నా బిడ్డకి ప్రాణభిక్ష పెట్టిన బాబా-1



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


 సాయి బాబా      …      సాయి బాబా      …      సాయి బాబా      …       సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో  వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.

నా బిడ్డకి ప్రాణభిక్ష పెట్టిన బాబా ….

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయిబంధువు అన్నపూర్ణ గారి అనుభవం ఆమె మాటల్లో…

నా చిన్నతనం నుండి బాబా అంటే నాకు చాలా ఇష్టం,నమ్మకం.బాబా నాకు ఇచ్చిన అనుభవం మరువలేనిది.సదా సాయికి కృతజ్ఞురాలిని.

  నేను ఇంటర్మీడియట్ చదివేటపుడు నాకు వివాహం జరిగింది.1995 లో నాకు బాబు పుట్టాడు.

పుట్టిన మరుసటి రోజు నుండి బాబు కి నోటి నుండి బ్లడ్ రావటం మొదలయ్యింది.

డాక్టర్స్అన్ని పరీక్షలు చేసిన కూడా ఇలా ఎందుకు అవుతుందో వాళ్లకు అర్ధం కాలేదు.బాబు ఇక బతకటం కష్టం అని చెప్పారు.నేను చాలా బాధపడ్డాను.

కానీ బాబా నా బాబు ని కాపాడతారు అనే ధైర్యము నాకు ఉంది.బాబా ని

 “నా బిడ్డని బ్రతికించమని తనకి నీ పేరు పెట్టుకుంటా సాయి అని ఆర్తిగా ప్రార్ధించాను”.అప్పటికి డాక్టర్స్ మందులు వాడుతూ వాళ్ళ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.ఆశ్చర్యంగా రెండు రోజులలో బాబు కోలుకున్నాడు.బ్లడ్ రావటం తగ్గిపోయింది.

వారం రోజులలో పూర్తిగా ఆరోగ్యం గా ఉన్నాడు ఇంక ఇబ్బంది లేదు అని డాక్టర్స్ ఇంటికి పంపారు.బాబా కి కృతఙ్ఞతలు తెలిపాను,అప్పటి నా ఆనందం మాటల్లో చెప్పలేను.

కానీ బాబుకి సాయిబాబా పేరు పెడదాము అనుకున్న విషయం పెద్దవాళ్లకు  చెప్పాలంటే నాకు భయం వేసింది.

ఎందుకంటే మా అత్తగారి ఇంట్లో ఎవరికీ బాబా గురించి తెలియదు.వెంకటేశ్వర స్వామి భక్తులు.పైగా నేను చాలా చిన్నదానిని.చెప్తే  ఏమంటారో అన్న సంశయం మొదలయ్యింది.

బారసాల చేసే ఉదయం దాక కూడా నేను అడగలేదు.”కానీ నా మనసులో బాబాని అడుగుతూ, ప్రార్ధించాను.పెద్దవాళ్ళు బాబుకి మురళికృష్ణ అని నిర్ణయం చేసారు.

నేను నా మనసులో విషయం చెప్పబోతుండగా మా అమ్మమ్మ సాయి అని పేరు కూడా కలిసి వచ్చేట్టు పెట్టండి అని చెప్పింది”.

ఆశ్చర్యముగా మా అత్తగారి ఇంట్లో వాళ్ళు కూడా ఒక్క మాట కూడా అనలేదు.అందరు ఒప్పుకున్నారు.బాబుకి “వెంకట సాయి మురళికృష్ణ” అనే పేరు పెట్టాము.బాబా చేసిన ఈ లీల అద్భుతం.నాకు చాల సంతోషం వేసింది.

ఇప్పుడు బాబు బీటెక్ చేసి మంచి ఉద్యోగం లో స్థిరపడ్డాడు.ఇదంతా బాబా కృప మాత్రమే.బాబా ని శరణాగతి చేస్తే మన సమస్త భారాలు సాయి వహిస్తారు.

సాయి బాబా      …      సాయి బాబా      …      సాయి బాబా      …       సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో  వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

One comment on “నా బిడ్డకి ప్రాణభిక్ష పెట్టిన బాబా-1

Sreenivas

సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles