Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
భక్తుడు: సింగపూర్ శ్రీనివాస్
నివాసం: శిరిడీ
చెన్నైలో ఉద్యోగం చేస్తున్న రోజులలో జరిగిన సంఘటన ఇది. అప్పుడు గురువుగారి ఆరాధనకు వెళదాం అనుకున్నాను. కానీ టికెట్ రిజర్వేషన్ చేయించలేదు.
చెన్నై నుండి శిరిడీ లాంగ్ డిస్టెన్స్ కదా! రిజర్వేషన్ లేకుంటే కష్టం అవుతుందేమో, టికెట్ దొరికితే వెళ్దాం లేకుంటే లేదు అనుకుని ఎగ్మోర్ స్టేషన్ కి వెళ్ళాను. చాలా మంది రిజర్వేషన్ కొరకు నిలుచున్నారు.
టికెట్ దొరకడం కష్టం అనుకున్నాను. ట్రైన్ లోకి ఎక్కాక TCని ఏదో విదంగా మేనేజ్ చేద్దాంలే అనుకున్నాను.
కానీ అప్పటికే అక్కడ ఉన్న అంత మందిని చూసి, నేను అలా మనీ ఇచ్చి TC ని మేనేజ్ చేస్తే, అంత వరకు టికెట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దులే అనుకుని తిరిగి వెళుతున్నాను.
బయట TC నిలుచొని ఉంటే టికెట్స్ ఏమైనా దొరికే ఛాన్స్ ఉన్నాయా? అంటే లేవు అన్నారు.
నేను రిటన్ అవుతున్నాను. అంతలో TC పక్కన నిలుచున్న ఒకతను పరిగెత్తుకుంటూ వచ్చి మీకు టికెట్ కావాలా? నా దగ్గర ఉంది అని అన్నాడు.
నాకు తెలిసి కొంత మంది ఇలా టైన్ కదులుతున్న లాస్ట్ మూమెంట్ లో వచ్చి ఎదో టికెట్ చేతిలో పెట్టి డబ్బులు తీసుకునిపోతారు. అది కరెక్ట్ టికెట్ కాకుంటే కష్టం అనుకుని వద్దు అని చెప్పాను.
కానీ అతను అది నిజమైన టికెట్ అని చెప్పి TC తోకూడా కన్ఫర్మ్ చేయించి ఇచ్చాడు.
అతను టికెట్ డబ్బులు ఎంతో అంతే తీసుకున్నాడు కానీ ఎక్కువగా ఒక్క పైసా కూడా తీసుకోలేదు.
ఆ ట్రైన్ ఎక్కడెక్కడి నుండో వచ్చి చాలా స్టేషన్స్ లో ఆగుతుంది, కానీ టికెట్ కరెక్ట్ గా నేను ఎక్కవలసిన స్టేషన్ నుండే శిరిడీకి, అది కూడా నా వయసు ఉన్న అబ్బాయి టిక్కెట్ కావడం, అన్ని సరిపోయే విదంగా టికెట్ ఉండడం ఆశ్చర్యం వేసింది.
బాబా, గురువు గారు తలుచుకుంటే ఏదైనా చేయగలరు అనిపించింది.
~~~~సర్వం సాయినాధార్పణమస్తు~~~~
***సాయి సూక్తి:
“నా దేహాన్ని చీల్చి నీకు బిడ్డను ప్రసాదించాను”
Latest Miracles:
- ఆ TE కూడా తన వైపు చూస్తూ నవ్వి ఆ ముస్లిం ఫకీరు ఖాళీ చేసిన సీట్ లో కూర్చోమన్నారు.
- సమయమునకు రైలు టికెట్ ఇచ్చిన బాబా–Audio
- షిరిడీలో బాబాకి మేము పంపిన దక్షిణ ముట్టిన వెంటనే, గురువు గారు(రామ్ రతన్ జీ బాబా గారు) వచ్చి మా ఇంటిలో జ్యోతి వెలిగించుట.
- ప్రేమగా పెడితే నేను ఏదైనా తింటానని తినకపోవడం అంటూ ఉండదని నాకు సందేశమిచ్చారు–Audio
- వయసు నిర్ధారణ (ఏజ్ ప్రూఫ్)–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments