శిరిడీసాయి దర్శనం.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా

🌹శ్రీసాయిసచ్చరిత్రము-12🌹

సద్గురుశ్రేష్టుడైన శ్రీసాయిబాబా భక్తుల క్షేమముకొరకు అవతరించిరి.

జ్ఞానములో నుత్కృష్టులై, దైవీతేజస్సుతో ప్రకాశించుచు వారు అందరిని సమానముగ ప్రేమించెడివారు. వారికి దేనియందు అభిమానము లేకుండెను.

శత్రువులు, మిత్రులు, రాజులు, ఫకీరులు, అందరు వారికి సమానమే.

వారి పరాక్రమమును వినుడు. భక్తులకొరకు తమ పుణ్యము నంతయు వ్యయపరచి యెప్పుడూ వారికి సహాయము చేయుటకు సిద్ధముగా నుండువారు.

వారికిచ్చలేనిచో భక్తులు వారివద్దకు రాలేకుండిరి. వారి వంతు రానిదే వారు బాబాను స్మరించువారు కారు, వారి లీలలు ఎరుగుట కూడా తటస్థి౦చదు.మరి అట్టివారికి బాబాను దర్శించుకొనవలెనను బుద్ధి యెట్లు పుట్టును. కొందరు బాబాను దర్శింపవలెననుకొనిరి. కాని బాబా మహాసమాధి చెందులోపల వారికా యవకాశము కలుగలేదు.

బాబాను దర్శించవలెనను కోరిక గలవారనేకులున్నారు. కాని వారి కోరికలు నెరవేరలేదు. అట్టివారు విశ్వాసముతో బాబా లీలలను వినినచో దర్శనమువల్ల కలుగు సంతుష్టిని  పొందెదరు.

కొందరదృష్టవశమున వారి దర్శనము చేసికొన్నను, బాబా సన్నిధిలో ఉండవలెనని అనుకొనినను నచ్చట ఉండలేకుండిరి.

ఎవ్వరును తమ యిష్టానుసారము శిరిడీ పోలేకుండిరి. అచ్చట నుండుటకు ప్రయత్నించినను ఉండలేకుండిరి. బాబా యాజ్ఞ యెంతవరకు గలదో యంతవరకే వారు శిరిడీలో నుండగలిగిరి. బాబా పొమ్మనిన వెంటనే శిరిడీ విడువవలసి వచ్చుచుండెను. కాబట్టి సర్వము బాబా ఇష్టముపైననే ఆధారపడి యుండెను.

సాయిబాబావారిది ఆనందరూపము.

వారి శక్తి ఊహకందనిది.

సాయి యొక్క లీలలు ఆశ్చర్యకరములు.

🌹సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా🌹 🙏

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles