Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)
కులకర్ణికి నోట మాట లేదు. ఆశ్చర్యంగా వింటున్నాడతను.‘‘చెప్పండి, మిమ్మల్నే, ఎందుకు వాకబు చేస్తున్నారు?’’ మళ్ళీ అడిగాడు చందోర్కర్.‘‘బాబా మిమ్మల్ని రమ్మంటున్నారయ్యా.’’ చెప్పాడు కులకర్ణి.
‘‘బాబా ఎవరు?’’‘‘సాయిబాబా! షిరిడిబాబా’’‘‘ఆయన ఎవరో నాకు తెలీదు. నేను ఆ పేరే ఇంత వరకు వినలేదు. అయినా నేనెందుకు అక్కడికి రావాలి? రాను. మీరు వెళ్ళి రండి.’’ అన్నాడు చందోర్కర్.‘‘సెలవయ్యా’’ చేతులు జోడించాడు కులకర్ణి.
లేచొచ్చేశాడు అక్కణ్ణుంచి.కొద్ది రోజులు గడిచాయి.నానాసాహెబ్‌ని మళ్ళీ కలిశాడు కులకర్ణి.
‘‘బాబా రమ్మంటున్నారయ్యా’’ చెప్పాడు.‘‘ఎందుకు రావాలి? రానని చెప్పు’’ పాతపాటే పాడాడు నానా.ఇంకొద్ది రోజులు గడిచాయి.
నానాని మళ్ళీ కలిశాడు కులకర్ణి. బాబా రమ్మంటున్నారని చెప్పాడు. కులకర్ణి మీద అంతెత్తున లేచాడు నానా. అతనిపై కోపగించుకున్నాడు.‘‘రాను రాను రాను, చెప్పతనికి.’’ అన్నాడు నానా.
మొహం ఇంత చేసుకుని కులకర్ణి వచ్చేశాడక్కణ్ణుంచి.ఈ బాబా ఎవరు? తనని ఎందుకు పదే పదే పిలుస్తున్నాడు? వెళ్ళి సంగతేమిటో తెలుసుకోవాలనుకున్నాడు నానా ఒకరోజు. షిరిడికి ప్రయాణమయ్యాడు. టాంగాలో బయల్దేరాడు.
రోడ్డంతా గతుకులు, గుంటలు. టాంగా ఎగిరెగిరి పడుతోంది.‘‘జాగ్రత్త జాగ్రత్త’’ హెచ్చరిస్తున్నాడు నానా. ఎంత జాగ్రత్త పడినా ప్రమాదం తప్పింది కాదు.
గుంతలో పడి, బండి చక్రం ఒక్కసారిగా పైకి లేవడంతో విరిగిపోయిందది. దాంతో టాంగా పల్టీ కొట్టింది. నానా జారి పడసాగాడు.
ఆ భయంలో అప్రయత్నంగా ‘బాబా’ అని గట్టిగా కేకేశాడతను. అంతే! రెండు అదృశ్య హస్తాలు అక్కడ ప్రత్యక్షమయ్యాయి. భూమిలోంచి మొలుచుకుని వచ్చాయి. జారిపడకుండా నానాని అడ్డుకున్నాయి.
ఆ చేతులేగాని అడ్డుకోకుంటే నానా కిందనున్న లోయలో పడి ప్రాణాలు కోల్పోవాల్సిందే!శరీరానికీ, బట్టలకీ అంటుకున్న దుమ్ముని దులుపుకుంటూ తనని కాపాడింది ఎవరు? ఆ అదృశ్య హస్తాలు ఎవరివి? ఆలోచించసాగాడు నానా.
‘‘అయ్యా! బయల్దేరిన వేళ బాగాలేదేమో, ఎందుకొచ్చిన ప్రయాణం? వెనక్కి కోపర్గాం వెళ్ళిపోదామా?’’ అడిగాడు టాంగావాలా.‘‘వద్దు, షిరిడికే వెళ్దాం.’’ అన్నాడు నానా స్థిరంగా.
‘‘నువ్వు ఆ బండి చక్రం బాగు చేయించుకుని షిరిడికి రా, నేను నడిచి వెళ్తాను.’’ అన్నాడు మళ్ళీ నానా. బయల్దేరాడు అక్కణ్ణుంచి. ఒంటరిగా ప్రయాణించసాగాడు.
ప్రయాణిస్తూ పదే పదే భూమిలోంచి మొలుచుకుని వచ్చి, తనని కాపాడిన అదృశ్యహస్తాల గురించే ఆలోచించసాగాడు. అలా ఆలోచిస్తూ దారి తప్పాడతను. ఏదో కొండ మీదికి చేరుకున్నాడు.
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ‘‘బాపూగిర్ అని బాబా ఒక్కరే నన్ను పిలిచేది. ఇంకెవరూ నన్నలా పిలవరు.
- నానాసాహెబ్ అన్నది నా ముద్దుపేరు. ఆ పేరుతో నా తల్లిదండ్రులొక్కరే నన్ను పిలుస్తారు.
- ‘‘సద్గురువు కటాక్షం లభించిన వారికి కష్టాలు ఉండవు. బాబా మన సద్గురువు.’’
- సాయి ‘పిచ్చుక’ నానా …..సాయి@366 ఆగస్టు 21….Audio
- బిడ్డను రక్షించేందుకు ధుని లో నా చేతులు ఉంచి బిడ్డ ప్రాణాలు కాపాడాను.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on ““బాబా” అని గట్టిగా కేకేశాడు ‘నానా’. అంతే! రెండు అదృశ్య హస్తాలు అక్కడ ప్రత్యక్షమయ్యాయి.”
prathibha sainathuni
January 31, 2017 at 6:58 amsaibaba saibaba saibaba..