‘‘నేనెలా ఉన్నదీ చూసి పోతున్నావా?’’



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!

ముందు భాగం కోసం ఇక్కడ  క్లిక్ చేయండి

(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)

 

ఉనికిని చాటుకునేందుకు, తనని తాను ప్రచారం చేసుకునేందుకు మంత్రాలూ మహిమలూ ఎన్నడూ ప్రదర్శించలేదు బాబా. ప్రదర్శిస్తే కేవలం భక్తుల కోరిక మేరకే వాటిని ప్రదర్శించే వారు. వాటిని లీలలుగా పేర్కొన్నారు భక్తులు. ఆ లీలల్లో ఒకటి…

మసీదులో ప్రవేశించిన తొలిరోజుల్లో, చినిగిన గోనెపట్టా నేల మీద పరుచుకుని పడుకునేవారు బాబా. గోనెపట్టా కొత్తదా? అంటే కాదు. చాలా పాతది.

దాని మీద ఇటుకను తల కింద పెట్టుకుని పడుకునేవారు బాబా.ఇటుకేం ఖర్మ? మెత్తని దిండుని ఏర్పాటు చేస్తామన్నారు భక్తులు. నవ్వారు బాబా. ఇది ఆషామాషీ ఇటుక కాదు, గురుప్రసాదం అన్నారు. తనకి ఆ ఇటుకని తన గురువుగారు ఇచ్చారని తెలిపారు.

అందుకే జాగ్రత్తగా చూసుకుంటున్నానన్నారు. ఇటుకను గుడ్డలో చుట్టి ఉంచుకునేవారు బాబా. నిద్ర లేచిన వెంటనే ఇటుకను కళ్ళకద్దుకునేవారు.

బాబా ఒంటరిగా పడుకోవడం చర్చనీయాంశమయింది. రాత్రయ్యేసరికి, దిక్కూ మొక్కూ లేనట్టుగా బాబాని ఒంటరిని చేసి వెళ్ళిపోవడం బాగా లేదనుకున్నారు భక్తులు.

ఫలితంగా ఆయనకి తోడుగా తాత్యాపాటిల్‌, మహల్సాపతి పడుకునేవారు. కొన్నాళ్ళు పడుకున్నారలా. తర్వాత బాబానే ఇద్దరినీ వద్దన్నారు.

వెళ్ళి, ఇళ్ళల్లో పడుకోమన్నారు. బాబా ఆజ్ఞను కాదనలే కపోయారు వాళ్ళు. యథాప్రకారం బాబా ఒక్కరే మళ్ళీ మసీదులో నిద్రించేవారు.

నేల మీద, చినిగిన గోనెపట్టా మీద బాబా పడుకోవడాన్ని బాబా సాహెబ్‌ డేంగలే భరించలేకపోయాడు. బాబాకి ఒక చెక్కబల్ల తెచ్చిచ్చాడ తను.‘‘దయచేసి ఇక మీదట ఈ బల్ల మీద పడుకోండి.’’ ప్రార్థించాడు.

సరేనన్నట్టుగా సన్నగా నవ్వారు బాబా. చెక్కబల్లను పరిశీలనగా చూశారు. నాలుగు మూరల పొడువున ఉన్నదది. జానెడు వెడల్పున ఉన్నది. చాలనుకున్నారు బాబా.

ఇంటికి వెళ్ళి పడుకోమని ఆజ్ఞాపించిన రోజు నుంచి ఇంటిలో పడుకుంటున్నా ఏ అర్థరాత్రో అపరాత్రో వచ్చి బాబా ఎలా ఉన్నదీ చూసి వెళ్ళేవాడు తాత్యా.

అతను అలా రాత్రిపూట రావడాన్ని బాబా గమనించారు.‘‘నేనెలా ఉన్నదీ చూసి పోతున్నావా?’’ అడిగారు. అవునన్నట్టుగా తలూపాడు తాత్యా.‘‘చూడు చూడు’’ అని నవ్వారు.‘‘తోడుగా శ్యామాని కూడా తెచ్చుకో’’ అన్నారోసారి.

ఆ మాట పట్టుకుని శ్యామా కూడా రాసాగాడు. ఇద్దరూ వచ్చి, నిద్రపోతున్న బాబాని చూసి వెళ్తుండేవారు.

డేంగలే చెక్కబల్ల ఇచ్చాడు. దాని మీద పడుకోమని ప్రార్థించాడు. బాబా ఇక మీదట బల్ల మీదే పడుకుంటారని అనుకున్నారంతా.

ఆ రాత్రి ఆరతి అయిపోయింది. ఎవరిళ్ళకు వారు వెళ్ళిపోయారు. పడుకున్నారు. ఓ రాత్రివేళ శ్యామాని తీసుకుని మసీదుకి బయల్దేరాడు తాత్యా. వారిని చూసి కుక్కలు అరుస్తుంటే కసరి కొట్టారు. మసీదులోకి ప్రవేశించారిద్దరూ. బాబా కోసం చూశారు. కనిపించలేదు.

 

తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles