Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
బాబా పెట్టిన ప్రాణభిక్ష
ఈనెల 17/2/2017 రోజున హైదరాబాదు కు చెందిన రమ్యశ్రీ గారిని బాబా గారు ఒక పెద్ద ప్రమాదం నుండి రక్షించారు. ఈ అనుభవాన్నిమన saileelas.com ద్వారా సాయి బంధువులందరితో పంచుకొనేందుకు అవకాశం ఇచ్చారు. అందుకు వారికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సదా వారికీ బాబా అనుగ్రహం ఉండాలని బాబా వారిని కోరుకుంటున్నాను. ఇక వారి అనుభవాన్ని వారి మాటలలోనే చదవండి.
సాయి బంధువులందరికీ సాయిరాం.
తేది.17/2/2017న నేను, నా తమ్ముడు రోజూ లాగే కాలేజ్ కి టూ వీలర్ మీద బయలుదేరి వెళ్ళాం. మా కాలేజ్ కి నేషనల్ హైవే మీద వెళ్ళాలి. అందులో మా కాలేజీకి వెళ్ళేటప్పుడు ఒక బ్రిడ్జి దాటాలి. అదెలాంటి పాయింట్ అంటే అక్కడి నుంచి దారి చాలా ఏటవాలు గా ఔతుంది. ఆ పాయింట్ ఎంత భయంకరమైనదీ అంటే ఒక్కమాటలో చెప్పాలంటే పక్కా డెడ్ స్పాట్. మా సీనియర్స్ ఎంత మంది బలయ్యారో.
అలాంటి దగ్గర ఒక కుక్క ఎలా వచ్చిందంటే దానికి ఈ బండికి నువ్వు ఎదురెళ్ళాలి అని ఎవరో చెప్పి పంపినట్టు(బహుశా కర్మేనేమో) వచ్చి బండికి ఎదురొచ్చి గుద్దుకుంది. నేనిలా ఎందుకన్నానంటే అసలా కుక్క కి మా బండికీ మధ్య చాలా దూరం ఉంది. అది పక్కకి వెళ్ళాల్సిన అవకాశాలు 99% ఉన్నాయి. కానది అలా వెళ్ళేలేదు. నువ్వలాగే ఆ బండికి చివరి నిముషంలో అడ్డంగా వెళ్ళాలని ఎవరో ఆదేశించిట్టు అడ్డంగా వచ్చి గుద్దుకుంది.
అంతే నాకంతవరకే గుర్తుంది. మా బండి కింద పడింది. నేను బండి మీద నుంచి కింద పడ్డాను. నా కళ్ళద్దాలు ఎక్కడో పడిపోయాయి. ఫ్రేం ముక్కుకు తగిలి గాయం అయింది. మోచేయి రక్తం వస్తోంది. రోడ్డు మీద వెళ్తున్న అంకుల్స్, స్టూడెంట్స్ వచ్చి భయపడకు భయపడకు అంటూ నాకుధైర్యం చెబుతున్నారు. వాళ్ళ ఖర్చిఫ్ లతో నాకు కట్టుకడుతూంటే ఇదంతా మెల్లగా అర్థం అవుతోందినాకు. నాడ్రెస్ చినిగితే నా స్కార్ఫ్ తీసి చుట్టేసింది ఒక స్టుడెంట్. ఇది నా పరిస్థితి.
ఐతే మా తమ్ముడు డ్రైవింగ్ చేస్తున్నాడు.అక్కడ స్లోప్ ఉండడంతో వాడి ప్రమేయం లేకుండానే బండి వాడిని ఈడ్చుకెళ్ళింది. హెల్మెట్ ఉండటంతో తలకు ఏమీ కాలేదు. కానీ రెండు మోచేతులు, అరచేయీ, మోకాలు, వేళ్ళూవిపరీతంగా డామేజ్ రక్తం వస్తూఉన్నాయి.కాలు బెణికింది. (వీటన్నింటికీ కారణమైన కుక్క కి మాత్రం ఏమీ కాలేదు. మా తమ్ముడు దీని గురించి మాత్రం సంతోషించాడు. తన వల్ల ఒక ప్రాణికి హాని జరగనందుకు.అందునా వాడికి కుక్కలంటే ఇష్టం).
ఐతే ఏంటీ హైదరాబాద్ లో ఈ ఆక్సిడెంట్లు కామన్. ఈ గాయాలు కామన్ అని మీరనుకోవచ్చు. కానీ మా పరిస్థితి, సంఘటన జరిగిన తీరు చూసి గుమిగూడిన జనాలందరూ చెప్పిన అభిప్రాయం & మా అభిప్రాయం ఏంటంటే మా వెనక లారీ గానీ బస్సుగానీ ఉంటే బహుశా ఈరోజు మాకు చివరేమో. మేమిలా ప్రాణాలతో ఉండేవాళ్ళమో, లేదో! బాబాకే తెలియాలి. కానీ ఈరోజు మా అదృష్టం.
ఆ టైమ్ కి రోజూ చాలా హెవీ వెహికిల్స్ & హెవీ రష్ ఉంటుంది. రోజు వెళ్ళేదీ అదే దారి, అదే టైం. ఇది బాబా అనుగ్రహం. మాకేదో పెద్ద ప్రాణగండాన్ని ఇలా చిన్నగా తీసేసారు. మా పరిస్థితి చూసి ఆంబులెన్స్ పిలుస్తానని అన్నారు అందరూ. కానీ ఎలా వచ్చిందో మాకాధైర్యం వద్దని చెప్పి తమ్ముడు నేనూ ఇంటికి వచ్చాం. హాస్పిటల్లో డాక్టర్ ఆ యాక్సిడెంట్ ఎక్కడ అయ్యిందో ఆ స్పాట్ చెప్పగానే అమ్మో ఆ ప్లేస్ లోనా! ఇంకానయం బ్రిడ్జ్ తలకు తలగలేదనీ సంతోషించారు.అంతటి భయంకరమైన స్పాట్ అది.
పదిహేను రోజుల క్రితం మా కళ్ళారా చూసాం కారు తుక్కుతుక్కు గా ఐతే క్రేన్ తో తరలించటం. ఇలాంటి మృత్యుముఖం నుండి బయటపడటమంటే మానవ తరమా? ఇది కేవలం శ్రీ సాయినాథుని కృప మాత్రమే. బాబా కృప ఉంటే మన కష్టాలుసుఖాలూ అన్నీ ఆయనే చూస్తారు. మనం చేయవలసింది ప్రేమతో ఆయన్ని సేవించటం. వారు చూపినమార్గంలో ముందుకెళ్ళటం.
ఈమొత్తం ఎపిసోడ్ లో మా బండి 40స్పీడ్ కంటేఎక్కువ ఉన్నా, మా వెనుక ఏ పెద్ద వెహికల్ ఉన్నా బహుశా నేను మీతో నా అనుభవాన్ని ఇలా పంచుకుందునో లేదో బాబా కే తెలియాలి.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments