బాబా 7 గురువారముల వ్రతము – బ్రెస్ట్ క్యాన్సర్ నివారణ



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

 బాబా 7 గురువారముల వ్రతము – బ్రెస్ట్ క్యాన్సర్ నివారణ

బాబా మీద సంపూర్ణమైన భక్తి, నమ్మకం, విశ్వాసము ఉండాలే కానీ, ఏదీ కూడా అసాధ్యమన్నది లేదు. ఈ రోజు ఈ బాబా లీలలో, భక్తితో చేసిన బాబా 7 గురువారముల వ్రతాన్ని ఎంతో నమ్మకంతో ఆచారించగానే, ఒకామెకు బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా నివారణ అయిందో తెలుసుకుందాము.  మనము విశాఖపట్నము నుంచి శ్రీమతి నౌడూరు శారద గారు చెప్పిన బాబా లీలను తెలుసుకుందాము.

శ్రీమతి శారద గారు విశాఖపట్నంలో టీచరుగా పని చేస్తున్నారు. ఆవిడ సహాధ్యాయిని గారి అక్కగారు పోర్ట్ లో పనిచేస్తారట. ఆవిడకి బ్రెస్ట్ క్యాన్సర్. వారి అబ్బాయిలు బొంబాయిలో నావీలో పనిచేస్తూ ఉంటారు. ఈమెను బొంబాయిలో ఆస్పత్రిలో వైద్యం  చేయించారట.

ఆపరేషన్ అయింది గాని, ఇంకా క్యాన్సర్ కి సంబంధించిన లక్షణాలు ఉండిపోయి, ఇంక వైద్యానికి సహకరించడం లేని పరిస్థితుల్లో, అప్పుడప్పుడు జ్వరం రావడం జరుగుతూ ఉండేదిట. డాక్టర్లు కూడా ఇంక తామేమీ చేయలేమని, ఆఖరిదశలో ఉందని చెప్పారు. ఇలా ఉండగా, శారద గారు, సాయి వ్రతం చేసుకుని, ఒక పుస్తకాన్ని బొట్టు పెట్టి తన సహాధ్యాయినికి ఇచ్చారు.

ఆమె తాను ఈ వ్రతాన్ని తన అక్క కొరకు తప్పకుండా చేస్తానని చెప్పారు. వ్రతం నాలుగు వారములు చేయడం జరిగింది. ఆ సమయంలో మరల ఈమె అక్కగారు వైద్య పరీక్షలు చేయించుకోగా, క్యాన్సర్ లక్షణాలు కొంతవరకు తగ్గినట్లు కనపడిందిట. మొత్తం తొమ్మిది వారాలలో ఒకవారము తప్పినా, మరల పూర్తి చేయడం జరిగిందిట.

ఇక బాబా లీల చూడండి. ఆమె ఎంతో, నమ్మకంతో, శ్రద్ధతో చేసిన వ్రతం వృథా కాలేదు. మరలా ఆమె అక్కగారు వైద్య పరీక్ష చేయించుకోగా, డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయే విధంగా ఆవిడకు, క్యాన్సర్ లక్షణాలు పూర్తిగా తగ్గిపోయాయట.

చూశారా, బాబా లీల యెటువంటిదో! తనని నమ్మి శ్రద్ధా భక్తులతో తనని కొలిచేవారిని ఆయనెప్పుడూ, ఎల్లవేళలా, ప్రతిక్షణం కంటికి రెప్పలా కాపాడుతూనే ఉంటారు.

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles