Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్
మహరాజ్ కీ జై.
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-142-2811-నానా 18 సం లు నా దగ్గరుండి 6:42
ఒకరోజు సాయి పోళీలు కావాలంటే నానా చందోర్కర్ స్వయంగా వండి వాటిని నివేదించారు.
సాయి వాటిని తాకనైన తాకకుండా కూర్చున్నారు.
వాటిమీద ఈగలు, చీమలు చేరాయి. అప్పుడు సాయి నానాతో “నేను అరగించాను. నీవు తీసుకో!” అన్నారు.
నానా ఎంతో నిరుత్సాహపడి, అలిగి అన్నం గూడా తినకుండా చావట్లో పడుకున్నారు. సాయి అతనిని పిలిపించి, “నానా, 18 సం. లు నా దగ్గరుండి గ్రహించినది ఇదేనా?
ఆ చీమలు, ఈగల రూపంలో నేనే ఆరగించాను. నీవు ప్రసాదం తీసుకో!” అన్నారు.
‘వాటి రూపాలలోనూ మీరే అరగించారని నాకు ఋజువేమిటి?’ అన్నారు నానా. బాబా వెంటనే ఒక భంగిమ చేసారు. తనకు తప్ప మరెవ్వరికి తెలియని తన జీవిత రహస్యం బాబాకు తెలుసునని అతడు గ్రహించారు.
తన హృదయంలోలాగే అన్ని జీవులలోను బాబాయే ఉన్నారని నానాకు అర్ధమై ప్రసాదం తీసుకున్నారు.
నానా చందోర్కర్ శాస్త్రాలలో చెప్పబడిన ‘వైశ్వదేవకర్మ’ ను ఆచరించేవారు. అనగా భోజన వేళకు ఎవరైనా ఒక అతిధికి భోజనం పెట్టడం.
కానీ ప్రతిరోజూ ఒక అతిధి దొరకడము కష్టంగా ఉండేది. దానితో అతను ఇంతటి కటినమైన పద్దతిని శాస్త్రాలు ఎందుకు చెప్పాయి అనుకునేవారు.
ఒకసారి ఈ విషయమే బాబా తో ప్రస్తావించగా సాయి “నానా, శాస్త్రాల్లో పొరపాటేమీ లేదు. వాటిని నీవే సరిగా అర్ధం చేసుకోలేదు. అతిధి అంటే మానవుడే కాదు.
భోజన సమయానికి వచ్చిన ఏ ప్రాణియైన అతిధే. క్రిమికీటకాదుల నుండి మానవుల వరకు నిజంగా లభించిన అతిధులను నువ్వు గుర్తించడం లేదు.
కాకబలికి బయట సమృద్ధిగా అన్నం విడిచిరా. ఏ ప్రాణిని పిలువవద్దు, తరమవద్దు. ఏ ప్రాణి వచ్చిందన్నది పట్టించుకోవద్దు.
అలా చేస్తే లక్షలాది అతిధులను ఆదరించినట్లే” అని అపుర్వమైన భోధ చేసారు.
బాబా గురించి ఆయన మహిమలను వ్యాప్తిలోనికి తెచ్చినవాళ్ళలో నానాసాహెబ్ మొదటివాడు.
ఆయన తరువాతే దాసగణు, దీక్షిత్, బీ.వీ.దేవ్, నానాసాహెబ్ వల్లే దీక్షిత్, ధబోల్కర్, దాసగణు, రాధాకృష్ణమాయి, మోరేశ్వర్ ప్రధాన్, తాత్యా సాహెబ్ నూల్కర్, బాలాసాహెబ్ దేవ్, మాధవరావ్ అడ్కర్ లాంటి ఎంతో మంది భక్తులు షిరిడీకి రావడం తటస్థించింది.
శిరిడీ వచ్చినప్పుడల్లా సాయి నానా చందోర్కర్ వద్ద నుండి అనేక సార్లు దక్షిణ అడుగుతుండడంతో చందోర్కర్ ఒక ఉపాయం ఆలోచించాడు.
కోపర్ గావ్ లో తన మిత్రుని వద్ద సగం డబ్బు వుంచి మిగితా డబ్బుతో శిరిడీ రావడం ప్రారంభించాడు.
పైగా సాటి సాయి భక్తులతో ‘సాయి కోరినప్పుడల్లా దక్షిణ ఇవ్వడం మన కర్తవ్యం. అందుకే డబ్బు అయిపోకుండా ఈ ఏర్పాటు చేసానని’ గొప్పలు చెప్పడం ప్రారంభించాడు. భక్తులందరూ నానా తెలివితేటలకు ప్రశంసించారు.
ఒకసారి శ్రీ సాయి అతనిని పిలిపించి మూడు దఫాలుగా అతని వద్ద నున్న డబ్బంతటినీ దక్షిణ కింద తీసేసుకున్నారు. చందోర్కర్ కోపర్ గావ్ కు మనిషిని పంపించే లోపలే అతనిని పిలిచి మళ్ళీ దక్షిణ అడిగారు సాయి. డబ్బు లేకపోవడంతో చందోర్కర్ చిన్న బుచ్చుకున్నాడు.
అప్పుడు సాయి చిరునవ్వుతో అతనికి హితబోధ చేసారు’ నేను కోరేది నీ వద్ద నున్న ధనం కాదు! అరిషడ్వర్గాలను విడిచి సర్వశ్య సరణాగతి ఒనరించితే నీ సర్వ బాధ్యతలు నావే! నీ భక్తి ఇంకా నిశ్చలం కాలేదు.
ముందు నీ అహంభావాలను యుక్తిని తొలగించుకో. తెలివి తేటలు, ఉపాయాల కంటే గురువు పై భక్తి ముఖ్యం.
సిరి సంపదలు ధర్మాన్ని సాధించడం కోసమే వున్నాయి. కేవలం ఐహికపరమైన సుఖాల కోసం వాటిని వెచ్చిస్తే అవి వ్యర్ధమే . దానం అనే సత్కార్యం ద్వారా అమితమైన పుణ్యాన్ని సముపార్జించుకుంటారు.
అవి ఉన్నతమైన ముందు జన్మలకు బాట వేస్తాయి. ఈ సిరి సంపదలన్నీ భగవంతుడిచ్చినవే! వాటిని తిరిగి ఆ భగవంతునికి సమర్పించుకోవడం వలన భక్తి, జ్ఞానాలు వృద్ధి పొందుతాయి.
అతి విలువైన ఈ మానవ జన్మకు సార్ధకత చేకూరుతోంది. సాయి చేసిన ఈ అద్భుతమైన, అసామాన్యమైన బోధ వలన చందోర్కర్ కే కాక అక్కడున్న భక్తుల హృదయాలలోని అజ్ఞానంధకారాలన్ని పటా పంచలు అయ్యాయి.
జ్ఞాన బోధ గావించిన శ్రీ సాయికి కృతజ్ఞతలు అర్పించుకొని తిరిగి వారి ఇళ్ళకు వెళ్ళారు.
ఆయన కృషి వల్ల దాదాపు 2000 మంది యాత్రికులు బొంబాయినుండి బాబాదర్శనం కోసం షిరిడీ వచ్చారు. మహారాష్ట్రలో బాబా గురించి ప్రచారం చేసి ప్రజాదరణ చేసిన మొదటి భక్తుడు ఆయన.
షిరిడీ దర్శించే భక్తుల కోసం నానాసాహెబ్ ఒక భోజనశాలను ప్రారంభించాడు. దీని నిర్వహణ బాధ్యతను తన మేనల్లుడయిన బాలభావ్ చందోర్కర్ కి అప్పగించాడు.
1911 సంవత్సరంలో భక్తులకోసం ప్రారంభింపబడ్డ మొట్టమొదటి హోటల్ బహుశా యిదే.
ఆయన పెద్ద కుమారుడు బాబూసాహెబ్ చందోర్కర్ వివాహం 1912లో గ్వాలియర్ లో జరిగింది. రెండవకుమారుడయిన బాపూరావు చందోర్కర్ వివాహం 1921 లో నానా మరణించిన తరువాత 1922 లో జరిగింది.
నానాసాహెబ్ 61సం.వయసులో ఆగస్టు, 21, 1921 సం.ఏకాదశిరోజున కళ్యాణ్ లో ప్రశాంతంగా కన్నుమూసాడు.
మహాభక్తుడయిన నానాసాహెబ్ చందోర్కర్ ధన్యుడు.
సర్వం శ్రీ శిరిడీ సాయి పాదారవిందార్పణ మస్తు.
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- నానా చనిపోబోతున్నాడు, నేను రక్షిస్తున్నాను” అన్నారు–నానాసాహెబ్ చందోర్కర్-3–Audio
- మనది ఎన్నో జన్మల సంబంధం-నానాసాహెబ్ చందోర్కర్-1–Audio
- “బాబా” అని గట్టిగా కేకేశాడు ‘నానా’. అంతే! రెండు అదృశ్య హస్తాలు అక్కడ ప్రత్యక్షమయ్యాయి.
- బాబా తన అంకిత భక్తులకోసం వెంటనే వచ్చి కాపాడతారన్నదానికి యిదే ఒక ఉదాహరణ–నానాసాహెబ్ చందోర్కర్-4–Audio
- నానాసాహెబ్ అన్నది నా ముద్దుపేరు. ఆ పేరుతో నా తల్లిదండ్రులొక్కరే నన్ను పిలుస్తారు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments