తలచిన వెంటనే స్వయం గా వచ్చి తన భక్తురాలి జ్వరాన్ని తొలగించిన బాబా గారు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


భరత్ రావు గారి అనుభవములు మూడవ భాగం.

నా భార్యకి 2002 సం ఆఖరిలో జ్వరం ఉదయం 100 డిగ్రీలు, మధ్యాహ్నం 102 డిగ్రీలు, సాయంత్రం 104 డిగ్రీలు ఉండేది, చలి కూడా ఉంటూండేది.

ఏవో మందులు వాడుతున్నా ఫలితం ఉండేది కాదు. ఏవో టెస్టులు కూడా చేసారు. అయినా ఆ జ్వరం ఎందుకు వస్తుందో తెలియలేదు.

అలా ఆ జ్వరం 27 రోజుల కొనసాగిన తరువాత ఒక రోజు స్కానింగ్ చేసారు.

ఆ స్కానింగ్ లో లివర్ దగ్గర ఇన్ ఫెక్షన్ అయ్యి చాలా వరకూ పాడయిందని డాక్టర్స్ వాళ్లలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు.

మా ఆవిడని వార్డులోకి మార్చారు. ఆపరేషన్ చేసి ఆ పార్ట్ తీసివేయాలని అన్నారు. ఆపరేషన్ చేసారు.

ఆపరేషన్ చేసే ముందు మా ఆవిడకి బాగా షివరింగ్ వచ్చింది. రోజూ జ్వరం అన్నం తినలేకపోవడం, వాంతులు అవుతుండటం వలన నీరసంగా ఉండేది.

ఆ స్థితిని తట్టుకోలేక తన ప్రాణం పోయినా బాగుండునని చాలా సార్లు అనుకుంది.

మా అబ్బాయి వాళ్ళ అమ్మకి దుప్పట్లు తీసుకువచ్చి ఒకదాని పైన ఒకటిగా తెచ్చి కప్పాడు, బాబాని తలచుకుని కళ్ళు మూసుకుని పడుకుని ఉందామె.

ఈలోపు ఆమె చేతుల మీద పెద్ద చేతులు ఆవిడ చెవులు, తలా కప్పేశాయట.

మా అబ్బాయి అప్పుడే దుప్పటి కప్పాడు కదూ ! ఇంకా వాడు అక్కడే వున్నాడనుకుని – “ఒరేయ్ ఇంత గట్టిగా పట్టుకున్నావేరా” అంటోంది.

మావాడు “అమ్మా! ఏమిటి కలవరిస్తున్నావు” అంటున్నాడు. తనకు ఒంట్లో వేడి జరా జరా పాకిపోతున్నట్లుగా అనుభవం అయిందట.

ఒళ్ళు వేడెక్కిపోతుందట, ఈలోగా డాక్టర్ నర్సుని ఇంజక్షన్ కోసం పంపాడు.

నర్స్ ఇంజక్షన్ లోడ్ చేసుకుని వచ్చే లోగా మా ఆవిడకి చెమటలు పోస్తున్నాయి. అందరూ చాల ఆశ్చర్య పోయారు.

ఏ మందు వేసుకున్నావు. ఇంతలోనే అంత షివరింగ్ ఎలా తగ్గిపోయింది అంటూ అడిగారు. ఏమందు వేసుకోలేదు అని నేను, మా ఆవిడా చెప్పాము.

ఇంటికి వచ్చిన నాలుగు రోజుల తర్వాత మాకొక విషయం తెలిసింది. నేను ఎప్పుడైతే బాబాని నమ్మటం మొదలుపెట్టి గుడికి వెళుతూ  పారాయణ చేస్తున్నానో, అప్పటినుండి నా భార్య పిల్లలకి కూడా బాబా పై బాగా గురి కుదిరింది.

తరచూ మా ఇళ్ల దగ్గర వాళ్లమంతా కలసి, ఒక చోట బాబా పూజలు భజనలు, సత్సంగాలు, చేసుకోవటం అలవాటయ్యింది.

మా ఆవిడకిలా బాగోకపోవడంతో సత్సంగాలకి వెళ్ళలేదు. మా ఆవిడకి మరీ బాగుండక హాస్పిటల్ లో చేర్పించడం ఆపరేషన్ చేయాల్సి రావటం అక్కడి సత్సంగ సభ్యులకి బాధ కలిగి వాళ్ళు కూడా బాబాని ప్రార్దించారట.

ఆ సమయంలోనే మా ఆవిడకి షివరింగ్ రావడం పెద్ద చేతులు వచ్చి తన మొహాన్ని కప్పటం, చలి తగ్గడం, జరిగిందని తెలిసి ఆశ్చర్యం ఆనందం పొందటం మా వంతు అయ్యింది.

The above miracle has been typed by: Shiva Kumar Bandaru

భరత్ రావు గారి అనుభవములు నాల్గవ భాగం తరువాయి…..

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles