Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)
బాంద్రాలో నివసిస్తున్న హరి సీతారాం దీక్షిత్‌కి లాయర్‌గా మంచి పేరు ఉంది. 1904లో ఓ కేసును వాదించేందుకు అతను లండన్ వెళ్ళాడు. అక్కడ రైలు ఎక్కుతుండగా జారిపడ్డాడు. కాలు విరిగింది. మంచం పట్టాడు.
కొన్నాళ్ళకు గాయం నయమయిందిగాని, అవిటితనం అతన్ని అంటిపెట్టుకుని ఉండిపోయింది. గట్టిగా నాలుగు అడుగులు వెయ్యలేకపోయేవాడు. వేస్తే భరించలేనంత నొప్పి. ఆ నొప్పితో మానసికంగా బాగా కుంగిపోయాడతను.
అప్పుడే చందోర్కర్‌తో పరిచయం కలిగింది. ఆ పరిచయం స్నేహంగా మారింది. ఒకనాడు తన కష్టాలన్నీ చెప్పుకుని, కన్నీళ్ళు పెట్టుకున్నాడు దీక్షిత్.
‘‘ఒకసారి షిరిడికి వెళ్ళి రండి! బాబాను శరణు వేడుకోండి! మీ కష్టాలు గట్టెక్కుతాయి.’’ అన్నాడు చందోర్కర్.
వెళ్ళాలనుకున్నాడు గాని, బాబా మీద పెద్దగా నమ్మకం లేదు దీక్షిత్‌కి. అలాగే ప్రచారం చేస్తున్న వారి మహిమల పట్ల కూడా చిన్న చూపు ఉంది.
బాబానే పరీక్షిద్దామనుకున్నాడతను. తన కష్టాలు ముందు గట్టెక్కనీ! తర్వాత తీరిగ్గా బాబాను నమ్ముదామనుకున్నాడు దీక్షిత్. కాలి నొప్పిని భరించసాగాడు.
కొన్నాళ్ళకి అహ్మద్‌నగర్ వచ్చాడు దీక్షిత్. అక్కడ మిరికర్ ఇంట బస చేశాడు. మిరికర్ బాబా భక్తుడు. అతని ఇంట బాబా ఫోటోను చూశాడు దీక్షిత్.
‘‘ఈయనేనా సాయిబాబా?’’ అడిగాడు.‘‘అవును’’‘‘బాబాని దర్శించుకోవాలని ఉంది. షిరిడికి వెళ్ళాలని ఉంది.’’ అన్నాడు దీక్షిత్.
‘‘మనం దర్శించుకోవాలనుకున్నంత మాత్రాన బాబా దర్శనం కాదు. అలాగే వెళ్ళాలనుకున్నంత మాత్రాన షిరిడికి వెళ్ళలేం. అన్నిటికీ బాబా అనుమతి కావాలి.
రప్పించుకోమని దండం పెట్టుకో! కరుణించమను.’’ అన్నాడు మిరికర్. చేతులు జోడించాడు దీక్షిత్. కళ్ళు మూసుకున్నాడు. బాబాని ప్రార్థించాడు.
ధ్యానంలో ఉన్న బాబాకి దీక్షిత్ వేడుకోలు వినిపించింది. కళ్ళు తెరిచారు. ధుని దగ్గరగా నిలబడి ఉన్న శ్యామాని చూశారు. కేకేశారతన్ని.‘‘చెప్పు బాబా! ఎందుకు పిలిచారు?’’
‘‘అహ్మద్‌నగర్లో నీకేదో పని ఉందన్నావుగా, వెళ్ళిరా! తిరిగి వచ్చేటప్పుడు మిరికర్‌ని ఓసారి కలువు.’’ చె ప్పారు బాబా.
అహ్మద్‌నగర్లో పని చాలా రోజులుగా వాయిదాలు పడుతోంది. వెళ్ళి చక్కబెట్టుకుని వద్దామంటే, బాబా అనుమతి లేకుండా పోతోంది. ఇప్పుడు ఊహించని విధంగా అనుమతి లభించింది. ఆనందించాడు శ్యామా.
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ‘‘నువ్వు నా వాడివి. నిన్ను నేను వదులుకుంటానా? అందుకే రప్పించుకున్నాను.’’
- ప్రమాదం అంతా మానసికమైన అవిటితనంతోనే! దాన్ని ఎవరికి వారే తొలగించుకోవాలి. తొలగించుకుంటేనే సుఖసంతోషాలు
- కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ – 4
- బాబా నిర్ణయించిన మొత్తమే ముట్టింది(దీక్షిత్, లక్ష్మణ్ భట్)–Audio
- కాకా దీక్షిత్, లక్ష్మణ్ భట్–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments