నానాసాహెబ్‌ అన్నది నా ముద్దుపేరు. ఆ పేరుతో నా తల్లిదండ్రులొక్కరే నన్ను పిలుస్తారు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!

ముందు భాగం కోసం ఇక్కడ  క్లిక్ చేయండి

 

(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)

 

కులకర్ణి, షిరిడి గ్రామకరణం. జమాబందీ కోసం జిల్లా కేంద్రం కోపర్గాం వెళ్ళాలి. తను ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చినా బాబా అనుమతి తీసుకోవడం కులకర్ణికి అలవాటు.

ఉద్యోగరీత్యా పైగ్రామం వెళ్ళేందుకు కూడా బాబా అనుమతి కావాలా? చోద్యం కాకపోతే అని నవ్వారు చాలా మంది. నవ్వితే నవ్వారు. బాబా అనుమతి తీసుకోవాల్సిందే అనుకున్నాడు కులకర్ణి.

ద్వారకామాయికి చేరుకున్నాడు. కులకర్ణిని చూస్తూనే నవ్వుతూ ఇలా అడిగారు బాబా.‘‘కోపర్గాంకి ప్రయాణం ఎప్పుడు?’’‘‘మీరు ఎప్పుడు అనుమతిస్తే అప్పుడు.’’ అన్నాడు కులకర్ణి. చేతులు జోడించాడు.

‘‘వెళ్ళిరా, కోపర్గాం వెళ్తున్నావు కాబట్టి, ఓ చిన్న సాయం చెయ్యి.’’‘‘చెప్పండి బాబా’’‘‘అక్కడ నానాసాహెబ్‌ ఉంటాడు, నేను రమ్మన్నానని చెప్పు.’’‘‘తప్పకుండా’’ అన్నాడు కులకర్ణి.

కోపర్గాంకు ప్రయాణమయ్యాడు. చేరుకున్నాడక్కడికి. చేరుకున్న దగ్గర్నుంచీ బాబా పిలుపు సంగతి నానాసాహెబ్‌కి చెప్పేందుకు అతని కోసం వెదకసాగాడు. నానాసాహెబ్‌ ఎక్కడా కనిపించలేదు.

అసలు ఆ పేరున్న వారే లేరని అన్నారంతా. తప్పు తనదే! నానాసాహెబ్‌ ఎవరో ఏమిటో వివరాలు బాబాని అడిగి తెలుసుకోవాల్సింది. ప్రయాణ హడావుడిలో అడగలేదు తను. ఇప్పుడేం చెయ్యాలి? తలపట్టుకున్నాడు కులకర్ణి.

అతనలా డీలాపడడాన్ని నారాయణ గోవింద్‌ చందోర్కర్‌ గమనించాడు. చందోర్కర్‌ కలెక్టర్‌కి సెక్రటరీగా ఉంటున్నాడు.

ఇటీవలే ప్రమోషన్‌ మీద కోపర్గాంకు చేరుకున్నాడు. జమాబందీకి వచ్చిన దగ్గర్నుంచీ ‘నానాసాహెబ్‌! నానాసాహెబ్‌’ అంటూ వాకబు చేస్తున్న కులకర్ణిని ఓ కంట కనిపెట్టే ఉన్నాడతను.‘‘కులకర్ణిగారు’’ పిలిచాడు చందోర్కర్‌.

‘‘అయ్యా’’ లేచి నిల్చున్నాడు కులకర్ణి.‘‘మీతో మాట్లాడాలి. ఓసారి నా రూంకి రండి.’’‘‘తప్పకుండా.’’ చందోర్కర్‌ వెంట నడిచాడు కులకర్ణి.

‘‘కూర్చోండి.’’ కుర్చీ చూపించాడు చందోర్కర్‌. కూర్చున్నాడు కులకర్ణి.‘‘మీరు పదే పదే కలవరిస్తున్న ‘నానాసాహెబ్‌’ని నేనే! నా కోసం మీరెందుకు వాకబు చేస్తున్నారు?’’ అడిగాడు చందోర్కర్‌.

వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టుగా అనిపించింది కులకర్ణికి. ఆనందించాడతను.

‘‘మా తల్లిదండ్రులకు చాలా కాలం వరకు సంతానం లేదు. పిల్లల కోసం వారు తిరగని పుణ్యక్షేత్రం కాని, తీర్థం కాని లేదు. ఆ సమయంలో ఓ ఫకీరు తారసిల్లాట్ట! ఆయన అనుగ్రహంతో నేను పుట్టానంటారు.

ఆయన జ్ఞాపకార్థం నన్ను మా తల్లిదండ్రులు ‘నానాసాహెబ్‌’ అని ముద్దుగా పిలుస్తున్నారు.

నానాసాహెబ్‌ అన్నది నా ముద్దుపేరు. ఆ పేరుతో నా తల్లిదండ్రులొక్కరే నన్ను పిలుస్తారు. ఇన్నాళ్ళకి మీరు కనిపించారు. ఏం కావాలి మీకు? నా గురించి ఎందుకు వాకబు చేస్తున్నారు?’’ అడిగాడు చందోర్కర్‌.

తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No’s  : శ్రీనివాస మూర్తి 9704379333,   సాయి సురేష్ 8096343992

 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles