Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్
మహరాజ్ కీ జై.
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-103-నాకు నోటమాట రాలేదు 6:33
అదొక అద్బుత రూపం. ఆ రూపాన్ని చూసేకొద్ది అలోకిక అనందం. జీవితం సార్దకమవడానికి ఇంతకంటే ఏం కావాలి?
కళ్ళుముసినా, తెరచినా, ఏపనిలో నిమగ్నమైనా, ఎవరితో మాట్లాడుతున్న, నాకు సాయి రూపం కనబడుతూ వుంటుంది. ఆ పేరును నా మనసు ఉచ్చరిస్తూ ఉంటుంది.
భక్తి నిండిన కళ్ళతో, ప్రేమతో పరవశించే హృదయంతో, అనందం తొణికిసలాడే పెదవులతో ‘సాయీ’ అని పిలవగానే ‘ఓయీ’ అని పలికే వారిని తలచని వారెవ్వరు?
నా జీవితంలో ఆయనను కోలుస్తున్నప్పటి నుంచి ఎన్నో అనుభవాలు,నమ్మలేని నిదర్శనాలు జరిగాయి.
అప్పటికి నేనింకా ప్రభుత్వ ఉపాద్యాయినికాదు. ఓ పేరున్న ఇంగ్లీష్ మీడియం పాఠాశాలలో ఉపాద్యాయినిగా పనిచేస్తున్నాను.
1992వ సంవత్సరంలో నాకు ఏంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫీస్ నుండి టీచర్స్ రిక్రూట్ మెంట్ వ్రాతపరీక్షకు(ప్రభుత్వ పాఠాశాల టీచర్లకు) హాల్ టికెట్ 15 రోజుల ముందుగ వచ్చింది.
అప్పటికి నాకు 30 సంవత్సరములు. నా భర్త బ్యాంక్ జాబు మానేసి ఖాళీగా ఉన్నారు. నా పిల్లల బాద్యత, ఇల్లుగడవడం అత్తమామలను చూసుకోవడం అంతా నా మీదనే ఆధారపడి వున్నది పాఠాశాల నుండి వచ్చాక సాయంత్రం కోచింగ్ క్లాసులకు వెళ్లి అక్కడ పదవతరగతి విద్యార్దులకు క్లాసులు తిసుకోనేదాన్ని.
ఇలా రోజు క్షణం తీరిక లేకుండా ఉండేదాన్ని ,
అదీకాక అప్పుడే ఇంట్లోనే కోచింగ్ సెంటర్ పెట్టుకోవాలనే ఉద్దేశంతో రెండు గదులను రిపేర్ చేయిస్తున్నాను.
ఆ టైంలో వచ్చిన హాల్ టికెట్ ను అలమారలో అది సిమెంట్ బస్తాల వెనకాల ఉన్న అరలో పడేశాను.
తర్వాత ఆ విషయమే మర్చిపోయాను. రేపు పరీక్ష అనగా నాతోపాటే పనిచేసే టీచర్ ఒకరు “ఏం మేడం పరీక్షకు బాగా ప్రిపేర్ అవుతున్నారా? రేపే కదా పరీక్ష, సెంటర్ ఎక్కడ? అని అడిగారు.
అంతే నాకు షాక్ కొట్టినట్లయింది. “అరెరే! ఆ విషయమే మర్చిపోయాను సార్! పొద్దున లేస్తే ఉరుకుల, పరుగుల జీవితం అయిపోయింది.
నాకు రేపు పరీక్ష అన్న విషయమే గుర్తులేదు. అయినా అసలు ప్రిపరేషన్ లేనిది ఏం రాస్తానులెండి!” అని నిరాశగా ఆ సార్ తో అన్నాను.
“అబ్బే ! అట్లా అనకండి. ఏదో ఒకటి రాసిరండి. మీరు జనరల్ గా బాగానే రాయగలరు.
తర్వాత మీ అదృష్టం. మీకు నాదగ్గర ప్రిపేర్ అయ్యే బుక్సులో కొన్ని తెచ్చిస్తాను. రాత్రంతా చదవండి” అంటూ ఆ సార్ చెప్పారు.
సాయంత్రం ఇంటికి వెళ్ళాక హాల్ టికెట్ కోసం వెదకడం మొదలు పెట్టాను.
చివరికి సిమెంట్ బస్తాల వేసుక అలమారాలో దుమ్ము కొట్టుకొనిపోయి ఉన్న కవర్ దొరికింది.
ఇక ఆ రాత్రంతా మా టీచర్ గారు ఇచ్చిన పుస్తకాలు వీలైనంతవరకు తీరగేశాను. కాని బాగా రాస్తానని నమ్మకం లేదు.
మా యిల్లు గాంధీనగర్ లో ఉన్న సాయిబాబా మందిరం దగ్గరే. నాలుగడుగులు వేస్తె గుడి.మరుసటిరోజు పరీక్షకు వెళ్తూ గుడిలోనికి వెళ్ళి నా హాల్ టికెట్ ను బాబావారి పాదాల వద్ద పెట్టి ఇవ్వమని పుజారిగారిని అడగగానే, అయన పూజ చేసి మరి ఇచ్చారు.
అప్పటి వరకు నాకు బాబావారి మీద ఏ అభిప్రాయం లేదు.
మా ఇంటికి చాలా దగ్గరగా ఉన్న ఆ గుడికి కనీసం వారానికి ఒకరోజు కూడా వెళ్ళెదాన్నికాదు.
ఆ హాల్ టికెట్ తీసుకోని బాబావారికి నమస్కారం చేసి కళ్ళుతెరవగానే అయన నా వైపు చాల ప్రేమగా చూస్తున్నట్లు అనిపించింది. అదంతా నా భ్రమ అనుకున్నాను.
సరే, అక్కడ్నించి డి. కె.డబ్ల్యు . కాలేజికి వెళ్లి పరీక్ష రాసివచ్చాను. రెండు నెలల తర్వాత పరీక్షలో పాస్ అయినట్లు, ఇంటర్వ్యుకి రమ్మంటూ కాల్ లెటర్ వచ్చింది.
కలెక్టర్ ఆఫీసులో ఇంటర్వ్యు, ఇంటర్వ్యు బాగానే చేశాను. డెమో లెసన్ కూడా ఇచ్చాను.మరుసటిరోజు పొద్దున 10 గంటలకు మా మారిది కలెక్టర్ ఆఫీసుకు వెళ్ళి నోటిస్ బోర్డులో చూసి వచ్చాడు.
గేటు దగ్గర్నుంచే ‘వదినా ! యు అర్ సేలేక్టేడ్’ అంటు అరుస్తూ వచ్చేసరికి నాకు నోటమాట రాలేదు.
నా ఆనందానికి అవధులు లేవు.
ఏ శ్రమ పడకుండా కేవలం బాబాగారి దయవల్లనే వచ్చిన ఈ ఉద్యోగం నాకు ఒక వరం.
నా జీవితాన్ని, నా కుటుంబాన్ని ఎంతో ఆదుకున్న సాయిబాబాను ఎట్లా మరువగాలను. పిచ్చుక కాళ్ళకు దారం కట్టి లాగినట్లు ఆయన నన్ను తన వైపులాక్కున్నారు.
అంతే ! ఆ రోజు నుండి నాకు ఏ కష్టం వచ్చినా ఆనందం కలిగినా సాయిబాబానే తలచుకుంటాను.
ఇక నాకు జీవితంలో తిరుగేలేనట్లు అన్ని విజయాలే. ఒక ప్రముఖ రచయిత్రిగా పెరుతెచ్చుకున్నాను.
పిల్లలు పెద్దవాళ్ళయి బాగా సెటిల్ అయ్యారు. స్వంత యిల్లు కట్టుకున్నాము. బాబా జీవిత చరిత్ర వీలున్నప్పుడల్లా సప్తాహం చేస్తూ ఉంటాను.
ఇంకొక విచిత్రమైన అనుభవం ఏమిటంటే నేను బాబా చరిత్ర నిత్యపారాయణం చేయడం మొదలుపెట్టగానే ఆ వారంలో ఏదో ఒకరోజు కాషాయ వస్తాలు ధరించిన సన్యాసి ఒకరు గంట వాయిస్తూ జోలేపట్టుకొని భిక్షం కోసం మా యింటి ముందుకు వచ్చేవారు.
నా దగ్గర ఉన్నది, నా శక్తి కొలది ఇచ్చి పంపేదాన్ని. ఆ ఒక్క రోజు తప్ప ఆటను మరలా కనబడేవాడు కాదు.
ఇదెంతో ఆశ్చర్యము కదా! బాబానే వచ్చి నన్ను ఆశిర్వదిస్తున్నట్లుగా, బాబానే వెన్నంటి వుండి, ప్రోత్సహిస్తున్నట్లుగా నా కనిపించింది.
ఇవన్ని రాస్తుపోతే ఎన్నో అనుభవాలు,అయన ఆశీస్సులు లేనిదే ఏ పనిచేయను, చేయలేను. ఇప్పుడు నా చేత ఇలా రాయించింది కూడా వారే. ఇలాంటి అనుభవాల్ని మరిన్ని పొందాలని ఆరాటపడుతూ ముగిస్తున్నాను.
సాయి భక్త రేణువు
పాతూరి అన్నపూర్ణ
నెల్లూరు.
సంపాదకీయం: సద్గురులీల (జూలై 2008)
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- చేజారిన హాల్ టిక్కెట్ – చెంతకు చేర్చిన స్వామి
- బాబా, గురువు గారు తలుచుకుంటే ఏదైనా చేయగలరు
- అడుగడుగనా ఆటంకం – ఆదుకున్న బాబా
- సమయమునకు రైలు టికెట్ ఇచ్చిన బాబా–Audio
- ఆ TE కూడా తన వైపు చూస్తూ నవ్వి ఆ ముస్లిం ఫకీరు ఖాళీ చేసిన సీట్ లో కూర్చోమన్నారు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “యు అర్ సేలేక్టేడ్’ అంటు అరుస్తూ వచ్చేసరికి నాకు నోటమాట రాలేదు—Audio”
Baskar palle
May 14, 2016 at 2:48 pmGreat madam..baba mikichina leelalu chaduvutunte chala happyga anipinchindi..thanks for share