నా భార్యకు ప్రాణబిక్ష పెట్టిన బాబా



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

 ఒక సాయి భక్తుడు చెప్పిన బాబా చెసిన అద్భుతమైన, ఊహకందని లీల

బాబా మీద నమ్మకం, వెనువెంటనే మనకి సంతోషాన్ని, శాంతిని, స్థిరత్వాన్ని, శాంత స్వభావాన్ని, ప్రేమని తెస్తుంది. అందుచేత మీకు నమ్మకం లేకపోతే, నేను మీకిచ్చే సలహా యేమిటంటే ముందర నమ్మకం కోసం ప్రార్థించండి. యెందుకంటే మీరు సాయి ఉనికిని దర్శించాలనుకుంటే మీకు ఉండవలసినది నమ్మకం…నమ్మకం….నమ్మకం..బాబా మీద నమ్మకం. ప్రతీరోజూ బాబా, యెవరికైతే నమ్మకం ఉంటుందో వారికి తన లీలలు చూపుతున్నారు.

బాబా తను ప్రేమించే బిడ్డలని యెవరికీ యెటువంటి ఆపద రాకుండా క్షేమాన్ని చేకూరుస్తారు. అశాస్వతమైన ప్రపంచంలో మీకు మీ ప్రియమైనవారికి యేదైనా జరిగవచ్చు, అటువంటప్పుడు మనని రక్షించే మన ప్రియతమ తండ్రి సాయి మాత్రమే.

నేను ఈ రోజు ప్రచురించేది మీకు సాయి మీద నమ్మకాన్ని మరింత పెంచుతుంది.  భక్తుల యొక్క నిజమైన అనుభవలు, వారి అనుభూతులు శ్రథ్థ, నమ్మకం దారిలో వెళ్ళడానికి కదలే మెట్ల దారిలా ఉపయోగపడుతుంది.

అమెరికానించి ఒక భక్తుని అనుభవం. ఆయన కోరిన మీదట వారి పేరును ప్రస్తావించటంలేదు.

ఆయన చెప్పిన ఈ అనుభవాన్ని చదవండి. ఈ లీల చదివాక మీకు కూడా ఒడలు గగుర్పొడుస్తుంది, యెందుకంటే మొదటిసారి చదవగానే నేను కూడా అటువంటి అనుభూతికి లోనయ్యాను.

మేము అమెరికాలో ఉంటాము. నేను తెలుగు సైట్ లో సాయి లీలలు చదువుతున్నాను. సాయి లీలలతో నేను చాలా ప్రభావితుడనయ్యాను. నేను కూడా నా జీవితంలో యెన్నో బాబా అనుభూతులను చవి చూశాను. అందులో ఒకటి ఈ క్రింద చెప్పిన లీలని మీతో పంచుకుంటున్నాను.

నాకు 2002 సంవత్సరంలో వివాహం అయింది. వివాహం అయిన తరువాత మేము, నా భార్య తల్లితండ్రుల యింటికి, కోస్తా ఆంధ్రకి ప్రయాణిస్తున్నాము. నేను అంతకుముందు రెండుసార్లు బస్ లో వెళ్ళాను, కాని యెప్పుడు రైలులో అక్కడకు వెళ్ళలేదు. మేము హైదరాబాదు నించి రాత్రి 9 గంటలకు బయలుదేరాము.

నేను ఒక ప్రయాణీకుణ్ణి మేము దిగవలసిన స్టేషన్ కి (నా భార్య తల్లితండ్రులు ఉండే ఊరు ) యెన్ని గంటలకు వెడుతుందని అడిగాను. అతను మరునాడు ఉదయం 7 గంటల ప్రాంతంలో వెడుతుందని చెప్పాడు.

ఆ రాత్రి ప్రయాణంలొ, నేను నా స్నేహితుడు ఒంటిగంట దాకా కబుర్లు చెప్పుకుంటూ తరువాత నిద్ర పోయాము. ఉదయం 4.30 ప్రాంతంలో నా స్నేహితుడు నన్ను నిద్రలేపి బూట్లు వేసుకుని దిగమన్నాడు, మన ఊరు వచ్చేసింది అని చెప్పాడు. నేను, ఒకతను 7 గంటలకు వస్తుందని చెప్పాడు అన్నాను. నా స్నేహితుడు, అతను తప్పు చెప్పాడు, మన వూరు వచ్చేసింది అని అన్నాడు.

నేను బెర్త్ మీంచి కిందకి దిగి బూట్లు లేసులు కట్టుకుంటూ, నా భార్య యేది అని అడిగాను. ఆమె సామాన్లు సద్దుతోంది అని చెప్పాడు. ఈ లోపులో రైలు వేగంగా వెళ్ళడం మొదలు పెట్టింది. నేను నా భార్య బెర్త్ వైపు చూస్తే అక్కడామె లేదు. నేను నా స్నేహితుడితో చెప్పి యిద్దరం తలుపు దగ్గిరకి వెళ్ళాము. అక్కడ తలుపు దగ్గిర చూసి చాలా షాక్ కి గురయ్యాము. నా భార్య తలుపు హాండిల్ ని పట్టుకుంది, రైలు చాలా వేగంగా వెడుతోంది.

నా స్నేహితుడు ఆమెని పట్టుకోవడానికి ప్రయత్నించేటప్పటికి, ఆమె హాండిల్ ని వదలివేసింది. నేను, నా స్నేహితుదు అదిరిపోయాము. నా స్నేహితుడు బోగీలో చైన్ లాగమని చెప్పాడు. నేను చైన్ లాగాను. రైలు ఆగి పోయింది. మేము రైలు నించి కిందకి దిగేటప్పటికి ప్లాట్ ఫారం మీద చాలా మంది గుమిగూడారు, యేదొ జరిగిందని అనుకున్నాను నేను.

నేను నా స్నేహితుడు ఆ గుంపు వద్దకు పరిగెత్తుకుని వెళ్ళాము. నా భార్య ఒక ముసలామె ఒడిలో ఉండటం చూశాము. ఆ ముసలావిడ నా భార్యకి మంచినీళ్ళు పట్టిస్తోంది. కొంత సేపటి తరువాత యెం జరిగిందని నా భార్యను అడిగాను.

ఆమె, తను నిద్ర మత్తులో రైలు దిగుతూండగా, రైలు కదిలిందని అప్పుడు తలుపు హాండిల్ పట్టుకున్నానని, రైలు కదలుతున్న వేగానికి పట్టుకోలేక వదలివేశానని చెప్పింది. హాండిల్ ని వదలి వేసిన వెంటనె ఆ వేగానికి తను రైలు చక్రాల వైపు విసురుగా వెళ్ళింది, అప్పుడే అద్భుతమైన విచిత్రం జరిగింది.

ఒక ముసలి వ్యక్తి (మన బాబా) ఆమె కాళ్ళని పట్టుకుని వెనుకకు లాగాడు. యిప్పుడు ఆశ్చర్యకరమైన విషయం, అటువంటి చిన్న పల్లెటూరి స్టేషన్ లో ఆ ముసలి వ్యక్తి యెలా వచ్చాడు, వచ్చి వెంట్రుకవాసిలో ఆమెని యెలా లాగగలిగాడు? అది చాలా అద్భుతం. ఆ సంఘటన తరువాత నా భార్య బాబా భక్తురాలిగా మారిపోయింది. మాకింకా బాబా అనుభూతులు చాలా ఉన్నాయి.

మానవ మాత్రుడికి సాథ్యమేనా ఆవిథంగా రక్షించడం? పైగా అది ఉదయం 4.30, కొంచెం చీకటిగా ఉంటుంది. ఒకవేళ వెలుతురున్నా మానవ మాత్రుడికి ఆ సమయంలో యేమి చేయాలో కూడా తొందరగా స్ఫురణకు రాదు. వేగంగా వెడుతున్న రైలు నుంచి పడబోతున్న వ్యక్తిని కాళ్ళు పట్టుకుని లాగడమంటే, అలా చేయడం యెవరికి సాథ్యం?

మన బాబాకి కాదూ? అవును బాబా బాబా బాబా. సర్వకాల సర్వావస్తలలోనూ నేనప్రమత్తుడనై ఉంటానని చెప్పారు. బాబా సర్వ శక్తిమంతుడు. బాబా తన భక్తులనెప్పుడు సదా రక్షిస్తూనే ఉంటారు. కాని మనకి కావలసినది ఆయన మీద నమ్మకం, శ్రథ్థ, భక్తి.

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “నా భార్యకు ప్రాణబిక్ష పెట్టిన బాబా

సాయినాథుని ప్రణతి

ఈ లీల చదివేక చాలా ఆనందంగా వుంది.నాకు కూడ బాబా మంచి అనుభుతిని ప్రసాదించారు .బాబా ఎలపుడు తన బిడ్డలమైన మనకోసం అప్రమతంగా వుంటారు అనిపిస్తుంది. నేను నా అనారోగ్య పరిస్తితిలో బాదపడుతుంటే నేనునాను అనే బరోసాను ఆనందాని ప్రసాదించారు .మా గురువుగారు మావారికి కలలో దర్శనం ఇచ్చి నను ఆనందింప చేసారు.

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles