవ జయదేవ దత్త అవదూతా! ఓ సాయి అవదూతా జోడునికర తవ చరనీ ఠీవితో మాదా! జయదేవ జయదేవ!

దత్త స్వరూపుడైన సాయి అవదూత! మీకు జయము. నా చేతులు జోడించి, నా తల మీ పాదాలపై ఉంచుతున్నమీకు జయము జయము తండ్రి.

సాయి బందువులకు సాయిరామ్. నా పేరు శ్రీనివాస్. సరూర్ నగర్,  హైదరాబాద్ వాసిని. 13 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు రోడ్డు మీద ఒక చిన్న యాక్షిడెంట్ జరిగింది.

అప్పటికే నేను “బాబా బాబా” అంటూనే ఉన్నా, అప్పుడు యాక్షిడెంట్ జరిగిన ప్రదేశం ఎదురుగా బాబా గుడి ఉంది. నన్ను అక్కడికి తీసుకోని వెళ్లారు.

నా చేతికి రక్తం కారుతుంది. అయితే ఒక బాబా భక్తుడు ఊదీని నా చేతికి వేసి కట్టు కట్టాడు. మరుసటి రోజు విప్పి చూస్తే గాయం తాలూకు మచ్చలు ఒక్కటైనా లేవు.

అప్పటి నుండి బాబా మీద నమ్మకం పెరిగింది. బాబా భక్తుడిగా మారిపోయాను.

ఇంకొక అద్భుతమైన బాబా లీలను మీకు వివరిస్తాను:-

నేను దిల్ సుఖ్ నగర్  బాబా టెంపుల్ లో సెక్యూరిటీ గార్డ్ గా వర్క్ చేస్తున్నప్పుడు, మాములుగా మార్నింగ్ అండ్ నైట్ షిఫ్ట్ లు ఉంటాయి కదండి. నాకు ఒకసారి నైట్ షిఫ్ట్ పడింది.

సుమారు పన్నెండు గంటలు అలా అయి ఉంటుంది. దాహంగా ఉందని లోపలికి వెళ్ళాను. నీరు తాగి ఎందుకో అటువైపు చూసాను.

అద్భుతం, మహాద్భుతం. ఆ శిరిడి సాయినాథుని నిజ దర్శనం. తెల్లటి వస్త్రాలు   ధరించారు. మెట్ల   మీద కూర్చుని అభయహస్తం చూపిస్తున్నారు. ఎంతో అందమైన ముఖారవిందం.

రెండు కళ్ళు సరిపోలేదంటే నమ్మశక్యం కాదు. ఇంకా అలాగే చూస్తున్నా. నా రెండు కళ్ళ నుండి ఆనందభాష్పాలు రాలుతూనే ఉన్నాయి.

“అభయహస్తంతో నిజ స్వరూపం బాబా గారిది” ఈ జన్మకు ఇది చాలు అన్పించింది. చాలు బాబా చాలు నన్ను నీ సేవలోనే తరించేలా చేయి అని మ్రొక్కుకున్నాను.

అంతలోనే మాయం అయ్యారు బాబా. తెల్లవారాక గుడిలోని సభ్యులందరికి చెప్పా! బాబా గారి దర్శనంతో అదృష్టవంతుడివి అయ్యావని అందరు అంటుంటే చాలా సంతోషపడ్డాను.

మీతో ఈ అనుభవం పంచుకుంటుంటే చాలా సంతోషంగా ఉంది. అంతా బాబా దయ.

 

***సాయిసూక్తి:

“ఎల్లప్పుడూ సత్సంగాన్ని అంటిపెట్టుకో”.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles