ఎంత ఆశ్చర్యము. నేను నీ వెంటనే వున్నాను.నీశ్చితంగా ఉండు–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!! సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై !!

This Audio Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-107-నేను నీ వెంటనే వున్నాను 6:09

నా పేరు పి. రజనికర్. నేను చిల్లకూరు మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. నాకు ఇటివల (27-6-2008) బాబా వారు అందించిన అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను.

నేను జూన్ నెల 27వ తేదీన గూడూరు యస్ .బి.ఐ  బ్రాంచ్ కీ పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి వెళ్ళాను. నాతోటి ఉపాద్యాయులందరూ లోన్ శాంక్షన్ కావడం చాలా కష్టమని రెండు మూడుసార్లు గూడూరుకు వెళ్ళాల్సి ఉంటుందని అన్నారు.

నేను ఆ రోజు ఉదయం రోజులాగానే నెల్లూరులోని జేమ్స్ గార్డన్ లో గల సాయిబాబా మందిరానికి వెళ్ళి నాకు ఏ ఇబ్బందులు కలుగకుండా లోన్ శాంక్షన్ చేసి పెట్టు బాబా దానికి మీ ఆశీర్వాదం కావాలని గురువుగారితో విన్నవించుకొని బ్యాంకుకి వెళ్ళాను.

ఫీల్డ్ ఆఫీసర్ ను కలిసి లోన్ కావాలని అడిగాను. ఆమె ప్రక్కన బాబావారి ఒరిజినల్ ఫోటోగల పెద్ద క్యాలండర్ తగిలించి వుంది.

బాబావారు నాతోనే వున్నారని నాకనిపించి చాలా సంతోషం వేసింది.

“బ్యాంక్ మేనేజర్ నిన్ననే ట్రాన్స్ ఫర్ అయి వేరే ఊరికి వెళ్ళారు.

కొత్త మేనేజర్ వచ్చేదాకా లోన్ ఇవ్వడం కుదరదని” ఆమె చెప్పారు.ఇదేంది?

మనం నెల్లూరు నుండి సెలవు పెట్టుకుని ఇంతదూరం వస్తే ఇలా జరిగింది అని అనుకోని

“బాబా ! నాకు తెలియదు నువ్వే ఎలాగైనా పనిచేసి పెట్టాలి” అని ఎదురుగా వున్న బాబా ఫోటోను చూసి వేడుకున్నాను.

5 నిమషముల తరువాత ఆమె నన్ను పిలచి వివారాలు అడిగి అప్లికేషన్ ఇచ్చింది.ఎంత అద్భుతమో కదా!

ఆ అప్లికేషన్ లో రూ.300/-లుకు స్టాంపులు అంటించాలి  ఆ అప్లికేషన్ తీసుకొని గూడూరులోని సబ్ ట్రెజరీ ఆఫీసుకు వెళ్ళాను.

అక్కడ చాలా జనం వున్నారు. మేమెవరో తెలియకపోయినా అక్కడ పనిచేసే క్లార్క్ నా అప్లికేషన్ తీసుకొని దగ్గరుండి అన్ని స్టాంప్స్ అంటించి, నన్ను పంపించారు.

“ఎంత ఆశ్చర్యము. నేను నీ వెంటనే వున్నాను.నీశ్చితంగా ఉండు” అంటూ బాబా ఫోటో ఒకటి ఆ గదిలో కనపడింది.

బాబాకు మనసులోనే కృతఙ్ఞతలు  తెలుపుకొని యం.ఇ.ఓ గారి సంతకాల కోసం “చిల్లకూరు”కి వెళ్ళాను. అప్పటికి సమయం ఒంటిగంట  అయినది. సార్ అక్కడ లేరు.

మద్యాహ్నం సుమారు 3-30 నిమషాలకు సార్ వచ్చారు.నేను అప్లికేషన్ లో అన్ని వివరాలు పూర్తిచేసి, సార్ వద్ద నుండి సంతకాలు తీసుకోని ఆ అప్లికేషన్ ను తిరిగి బ్యాంక్ లో ఇవ్వడానికి గూడూరుకు వచ్చాను.

అప్పటికి 4 గం  15 ని అయినది. బ్యాంకు 4 గంటల వరకు ఉంటుంది.

గేటు మూసేసి వున్నది.లోపల స్టాఫ్ మాత్రం వుంటారు.అక్కడున్న సెక్యూరిటిని అడిగితే ఆతను టైము అయిపోయింది.

ఇప్పుడేవరినీ లోనికి పంపించరు అని చెప్పాడు.ఇప్పుడెలా చేయాలి?  మళ్లీ ఇంకోరోజు సెలవు పెట్టి ఇక్కడకు రావాలి. ఎలాగా? అనుకుంటూ బాబావారికి మళ్లీ వెడుకొన్నాను.

ఒక పది నిమిషాల తర్వాత ఆ సెక్యూరిటి అతనే నన్ను లోపలకి వెళ్ళమన్నాడు.నేను ఫీల్డ్ ఆఫీసరు వద్దకు వెళ్ళాను.

ఇప్పుడు తైమ్ అయిపోయినది కదా! నేను చేయను. మీరు రేపురండని ఆమె చెప్పింది.

అప్లికేషన్ గ్రౌండ్ వర్క్ అంతా అయిపోయింది. ఎలాగైనా ఆమె తీసుకొనేటట్లు చేయి బాబా,

నేను మళ్లీ రాలేను సెలవు దొరకదు అని బాబాతో విన్నవించుకున్నాను.

పది నిమిషముల తర్వాత ఆ ఆఫీసరే నన్ను పిలచి నా అప్లికేషన్ తీసుకోని అన్ని వెరిఫై చేసి నా దగ్గర నుండి కావలసిన సంతకాలన్ని తీసుకోని నా అప్లికేషన్ ను ఫర్ దర్ గా ఫార్వడ్ చేస్తానని ఒక వారం రోజులలో అమౌంట్ వస్తుందని చెప్పింది.

బ్యాంక్ తైమ్ అయిపోయిన తర్వాత కూడా బాబానే ఆ ఆఫీసర్ రూపంలో వచ్చి ఆమెకు ఎన్నో పనులున్నా నా అఫ్లికేషన్ తీసుకోని నా పని పూర్తి చేసి పంపారు.

మా ఫ్రెండ్స్ అందరు ఇదెలా సాద్యం! మాకందరికి మూడు నాలుగు సార్లు సెలవులు పెట్టుకుని తిరిగితే కాని పనికాలేదు.

నీకు మాత్రం ఒక్క రోజులోనే ఒక్కసారికే అయిపోయింది.

ఇదంతా ఖచ్చితంగా నీకు నీవు నమ్ముకొన్న బాబానే చేశారు అని వాళ్ళంతా నన్ను అంటుంటే అవును ఇది ఖచ్చితంగా బాబానే దగ్గరుండి చేసి పంపించారని నేను వాళ్ళతో అన్నాను.

డబ్బులు కూడా ఒక పదిరోజులలో వస్తాయని ఆమె చెప్పింది. కాని నాకు రెండు రోజులలోనే నేను అప్లై చేసిన లోన్ డబ్బులు వచ్చేశాయి.

ఇది ఇంకా ఆశ్చర్యము. అసలు నేనే నమ్మలేకపోయాను. వచ్చిన డబ్బును బాబా, గురుజీల పాదాల చెంత వుంచి నాకు అవసరమైన పనికి వాడుకున్నాను.

అప్పుడు నాకు “బాబావారి దయ అండగనుండ చింతలు ఎలానయా?” అని అనిపించింది.

సదా నా హృదయములో నివశించే నా సద్గురువుకు వేవేకపూర్వకమైన నమస్కారాలు చేస్తూ … బాబా మహిమకు జయజయకారాలర్పిస్తూ …ఈ అనుభవాన్ని మీ అందరితో పంచుకోన్నందుకు మీకు కూడా బాబా, గురూజీల ఆశీర్వచనాలు అందాలని, అందరి తరపున బాబాకు గురుదేవులకు సాష్టాంగ నమస్కారములు  తెలియజేసుకుంటున్నాను.

మీ గురుబంధువు.
పి. రజనీకర్
నెల్లూరు

సంపాదకీయం: సద్గురులీల (జూలై – 2008)
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles