Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ! సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకీ జై !!
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-108-నువ్వు నిశ్చలంగా కూర్చో 6:35
నా పేరు వేలూరు హరిహరశర్మ. రిటైర్డ్ ప్రిన్సిపాల్. నేను నెల్లూరులోని సరస్వతినగర్ లో వుంటున్నాను.
నాకు 2005 సంవత్సరము నవంబరు నెలలో బాబా ప్రసాదించిన దివ్యానుభవాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను.
మా ఇంటికి ఒకరోజున ఉలవపాడు నుండి శ్రీ యస్.వి.యల్ నారాయణరావుగారి నాన్నగారైన శ్రీ నీలకంఠమగారి వివరాలకు సంబంధించిన ఒక కవరు,
మా అమ్మాయి అత్తగారి పెన్షన్ కు సంబంధించిన లైఫ్ సర్టిఫికేట్ గల కవరు, రెండు కొరియర్ లో వచ్చాయి.
నేను వాటిని ఒక ఫైలులో భద్రపరిచాను.
ఒకరోజున నేను పెన్షన్ కు సంబందించిన ఆ లైఫ్ సర్టిఫికేట్ ను బ్యాంక్ వారికి అందచేయడానికి (ఆ సర్టిఫికేట్ ఇస్తేనే పెన్షన్ వస్తుంది) ఆ రెండు కవర్లున్న ఫైలును తీసుకోని మా ఇంటి నుండి రిక్షాలో రైల్వే స్టేషన్ వద్ద గల యస్ .బి. ఐ బ్రాంచ్ కు వెళ్ళాను.
రిక్షాదిగి బ్యాంకులోకి వెళ్ళి లైఫ్ సర్టిఫికేట్ ను బ్యాంకు వాళ్ళకి ఇవ్వాలని ఫైలు తెరచి చుస్తే దాంట్లోని రెండూ కవర్లు లేవు. అక్కడ అంత వెదికాను.
రిక్షా దిగిన చోట వెతికాను. ఎక్కడ కనపడలేదు. నాకు చాల కంగారువేసింది.
నేను వేరే రిక్షా మాట్లాడుకొని ఇంటి దగ్గరకాని, నేను వచ్చేదారిలోకాని ఏమైనా పడ్డాయోమోనని వెతకడానికి మాఇంటికి వెళ్ళాను.
ఎక్కడా కనబడలేదు. నేను మొదట ఎక్కినా రిక్షా వాడు మా ఇంటి దగ్గరివాడే. అతను నాకు కనిపించాడు.
అతనిని కూడా అడిగాను. “మీ దగ్గర కవర్లు ఉండటం నేను చూశాను. కాని అవి నా రిక్షాలో మాత్రం పడలేదు సార్” అని అతనన్నాడు.
నేను బ్యాంకుకి వెళ్ళే ముందర స్టోన్ హౌస్ పేటలో గల గ్రంధాలయానికి వెళ్ళాను.
ఒక వేళ అక్కడేమన్నా జారవిడుచుకోన్నానేమోనని ఆత్రుతతో అక్కడికి వెళ్ళి అక్కడి వారందరిని అడిగాను.
ఇక్కడేమిపడలేదనే జవాబు వచ్చింది.పెన్షన్ కు సంబందించిన లైఫ్ సర్టిఫికేట్ మళ్ళి సంపాదించుట చాలా కష్తం.
సరేలే ఎలాగోలా చేద్దాం అనుకోని ఇంటికోచ్చేశాను.మా అమ్మాయి వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పాను.
ఇంకొక సర్తిఫికటేను ఎలాగోలా సంపాదించి పంపమని చెప్పాను.
ఆ రోజు రాత్రి బాబా ఫోటో వద్ద కూర్చొని బాబానే చూస్తూ “ఏంది బాబా! ఎందికిలా జరిగింది? ఇప్పుడు ఏమి చేయాలి అని అనుకుంటూ వుండగా ఫోన్ మ్రోగింది.
అప్పుడు రాత్రి సుమారు 9 గంటలైనది. ఫోన్ తీశాను. ఒకావిడ ఫోనులో “ఏమండి మీవేవైనా వస్తువులు పోయాయా? ” అని అడిగింది. అవునమ్మా!
ఈరోజు ఉదయం రెండు కవర్లు నా ఫైలులో నుంచి జారి ఎక్కడో పడిపోయాయి అని ఆమెకు చెప్పాను.
ఆ కవర్లు మా పిల్లలకు చిక్కాయి. మేము పొదలకురురోద్దువద్ద ఉంటున్నామని వాళ్ళ అడ్రస్ చెప్పి రేపు ఉదయము 8 గంటల లోపల వచ్చి ఆ కవర్లు తీసుకోమని చెప్పింది.
నాకు చాలా సంతోషం వేసింది.బాబాను వేడుకోగానే వెంటనే బాబా నా మోర ఆలకించి నా కవర్లు దొరికిన విషయం ఆమెచే చెప్పించినందుకు నన్ను నేనే నమ్మలేకపోయాను.
ఆ రోజు రాత్రంతా బాబానే తలచుకుంటూ నిద్రపోయాను.
ప్రక్కరోజు నేను వాళ్ళ ఫోన్ నంబర్ తీసుకోని ఆమె చెప్పినట్లుగా వాళ్ళ ఇల్లు కనుక్కోవడానికి ఉదయం 7.45 నిమిషాలకు వెళ్ళను.
నేను వాళ్ళ ఇల్లు కనుక్కోలేకపోయాను. వాళ్ళిచ్చిన ఫోన్ నంబరుకు ఫోన్ చేశాను.
వాళ్ళబ్బాయి వచ్చి నన్ను వాళ్ళింటికి తీసుకెళ్ళాడు.ఇంటిలోపలికి కెళ్ళగానే ఎదురుగా పెద్ద బాబా ఫోటో గల క్యాలెండరు కనిపించింది.
నన్ను ఇక్కడకు రప్పించింది ‘బాబా’నే అని నేను ఎంతో తన్మయత్వానికి లోనయ్యాను.
అసలు నా ఫోన్ నంబరు వాళ్ళకెలా వచ్చింది? నా కవర్లు వాళ్ళకెలా దొరికాయో అడిగాను.
అప్పుడు వాళ్ళ అమ్మ ఇలా చెప్పారు.”మా పిల్లలు పాలిటెక్నిక్ కాలేజిలో చదువుచున్నారు.
క్యాస్ట్ సర్టిపికేట్ కోసం నిన్న మా పిల్లలు రైల్వే స్టేషన్ వద్ద గల యం.అర్.ఓ.ఆఫిసుకు వెళ్ళడం జరిగింది.
బ్యాంకు వద్ద రెండు కవర్లు పడివుండడం గమనించి మా పిల్లలు వాటిని భద్రపరచి ఇంటికొచ్చి నాకిచ్చారు.
ఆ కవర్లమీద ఉన్న ఫోన్ నెంబరు చూసి నేను మీకు ఫోనేచేశాను” అని ఆమె చెప్పింది.
నేను అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందాను.
ఇది ఖచ్చితంగా నా బాబానే చేశారనిపించింది.
ఎందుకంటే ఎంతో జనసందోహం వుండే ప్రాంతంలో ఆ కవర్లు వాళ్ళకే కనపడటం వాళ్ళు వాటిని భద్రపరచి నాకు ఫోన్ చెయ్యడమూ, అంతకన్నా ఆశ్చర్యంగా “నువ్వు నిశ్చితంగా కూర్చో! అంతా నేనే చేస్తాను” అన్నట్లు
నేను వాళ్ళింటికెళ్ళగానే పెద్ద బాబా ఫోటో వుండటం ఇంతకన్నా నాకేం నిదర్శనం కావాలి. బాబా ఆ రోజు అన్నట్లు ”
నా సమాధిలోంచి నా ఎముకలు కూడా మాట్లుడుతాయి, నా మట్టి సమాధానమిస్తుంది” అన్న పలుకులు గుర్తుకొచ్చి నేను చాలా తన్మయత్వానికి లోనయ్యాను.
వాళ్ళ వద్ద నుండి ఆ కవర్లు తీసుకోని ఇంటికొచ్చి మా వాళ్ళందరికీ బాబా ప్రసాదించిన ఈ లీలను ఎంతో ఉద్వేగంతో చేపుకున్నాను.
ఆ ప్రక్కరోజు మరలా వాళ్ళింటికెళ్ళి వాళ్ళకి ఒక బాబా ఫోటో, గురువుగారి ఫోటో మరియు 50/- రూపాయలు బాబా ప్రసాదంగా ఇచ్చి
“బాబావారే మీలో ప్రవేశించి ఇక దొరకవనుకున్న కవర్లను మీద్వారా నాకు భద్రంగా అందించారు. అదేవిధంగా మీరుకూడా బాబాను గురువుగారిని అంటిపెట్టుకొని వుండండి.మీకు కూడా నాలాగే బాబా, గురువుగారు మీలు చేస్తారు” అని చెప్పాను
మీ గురుబంధువు
వి. హరిహరశర్మ
నెల్లూరు
సంపాదకీయం: సద్గురులీల (జూలై – 2008)
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- సాయి బాబా వారు ఒక భక్తుని కోరిక ఇంకొక భక్తుని ద్వారా తీర్చుట.–Audio
- సాయి బాబా నా సోదరుడిని రక్షించారు
- బాబా, నీవు తలచుకుంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలవు—Audio
- సద్గురు సాయినాథుని సాక్షాత్కారం, యోగయ్య, కోట, నెల్లూరు జిల్లా.
- పిలిస్తే పలికే దైవమని, భక్తురాలికి అనుభవపూర్వకంగా తెలియచేసిన బాబా వారు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments