Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయి నాథ్ మహారాజ్ కి జై !! సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకీ జై !!
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir101-పిలిస్తే పలుకుతాను 3:29
బాబా గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు తెలుపుతూ వారిచ్చిన అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను.
నా పేరు మద్దుల వరలక్ష్మి. మాది తెనాలి.
“పిలిస్తే పలుకుతాను. నీవు ఎక్కడ ఉన్నా తలచిన వెంటనే నీ చెంత ఉంటాను” అనే వాగ్దానాన్ని బాబా మాకు అనుభవం ద్వారా ప్రసాదించారు.
మేము రోజు బాబాకు పూజ చేస్తూ ఆరతి ఇస్తుంటాము. ఏమి తిన్నా తినేముందు బాబాకు నైవేద్యం పెట్టి మేము తీసుకుంటాము.
మా వారు రోజూ బాబాకు అన్నం నైవేద్యముగా పెట్టి ఆరతి ఇస్తుంటారు.
రోజూ బాబాకు పాలతో అభిషేకం చేసి అన్నం నైవేద్యము పెట్టి ఆరతి ఇచ్చిన తరువాత అయన భోజనం చేస్తారు.
అలాగే ఒక రొజు సాయిబాబా పూజ అయిన తర్వాత అయన భోజనం చేస్తూ మంచి నీళ్ళు త్రాగుతుంటే రెండు, మూడు నిముషముల వరకు నీళ్ళు మింగలేక పోయి, బైటకి వెళ్ళి ఉమ్మివేస్తామని వెళ్తే నీళ్ళు ఉమ్మలేకపోయారు.
అలాగే గుండె పట్టుకొని ఇంట్లోకి వచ్చి కుర్చీలో కూర్చుని గుండె సవరించుకుంటున్నారు.
నేను అయన బాధపడటం చూడగానే వెంటనే ఏడుస్తూ
” సాయి బాబా సాయి బాబా” అంటూ ఒక్క అంగతో బాబా దగ్గరకు వెళ్ళి పాదాలుపట్టుకుని బాబా ఉదిని తెచ్చి అయన గొంతుకు రాయగానే మింగుడు పడింది,
నేను ఏడుస్తూ ఉంటే అయన ఇలా అన్నారు. లక్ష్మీ “నీవు, నేను ఇంత బాధపడ్తుంటే నా దగ్గరకు రాకుండా బాబా దగ్గరకు వెళ్ళావేంటి” అని అన్నారు. ”
నేను మిమ్మల్ని కాపాడలేను, బాబా వారు కాపాడుతారని బాబా దగ్గరకు వెళ్ళాను” అని అన్నాను. నీవు బాబా అని బాబా దగ్గరకు వెళ్ళగానే నాకు మింగుడు పడింది అని మా వారు అన్నారు.
మాకు చాలా అనందం వేసింది. అలా ఎన్నో అనుభవాలను ఇస్తూ మమ్ము అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతూ నేనెప్పుడూ నీవెంటే వుంటాను.అని నిదర్శనాలు ఇస్తూ “నేనుండగా మీకు భయమేల?” అన్న వాగ్దానానికి అచరణాత్మకంగా తెలియ చేస్తూ ” పిలిస్తే పలుకుతాను… తలిస్తే దర్శనమిస్తాను” అని మాకు తెలియచేశారు.
నా భక్తుడు ఎంత దురాన ఉన్నాసరే ఆర్తితో పిలిచిన పరుగున పోయి కాపాడెదను అనే వాగ్దానాన్ని బాబా నిరూపించారు.
ఇలా బాబా గురుదేవులు మాకిచ్చిన అనుభవాల ద్వారా నేను గ్రహించినదేమిటంతే ఏ కష్టం వచ్చినా సరే గాబరాపడకుండా వారి మీద ఆధారపడి ఉంటే మనకు నిజంగా ఏదికావాలో అది తప్పనిసరిగా అందిస్తారు.
నా అనుభవాల ద్వారా నేను నేర్చుకున్నాను.
నా అనుభవాలను సాటి గురు బంధువులతో, స్నేహితులతో పంచుకునే మహా భాగ్యాన్ని కలిగించిన బాబా, గురుదేవులకు ఇవే నా సాష్టాంగ నమస్కారములు. ఇలాంటివి ఇంకా ఇన్నో అనుభవాలు మీతో పంచుకోవాలని ఆకాంక్షిస్తూ ..
మీ గురుబంధువు
వరలక్ష్మి,
తెనాలి.
సంపాదకీయం: సద్గురులీల (జూన్ – 2008)
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు “నీవు ఎక్కడికైనా వెళ్ళు.నేను నీ వెంటే ఉంటాను”అని అన్నారు.
- తలచిన వెంటనే స్వయం గా వచ్చి తన భక్తురాలి జ్వరాన్ని తొలగించిన బాబా గారు.
- ఎక్కడ విన్నా సాయి నామమే,ఎక్కడ చూసిన సాయి రూపమే.
- ఎంత ఆశ్చర్యము. నేను నీ వెంటనే వున్నాను.నీశ్చితంగా ఉండు–Audio
- సాయి అమ్మ.. సాయి నాన్న.. సాయే అన్ని ఈ జీవితానికి, ఇంతకు మించి ఏమి కావాలి
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments