Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై !!
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై !!
ఒకరోజు కలలో,నేను సైకిల్ మీద స్పీడ్ గా వెళ్తున్నాను.ఆలా వెళ్తూ ఒక 22 ఇయర్స్ ఉంటాయేమో అతనికి,మొత్తం వైట్ పంచ,పైన కండువా మొత్తం కప్పుకుని ఉన్నారు.
బట్టలన్నీ మాసిపోయి,కొంచం పసుపు కలర్ లాగా అనిపించాయి.యెర్రని మట్టిలొ నడుస్తున్నారు.నేను సైకిల్ మీద స్పీడ్ గా వెల్లుకుంటూ అతనికి చిన్నగా డాష్ ఇచ్చాను.అతన్ని చూడగానే ఏంటి ఇతను ఇలా ఉన్నాడు.స్నానం చేసి చాల రోజులైనట్టు ఉంది అనుకున్నాను.
అతను ఎలా ఉన్నా నేను తనకి డాష్ ఇచ్చాను కదా తనకి నొప్పిగా ఉంది ఉంటుంది.సో తనకి సారీ చెప్పడం నా సంస్కారం అని అనుకుని సారీ ,కావాలని డాష్ ఇవ్వలేదు అనుకోకుండా ఆలా ఐంది నొప్పిగా ఉందా?అని అడిగాను.దానికి అతను నాతో ఏమి మాట్లాడకుండా నవ్వుతు వెళ్తున్నాడు.నేను ఈయనేంటి ఇలా నవ్వుతు పోతున్నాడు అనుకుని.నాకెందుకులే అని మళ్ళీ సైకిల్ ఎక్కాను.
కానీ,యెంత తొక్కినా సైకిల్ కదలట్లేదు.చాల ట్రై చేశా.కానీ ఒక్క ఇంచు కూడా ముందుకు కదలట్లేదు. అతను నా అవస్థ చూసి బాగా నవ్వుతున్నారు.నేను అతన్ని చూసి ఎలా నవ్వుతున్నాడో చూడు నేను కదలట్లేదని.నేను తనకి సారీ కూడా చెప్పాను.అయినా నన్ను చూసి నవ్వుతున్నాడు అనుకుని.నేను బాబా ని మనసులో తలచుకుని బాబా ప్లీజ్ నేను కదలలేకపోతున్నాను నేను ముందుకు మూవ్ అయ్యేలా చేయరా? అని అడిగాను.
నేను ఆలా అడుగుతున్నప్పుడు పక్కకి బాబా ఫోటో కూడా కనిపించింది.కానీ ఎక్కడ ఉన్నానో అక్కడే ఉన్నాను.ఒక్క ఇంచుకూడా కదలట్లేదు.ఆ నవ్వుతున్న అతను నన్ను చూసి,నేను తప్ప ఇంకెవరు నిన్ను అక్కడి నుండి ఎవరూ,కదిలించలేరు అన్నాడు.
నేను వినిపించుకోకుండా అలానే బాబా ని మళ్ళీ తలుచుకున్నాను.కానీ కదలలేకపోతున్నాను.బాబా నన్ను కదిలేలా చెయ్యట్లేదు ఏంటి అనుకున్నాను.నేను ఇలాగె స్ట్రక్ అయిపోతానేమో అని బయమేసింది.అతను నన్ను చూసి నవ్వుతూనే ,ఉన్నాడు.
నేను తనతో ఎందుకు నవ్వుతున్నారు? మీకు నేను తెలియక డాష్ ఇచ్చాను సారీ కూడా చెప్పాను కదా అయినా మీరు తప్పుగా అనుకుంటే మళ్ళీ సారీ చెపుతున్నాను అన్నాను.
దానికి అతను ఏ, మీ బాబా కి ఇందాక నమస్కారం పెట్టుకుని అడిగావు కదా అయినా అక్కడినుండి కదలలేక పోయావు.మళ్ళీ అడుగు కదిలేలా చూస్తాడేమో చూద్దాము అన్నాడు.నాకు అతను ఎగతాళిగా మాట్లాడే సరికి రోషంతో మా బాబా నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తారు.ఇప్పుడు కూడా చేయగలరు కానీ ఎందుకో చెయ్యట్లేదు. అన్నాను.
బాబా కి నమస్కారం పెట్టుకుని నేనూ కదిలేలా చేయి ఇక్కడినుండి అని అడిగా.కానీ నేను కదలలేకపోతున్న ఒక్క మొఖం తప్ప ఏవి పనిచేయట్లేదు.
అతను నవ్వి నువ్వు నా దగ్గరికి వచ్చి నా పాదాలకు నమస్కారం చేసి అడిగితె నువ్వు అక్కడినుండి కదిలి ముందుకు వెళ్లేలా చేస్తాను అన్నాడు. నేను ఇక చేసేదేం లేక అలాగే అని సైకిల్ పైన కళ్ళు మూసుకుని మీకు నమస్కారం చేస్తున్నాను అనుకుంటూ కళ్ళు మూసుకుని బాబా ఫోటోని ఊహించుకుని,బాబా ఫోటోకి నమస్కారం చేస్తున్నాను.
ఇతను ఓహో అలాగా సరే ఐతే బాబాకే నమస్కారం పెట్టుకో పో, నేను వెళ్తున్న అని ముందుకు కదిలాడు.నేను ఇక చేసేదేం లేక,లేదు లేదు మీకు కూడా నమస్కారం చేస్తాను అన్నాను.ఐతే చేయి అన్నాడు.ముందు నన్ను కదిలిస్తే కదా నేను వచ్చి నమస్కారం చేసేది.ఇలా ఎలా చెయ్యాలి అంటే,సరే రా అన్నాడు.ఆటోమేటిక్ గా నేను కదలగలుగుతున్నాను.
సైకిల్ దిగి వచ్చి అయన పాదాలకు నమస్కరిస్తూ బాబా నన్ను ఆశీర్వదించండి అన్నాను.దాని అతను నన్ను ఆశీర్వదించారు.నేను ఇప్పుడు కూడా బాబా ఆశీర్వదించండి అనే కదా ఇతనికి నమస్కరించాను.మరి ఇప్పుడెందుకు ఇతను ఏమనట్లేదు అనుకున్నాను.
నేను నా మ్యారేజ్ గురించి,జాబ్ గురించి అడిగాను.ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవరికి తెలుసు దేవుడిని నమ్ముకో , అంత దేవుడే చూసుకుంటాడు అని నవ్వుకుంటూ వెళ్ళాడు.అప్పుడు నాకు అతను ఇతనెవరో మహాత్ముడు అనిపించింది.
మెలుకువ వచ్చాక ఆరోజంతా బాధగా అనిపించింది.అతనెవరు? బాబాని తలచుకున్నా కూడా కదలలేకపోయా.అతనికి నమస్కరిస్తాను అనగానే కదలగలిగాను.అంటే,అతను బాబా కంటే గొప్పవాడా?బాబా కంటే గొప్పవాళ్ళు ఉంటారా?మరి అతని కాళ్లకు నమస్కరించినప్పుడు అతన్ని నేను ఆశీర్వాదాలు అడగలేదు అప్పుడు కూడా బాబా నే అడిగాను మరి అప్పుడెందుకు కదలగలిగాను? ఇంతకీ అతనెవరు? అని బాధ అనిపించింది.
నాకు మనసుకు కి హ్యాపీ గా ఉన్నప్పుడు ఎప్పుడు ఒక 11 టిఫిన్ పాకెట్స్ ప్యాక్ చేయించుకుని వెళ్లి రోడ్ పై అడుక్కునే వాళ్లకు ,ఫుడ్ అవసరమైన వాళ్ళ కు 11 మందికి వెళ్లి ఇచ్చేదాన్ని. ఈ ఫుడ్ ఎవరికి అవసరమో వాళ్ళకే చేరేలా చేయి బాబా,అనుకునేదాన్ని.
నాకు టెంపుల్ లో కొబ్బరి కాయలు కొట్టడం,పూజలు,అర్చనలు చేయడం లాంటివి పెద్దగా ఇష్టం ఉండదు.దానికంటే ఇలా ఫుడ్ పంచి పెడితే వాళ్లకు ఆకలి తీరినట్టు ఉంటుంది.బాబాకి కొబ్బరికాయ కొట్టడం కంటే ఇలా చేస్తే హ్యాపీ గా ఫీల్ అవుతారు అనుకునే దానిని.ఆ పాకెట్స్ తీసుకెళ్లి యెంత టైం అయినా,యెంత దూరం అయినా నడిచి,ఆలా వెతికి మరీ ఇచ్చి వచ్చేదానిని.
ఇప్పుడు మనసు హ్యాపీ గా లేదు. ,కొంచం గందరగోళంగా ఉంది.ఎవరికైనా ఇద్దరికీ టిఫిన్ ఇచ్చి వద్దాం అనుకున్నాను.నాతో పాటు వస్తావా అని మారుతిని అడిగాను.
మారుతి వాళ్ళ హాస్టల్ వెకేట్ చేసి ఇంటికి వెళ్తుంది.బాబా అంటే తనకి ఇష్టం కదా అని రజని అక్క వాళ్ళ ఇంట్లో,మారుతి కోసం బాబా నామం పెట్టించింది.సో మేము నామంకి అటెండ్ అవ్వాలి.ఈ లోగా టిఫిన్ పాకెట్స్ ఇచ్చి వద్దాము అనుకుని టిఫిన్ సెంటర్ కి వెళ్లి ఆర్డర్ ఇచ్చాము వర్షం పడుతుంది,టిఫిన్ వచ్చేసరికి టైం పడుతుంది అని అక్కడే కూర్చున్నాము.
మారుతి ఎందుకు డల్ గా ఉన్నావు అంటే చెప్పాను.తనకి నమస్కారం చేస్తాను అంటేనే నేను కదలగలిగాను.అతను ఎవరో నాకు తెలియడం లేదు. బాబా కంటే గొప్పవాడా?అంటే బాబా నీకు అతన్ని గురువుగా ఇద్దాము అనుకుంటుండొచ్చు అని చెప్పింది.బాబా కంటే ఇతని దగ్గర ఉంటె నీకు ఎక్కువ లాభం ఏమో అందుకే ఆలా కల వచ్చిందేమో అంది.
నాకు ఇప్పుడు నేను అతన్ని గురువు అనుకుంటే,బాబా కంటే గొప్పవాడు కాబట్టి ,అతని దగ్గరికి వెళ్ళాను అనిపిస్తది అతను బాబా కంటే గొప్పవాడైన సరే బాబా ఏమి ఇవ్వకున్నా అయన ఏం ఇచ్చినా సరే,బాబా కంటే ఎవరో ఏదో ఇస్తారని నేను ఎవరి దగ్గరికి పోను నాకు బాబా నే కావాలి అని ఏడుపు కూడా వచ్చింది.
ఆ సత్సంగం ఎందుకు పెట్టుకున్నానో కానీ,అప్పటినుండి నాకు మనశాంతి లేదు అన్నాను. అలా అనకు,నీకు మంచి జరగడానికి ఆలా జరుగుతుందేమో,నువ్వు బాబాని ఇంత ఇష్టపడుతున్నావు కాబట్టి బాబాకి కూడా నీ మీద ఇష్టం తో ఇలా చేస్తున్నాడేమో అంది.
వర్షం తగ్గాక టిఫిన్ పాకెట్స్ తీసుకుని వెళ్తున్నప్పుడు.బాబా, మేము మళ్ళీ రజని అక్క వాళ్ళ ఇంటికి నామం కి వెళ్ళాలి.అక్క మారుతి కోసం ఏర్పాటు చేస్తుంది.సో మేము తొందరగా వెళ్ళాలి.ఈ పాకెట్స్ ఎవరికి అవసరమో,నా ద్వారా ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావో వాళ్ళకి తొందరగా అందేలా చేయి అని చెప్పుకున్నాను.
మారుతికి ఒకవేళ మనకు ఎవరూ తొందరగా కనిపించకుంటే నీకు లేట్ అవుతుంది కదా సో నువ్వు జస్ట్ సిగ్నల్స్ వరకు రా అక్కడ ఏవయినా కనిపిస్తే ఇద్దాము.లేదంటే నువ్వు మీ హాస్టల్ కి వెళ్ళిపో నేను ఇవి ఎవరికి చేరాలో వాళ్ళకి ఇచ్చే వస్తాను అని చెప్పాను.తాను ఓకే అంది.
మెం సిగ్నల్స్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ వైట్ డ్రెస్ వేసుకున్న ఒక తాత కన్పించారు.గడ్డం ఉంది పైన టోపీ పెట్టుకున్నాడు.ముస్లిం లగే ఉన్నాడు.నాకు ఎందుకో తనకి ఇవ్వాలనిపించింది.కానీ,తాను తీసుకుంటాడా అని మళ్ళీ డౌట్ వచ్చింది ఎందుకంటె అతను నీట్ గా ఉన్నాడు.అడుక్కునే అతనిలాగా లేడు.
అంత వర్షం లో అంత బురదలో కూడా తన డ్రెస్ చాల వైట్ గా ఉంది.నేను తన దగ్గరికి వెళ్లి, తాత !ఆకలేస్తుందా అని అడిగాను.అవును కానీ ఈ వర్షం లో ఎక్కడికి పోవాలి అని చూస్తున్న అన్నాడు.నా దగ్గర ఇడ్లీ ప్యాకెట్ ఉంది మీరు ఏమనుకోనంటే ఇస్తాను తీసుకుంటారా ని అడిగాను.
ఓ సంతోషంగా తీసుకుంటా అన్నారు నేను ఒక ప్యాకెట్ ఇచ్చాను.ఇంకో ప్యాకెట్ మారుతి చేతిలో ఉంది. వెనక్కి తిరిగి ఈ ప్యాకెట్ కూడా ఎవరిదో వాళ్ళకి తొందరగా చేరితే మారుతి వాళ్ళ హాస్టల్ కి వెళ్లొచ్చు అనుకుంటూ ఒక అడుగు ముందుకు వేసా.
ఆ తాత నాతో,నీ దగ్గర ఇంకో ప్యాకెట్ ఉంటె ఇవ్వవా అని అడిగాడు. ఉంది మా ఫ్రెండ్ దగ్గర ఉంది అన్నాను.అది కూడా నాకే ఇస్తావా ఇంటి దగ్గర మా ముసలిది ఉంది దానికి ఇస్తాను అన్నాడు నేను హ్యాపీ గా మారుతి దగ్గరి ప్యాకెట్ తీసుకుని తనకి ఇచ్చి,థాంక్స్ తాత అని చెప్పి,బాబా మన పని తొందరగా అయ్యేటట్టు చేసాడు అనుకుని హాస్టల్ కి వెళ్ళాము.
మారుతి నాకు కొద్దీ దూరంలో నించుని ఉంది మరి ఖాళీ చేతులతో ఉన్న నన్ను నీ దగ్గర ఇంకో ప్యాకెట్ ఇస్తావా అని ఎందుకుఅడగాలని అన్పించిందో తెలియదు.కానీ అదంతా ఆలోచించే పరిస్థితులలో లేము మేము.వర్షం వల్ల కరెంటు లేదు .
నేను అంతకుముందు ధుని దగ్గర దీపాలు వెలిగించాను కదా అది నచ్చి అక్క రూమ్ లో దీపాలు వెలిగించింది.నామం చెపుతున్నారు.కానీ ,నా మనసులో కలలో కనిపించింది ఎవరో అనే బాధ తో పిచ్చి పిచ్చిగా ఉంది మనసంతా.
నన్ను నామం చెప్పమన్నారు. నేను బాబాకి అతనెవరో నాకు తెలియాలి అనుకుని కళ్ళు మూసుకుని నామం చెపుతున్నాను.కళ్ళు మూసుకున్నప్పుడు అతని ఫేస్ కనిపించింది.కళ్ళు తెరిచేసరికి ఆటోమేటిక్ గా నా కళ్ళు గురువు గారి ఫోటో ని చూశాయి.ఎక్కడో పోలికలున్నాయి.గురువుగారు 22 ఆలా ఆ ఏజ్ లో ఉంటె ఎలా ఉంటారో అలానే ఉన్నాయ్ కలలో కనిపించిన అతని పోలికలు. కొంతసేపు గురువుగారి ఫోటోని అలాగే చూసాను.కన్ఫమ్ అయిపోయింది అది గురువు గారూ అని.
బాబా గురువు గారిని నాకు గురువుగా ఇద్దాం అనుకుంటున్నారు కానీ నేను వినట్లేదు కనుక,ఆలా గురువే ముందు ఇంపార్టెంట్,గురువుకి నమస్కరించాకే నాకు నమస్కరిస్తే నేను ఆ నమస్కారాన్ని ఆమోదిస్తాను అని చెప్పారనుకుంటాను.
అందుకే కలలో నేను కళ్ళు మూసుకుని గురువు కి కాకా బాబా కి నమస్కారం చేసినాకూడా కదలలేక పోయా .అప్పుడు నేను గురువు కి ఇంపార్టెన్స్ ఇవ్వక బాబాకే ఇద్దాము అనుకున్నాను. అదే గురువుకి నమస్కారం చేస్తాను అనుకుని అతని దగ్గరికి వెళదాం అనుకోగానే ఆటోమేటిక్ గా కదల గలిగాను.
గురువు గారికి కూడా బాబా అంటేనే ఇష్టం.కాబట్టి నేను నా మనసులో ఇగో లేకుండా అతని పాదాలకు నమస్కారం చేస్తూ బాబా ఆశీర్వదించు అనగానే ఆశీర్వదించారు అనుకున్నా.ఇక్కడ బాబా నాకు గురువు ఇంపార్టెన్స్ ని ఆలా చూపించి.గురువు గారిని నాకు గురువు అని చెప్పినట్టు అనిపించింది.
అయినా కూడా మళ్ళీ బాధ నేను బాబాని గురువు అని అనుకుంటాను.అప్పుడు బాబానే దైవం,బాబానే గురువు అవుతారు కదా.మరి నాకు ఇంకో గురువెందుకు.బాబా నా అల్లరి భరించలేక, నన్ను వదిలించుకోవడానికి నన్ను గురువుగారి దగ్గరికి పంపుతున్నారా ?అని మళ్ళీ ఏడుపు నాకు.
నిజంగా బాబా నాకు యెంత ఓపికగా ఇంత మొండిఘటాన్ని ఐన నాకు,ఎంతో ఓర్పుతో ,నా మనసుని మెల్లి మెల్లిగా గురువుగారి వైపు తీసుకెళ్లారు అని గుర్తొస్తే,బాబా ప్రేమ అంటే అదే అనిపిస్తుంటుంది.
Latest Miracles:
- బాబా నువ్వు నా గురుంచి ఆలోచిస్తున్నవా! అని సంతోషించాను.—Audio
- నువ్వు ఒక్క అడుగు ముందుకు వేయి, బాబా నిన్ను తన దగ్గరకు లాగుతాడు.
- “నువ్వు నిశ్చలంగా కూర్చో! అవసరమైనదంతా నేను చేస్తాను! నిన్ను చివరికంటా గమ్యం చేరుస్తాను” అన్న శ్రీ సాయి ప్రభోదానికి నిదర్శనం!–Audio
- నన్ను ఆరోగ్యవంతున్ని చేసి, నా కుమార్తె వివాహం జరిపించిన బాబా వారు…రవి కుమార్
- ఆ సాయి నాధుడే కదిలి వచ్చాడు ఒక కొత్త డాక్టర్ రూపం లో
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “నా పాదాలకు నమస్కారం చేసి అడిగితె నువ్వు అక్కడినుండి కదిలి ముందుకు వెళ్లేలా చేస్తాను అన్నాడు.”
Sreenivas
February 4, 2017 at 5:12 amసాయి బాబా,,,సాయి బాబా…సాయి బాబా…సాయి వంటి దైవంబు లేడోయ్ లేడోయ్…శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ