Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్
మహరాజ్ కీ జై.
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-139-నానాసాహెబ్ చందోర్కర్-4 5:44
మసీదుకు మరమ్మత్తులు చేయించి, దానిని పునర్నిర్మించే బాధ్యతను బాబా నానాకు మాత్రమే యిచ్చారు.
ఆ ఉత్తమమైన కార్యానికి నానాకు బాబానించి అనుమతి లభించింది.
నానా ఒక ప్రభుత్వ ఆఫీసరుగా తీరిక లేకుండా ఉండటంచేత ఆకార్యభారాన్ని నానాసాహెబ్ నిమోంకర్ కు అప్పచెప్పాడు. కాకాదీక్షిత్ మసీదుని రాళ్ళతో పరిచే పనిని ఒక్క రాత్రిలో పూర్తి చేయగలిగాడు.
సాయి చావడిలో నిద్రించిన రాత్రి మశిద్ నెల బాగు చేసి ఎత్తైన పీఠం అమర్చారు.
నాటినుండి గోనెపై కూర్చోడం మాని దానిపై కుర్చోనారంభించారు. మసీదు పునర్నిర్మాణం 1912 లో పూర్తయింది ఆసమయలో బాబా నీంగావ్ లో ఉన్నారు.
పునర్నిర్మించిన మసీదులోకి బాబాని రాచమర్యాదలతో, మేళతాళాలతో వైభవంగా తీసుకొనివచ్చారు.
1906-1908 మధ్యకాలంలో నానా పండరీపురంలో ఉన్నాడు. అంతకు ముందు నందుర్ బార్ లో ఉన్నాడు. నానాసాహెబ్ పండరీపురంలో ఉన్నపుడు ఆయన రెండవ కుమార్తె ద్వారకామాయికి 1906వ.సంవత్సరంలో సుఖప్రసవమయింది.
నానా షిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకొంటూ ఉండేవాడు. ఒకసారి నానా తన నాలుగు సంవత్సరాల వయసుగల కుమారుడు మహదేవ్ అనే బాపూరావు చందోర్కర్ తొ బాబాను దర్శించుకొన్నాడు.
ఆ పిల్లవాడు స్వతంత్రంగా బాబా శిరసు మీద పుష్పాలనుంచి పూజించాడు. ఇది 1900 సంవత్సరంలో జరిగింది.
నాలుగు సంవత్సరాల వయసులో బాబానుదుటిమీద చందనం కూడా రాయడం మొదలు పెట్టాడు. ఆతరువాతనుంచి యిదే సాంప్రదాయంగా మారింది.
బాపూరావుకి మాత్రమే బాబాను పూజించడానికి అనుమతినివ్వబడింది.
ఒకసారి నానాసాహెబ్ కి వీపుమీద పెద్ద వ్రణం లేచి, వ్రణం ఏర్పడ్డ ప్రదేశంలో విపరీతంగా బాధ పెట్టసాగింది.
ఆ బాధతో నానాకి చాలా అసౌకర్యంగాను, యిబ్బందిగాను ఉండేది.
ఎంతోమంది వైద్యులవద్ద వైద్యం చేయించుకున్న ఎటువంటి గుణం కనపడలేదు.
ఆఖరికి బొంబాయి వెళ్ళి ఆపరేషన్ చేయించుకోమని వైద్యులు సలహా యిచ్చారు.
అది చాలా చిన్న విషయం కాబట్టి ప్రతీ చిన్న విషయానికి బాబాకు చెప్పి ఆయనను యిబ్బంది పెట్టడమెందుకని, తన బాధ ఏదోతనే పడదామనే ఉద్దేశ్యంతో బాబాకు తన బాధను చెప్పలేదు.
ఆపరేషన్ చేయవలసిన రోజు నిర్ణయించడం జరిగింది. ఆరోజున నానాసాహెబ్ ఆస్పత్రికి వెళ్ళాడు.
ఆస్పత్రిలో మంచం మీద పడుకొన్నాడు. గడ్డ వల్ల విపరీతమయిన నొప్పితో బాధపడసాగాడు.
బాధ భరింపలేనంతగా ఉంది.
అప్పటికీ ఈ అగ్నిపరీక్షనుండి బయట పడవేయమని బాబాని వేడుకోలేదు.
అయినప్పటికీ తన తలగడ వద్ద బాబా ఫొటో పెట్టుకొని, కొద్ది సేపట్లో వచ్చే సర్జన్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతలో అనుకోని సంఘటన ఒకటి జరిగింది.
నానాసాహెబ్ తన మొహాన్ని దిండు మీద పెట్టుకొని సర్జన్ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ బోర్లా పడుకొన్నాడు.
ఆసమయంలో గది పైకప్పునుండి ఒక పెంకు ముక్క జారి సరిగా ఆయన వీపుమీద లేచిన వ్రణం మీద పడింది. అలా పడటంతోనే వ్రణం పగిలి చీము, నెత్తురు మెల్లగా బయటకు కారసాగింది .
దాంతో నొప్పి కూడా తగ్గడం ప్రారంభమయింది.
తరువాత సర్జన్ వచ్చి ఆ అధ్బుత సంఘటనను చూసి ఆశ్చర్యపోయాడు.
ఆపరేషన్ అవసరం లేకుండ వ్రణం పగిలి నానాసాహెబ్ కి బాధ లేకుండ పోయింది.
సర్జన్ యిక ఆపరేషన్ అవసరం లేదని చెప్పాడు. చిన్న విషయమయినా సరే, ప్రార్ధించకపోయిన బాబా తన అంకిత భక్తులకోసం వెంటనే వచ్చి కాపాడతారన్నదానికి యిదే ఒక ఉదాహరణ.
కొద్దిరోజుల తరువాత నానాసాహెబ్ షిరిడీ వెళ్ళారు.
అప్పుడు బాబా “ఎవరైనా, నన్ను యిబ్బంది పెట్టడమెందుకని భావించినా, ఆఖరికి నేనే స్వయంగా నాచేతులతో పుండును చిదిమివేస్తాను” అన్నారు.
1913-1914 లో నానా సాహెబ్ చందోర్కర్ అనారోగ్యం వల్ల దీర్ఘకాలిక శలవు పెట్టాడు. భార్యతో సహా షిరిడీలోనే ఉండి బాబా సేవ చేసుకోసాగాడు.
నానాసాహెబ్ బాబా గురించి, బాబా యిచ్చిన సందేశాలను , బాబా మీద భక్తిని పెంపొందించుకున్నందువల్ల కలిగే ప్రయోజనాలు వీటన్నిటి గురించి ప్రజలలో ప్రచారం చేశాడు.
ముఖ్యంగా పూనా, బొంబాయి వంటి పట్టణాలలో ప్రచారం చేసిన ఫలితంగా కులమత భేదాలు లేకుండా దేశవ్యాప్తంగా ప్రజలందరూ బాబా దర్శనానికి షిరిడీకి రావడం ప్రారంభించారు.
భక్తులందరికీ బాబావారి మహిమలు అనుభవమయ్యాయి. అలా అనుభవాలను పొందిన భక్తులందరూ తమకు బాబాని పరిచయం చేనందుకు నానా సాహెబ్ కి ధన్యవాదాలు తెలుపుకొన్నారు.
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- మనది ఎన్నో జన్మల సంబంధం-నానాసాహెబ్ చందోర్కర్-1–Audio
- అంత తొందరపడనవసరం లేదు. హాయిగా భోజనాలయ్యాక బయలుదేరవచ్చు–నానాసాహెబ్ చందోర్కర్-2–Audio
- నారాయణ్ గోపినాద్ దిఘే
- నానా చనిపోబోతున్నాడు, నేను రక్షిస్తున్నాను” అన్నారు–నానాసాహెబ్ చందోర్కర్-3–Audio
- నానా, 18 సం. లు నా దగ్గరుండి గ్రహించినది ఇదేనా?–నానాసాహెబ్ చందోర్కర్–5–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments