మనది ఎన్నో జన్మల సంబంధం-నానాసాహెబ్ చందోర్కర్-1–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.

This Audio Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-134-నానాసాహెబ్ చందోర్కర్ 6:37

(బాబాను పూర్తిగా అవగాహన చేసుకొని, ప్రగాఢమయిన భక్తితో ఆయన గురించి అందరికీ తెలియచేసిన మొట్టమొదటి వ్యక్తి) 

బాబా తమ భక్తులను తామే రప్పించుకుంటామని చెప్పారు.

బాబా కబురు చేసి మరీ పిలిపించుకొనిన భక్తుడు నానా సాహెబ్ చందోర్కర్.

నానాసాహెబ్ పూర్తి పేరు నారాయణ్ గోవింద్ చందోర్కర్.  బాబా ఆయనను నానా అని పిలుస్తూ ఉండేవారు.  ఆయన బొంబాయిలోని కళ్యాణ్ నివాసి.  

జనవరి 14, 1860 వ.సంవత్సరంలో మకర సంక్రాంతి నాడు జన్మించారు. ఎంతో శాస్త్ర పాండిత్యము, శిష్టాచారము,

అతిథి సేవ కలిగిన పుణ్య కుటుంబంలో జన్మించడం వల్ల నానాసాహెబ్ చందోర్కర్ కూడా శాస్త్రాలు,

శంకరాచార్యుల భాష్యంతో భగవద్గీత చదువుకున్నాడు. 20 సంవత్సరాల వయసులో బీ.ఎ.తత్వ శాస్త్రంలో పట్టభద్రుడయ్యారు,

డిగ్రీ అయిన తరువాత 1880 లో ప్రభుత్వ ఉద్యోగంలో ప్రవేశించి, ఏడు సంవత్సరాలలోనే డిప్యూటీ కలెక్టర్ అయ్యారు.

మొట్టమొదట ఆయన చిట్నీస్, తరువాత మామల్తదారు, ఆతరువాత డిప్యూటీ కలెక్టర్ అయ్యారు.

ఆయన తండ్రిగారు గోవింద పంత్. నానా చందోర్కర్ తన తండ్రి డిప్యూటీకలెక్టర్ గా పనిచేసిన కార్యాలయంలోనే ఆయన కూడా డిప్యూటీ కలెక్టర్ గా పని చేశారు.

ఆయన బాగా విద్యనభ్యసించారు.  సంస్కృతం లో మంచి ప్రావీణ్యం ఉంది.  విస్తృతంగా పర్యటనలు చేశారు.  1878లో ఆయన జమీదార్ నానా సాహెబ్ ఓఝా కుమార్తె బాయజాబాయిని వివాహమాడారు.

ఆయనకు యిద్దరు కుమార్తెలు, మైనతాయి, ద్వారకామాయి, యిద్దరు కొడుకులు వాసుదేవ్ అనే బాబూరావు, మహదేవ్ అనే బాపురావు.  అతడు కోపర్గాంలో ప్రజలకు వైద్యవసతి కల్పించడానికి ఒక ఆస్పత్రి కట్టించాడు.

బహుశ 1887 సంవత్సరంలో బాబా షిరిడీ వాస్తవ్యుడయిన కులకర్ణి ద్వారా, నానా సాహెబ్ ని షిరిడీని రమ్మనమని వర్తమానం పంపించారు.

కోపర్గాం మమల్తాదారుకు కార్యదర్శిగా పనిచేస్తున్న రోజులలో నానాసాహెబ్ చందోర్కర్ను శిరిడీ గ్రామ కరణమైన అప్పాకులకర్ణి కలిసి, బాబా గురించి తెల్పి, ఆయన అతనిని శిరిడీ రమ్మనమని కబురు పంపారని చెప్పాడు.

కానీ నానా చందోర్కర్ అతని మాట నమ్మలేదు. శిరిడీ రాలేదు. బాబా కులకర్ణితో మళ్ళీ మళ్ళీ కబురు చేశారు. అంతటితో అతడి మాట నమ్మి నానాసాహెబ్ మొట్టమొదటిసారిగా 1892లో షిరిడీ సందర్శించారు.

బాబా అతనితో, “మనది ఎన్నో జన్మల సంబంధం. తరచుగా శిరిడీ వస్తు ఉండు. ఈ విషయం చెప్పడానికే నిన్ను పిలిపించాను “ అన్నారు.

ఏ కష్టమొచ్చినా బాబా దగ్గరకు రావడం మొదలుపెట్టాడు నానా.

క్రమంగా బాబా గొప్పతనం నానాకు అర్ధమైంది. అతడు తరచుగా శిరిడీ దర్శించుకోసాగాడు.

అక్కడ బాబా చేసే అద్భుతాలని, ఆయన శక్తులని చూసి ముగ్ధుడయారు.

బాబా చేసే అద్భుతాలన్నీ కూడా ప్రత్యేకించి కాకుండా వాడుకగా చేసేవని గ్రహించారు.

కాని వాటినెవరూ అప్పట్లో రాసి ఉంచలేదు.  అందుచేతనే ఆయన భక్తులందరికీ యింకా షిరిడీలోని ముఖ్యమయిన వారికి డైరీలు పంచిపెట్టి బాబా  ఎప్పుడు ఏ చమత్కారాలు చేసినా,  బాబాకు సంబంధించి ముఖ్యమయిన సంఘటనలు ఏవి జరిగినా వాటినన్నిటినీ డైరీలో రాయమని చెప్పారు.

ఆరోజునుండి భక్తులు/స్థానికంగా ఉండే ముఖ్యమయినవారు అందరూ బాబా చేసే లీలలను వ్రాయడం ప్రారంభించారు.

కాని, అంతకు ముందు జరిగిన ఎన్నో లీలలు, చమత్కారాలు, ఏవో కొన్ని మరచిపోలేని ముఖ్యమయిన అద్భుతాలు తప్ప ఏవీ కూడా వ్రాయబడి ఉండలేదు.

నానా చందోర్కర్ కెంతో మంది ముస్లిం స్నేహితులు ఉన్నారు.

ఒకసారి ఆయన తండ్రిగారికి ఒక ముస్లిం వ్యక్తితో భేదాభిప్రాయం కలగడంతో, యిక ఏముస్లిం తోను ఎటువంటి స్నేహబాంధవ్యాలు పెట్టుకోవద్దని తన యింటిలోని వారందరికీ చెప్పారు.

నానాసాహెబ్ చందోర్కర్ కి యిది ఒక సమస్య అయింది.  నానాసాహెబ్ తండ్రిగారి గురువు శ్రీసమర్ధ సఖారాం.  ఆయన బ్రాహ్మణుడు.  నానా చాలా భయపడ్డారు.

ఎందుకంటే బాబా ముస్లిమ్ అని తన తండ్రి తలచి, బాబా దర్శనానికి వెళ్ళకుండా తనను నిర్బందిస్తారేమో అని.

నానా సాహెబ్ తన తండ్రితో తన గురువు శ్రీసాయిబాబా అనీ, ఆయన స్వయంగా ఆత్మ సాక్షాత్కారం పొందిన మహాపుణ్య పురుషుడని, ముస్లిం అని చెప్పారు.

ఆయన షిరిడీలో ఉంటారనీ తాను ఆయన దర్శనానికి తరచూ వెళ్ళి వస్తూ ఉంటానని చెప్పారు.

ఆయన తండ్రి, “సాయిబాబా నీగురువు కాబట్టి నువ్వు ఆయన దర్శనానికి వెడుతూఉండు” అని ప్రశాంతంగా జవాబిచ్చారు.  బాబా ఆయన తండ్రి మనసుని చాలా చమత్కారంగా మార్చేశారు.  

నానాసాహెబ్ తానెక్కడికి వెళ్ళినా ఎల్లప్పుడు తన వెంట గుండ్రటి భరిణె, బాబా స్వయంగా యిచ్చిన ఊదీ, చిన్న ఫొటో కూడా తీసుకొని వెడుతూండేవారు.

తరువాత ఈ భరిణ, ఫొటో పూనాలో ఉన్న ఆయన మనవడు ప్రభాకర్ వద్ద ఉన్నాయి. నానాసాహెబ్ ఎప్పుడు షిరిడీకి వెళ్ళినా చాలా ఉదారంగా డబ్బు ఖర్చు పెట్టేవారు.

తన వద్దకు వచ్చే భక్తులకు పంచడానికి బాబా చేసిన అప్పులను కూడా కొన్నిసార్లు తీరుస్తూ ఉండేవారు.

ఇంకా భక్తులు తాము కోరుకొన్న వస్తువులను  బాబా కొని వారికి పంచుతూ  ఉండేవారు. వాటికి కూడా డబ్బు చెల్లించేవారు.

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles