Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
ముందు బాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి….
భావ తరంగాలు – హేమాజోషి – 5వ.భాగమ్
(బాబా తన భక్తులనుండి దక్షిణ అడిగి మరీ తీసుకునేవారు. దాని ఆంతర్యం ఏమిటో ఈ భాగంలో చదవండి)
మా తాతగారయిన కీ.శే.సోమనాధ్ శంకర్ దేశ్ పాండే నిమోన్ కర్ (నానాసాహెబ్ కుమారుడు) బ్రిటిష్ వారి కాలంలో సి.ఐ.డి. ఇన్స్పెక్టర్ గా పనిచేశారు. ఉద్యోగరీత్యా ఆయన బదిలీపై భారతదేశమంతా తిరిగారు.
ఒకసారి సాయిబాబా ఆయనకి ఒక విచిత్రమైన ప్రశ్న వేశారు. అది ఆయన ఆజ్ఞ కావచ్చు. బాబా, సోమనాధ్ తో “సోమూ, నువ్వు నన్ను కలుసుకోవడానికి షిరిడీ ఎప్పుడు వస్తున్నావు? నీ తుపాకీని గాలిలోకి కాల్చు. నువ్వు షిరిడీ వచ్చావని తెలుసుకోవడానికి అదే సంకేతం” అన్నారు.
మా తాతగారయిన సోమనాధ్ గారు సాయిబాబా వారి ఆజ్ఞలన్నిటినీ శిరసావహిస్తూ ఉండేవారు. సాయిబాబా వారిచ్చిన ఆజ్ఞ ప్రకారం సోమనాధ్ గారు గాలిలోకి తుపాకీ పేల్చగానే బాబా సంతోషంతో “నా సోమూ వచ్చాడు” అనేవారు.
సోమనాధ్ వచ్చీరాగానే సాయిబాబాకు నమస్కారం చేసుకున్న వెంటనే సాయిబాబా ఆయనని దక్షిణ అడుగుతూ ఉండేవారు. సోమనాధ్ వెండి రూపాయి నాణాలని బాబా చేతిలో పెడుతూ ఉండేవారు. బాబా ఆ వెండి రూపాయి నాణాలని వేళ్ళతో రుద్దుతూ “ఇవి నా సోమూ రూపాయలు” అనేవారు.
ఆ తరువాత దక్షిణగా స్వీకరించిన ఆ నాణాలన్నిటినీ తన దగ్గర కూర్చున్నవారందరికీ ఒకరి తర్వాత ఒకరికి పంచిపెట్టేస్తూ ఉండేవారు. ఒకరోజు మా తాతగారు బాబాని ఈవిధంగా అడిగారు. “బాబా, మీరు నా నుంచి దక్షిణ స్వీకరిస్తున్నారు. ప్రతి నాణాన్ని రుద్దుతూ అందరికీ మీ ప్రసాదంగా పంచి పెట్టేస్తున్నారు, కాని మీరు ఒక్క నాణాన్ని కూడా మీ ప్రసాదంగా ఎప్పుడూ నాకివ్వలేదు. ఎందుకని? కారణం ఏమిటి?”
బాబా ఇచ్చిన సమాధానం చాలా ముఖ్యమైనది, గమనించతగ్గది. ఆయన మా తాతగారి వైపు తీక్షణంగా చూస్తూ, “అరే! నువ్వు భూస్వామివి! నువ్వు ఫకీరు నుంచి పైసలు ఎప్పుడూ తీసుకోకూడదు. నువ్వే ఫకీరుకు పైసలివ్వాలి. దీనర్థం తెలుసా నీకు? నీకేది లభించిందో దానితోనే సంతోషంగా జీవించాలి. అర్థమయిందా?” అన్నారు.
ఇక మా తాతగారికి ఎదురు మాట్లాడే ధైర్యం లేకపోయింది. ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే ఆయన పూనాకి తిరిగి రాగానే జీతం (ఇంక్రిమెంట్ ) పెరిగింది. ఆయన సాయిబాబాకు సమర్పించుకున్న దక్షిణకు రెండింతలు ఇంక్రిమెంట్ లభించింది.
కానీ, మా తాత గారి మనస్సులో ఎప్పుడూ ఒక ప్రశ్న వేధిస్తూ ఉండేది. “సాయిబాబా వెండినాణాలని తన వేలితో ఎందుకని రుద్దుతూ ఉండేవారు?” ఒకరోజున బాబా తనంతట తానే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పారు.
“సోమూ! మీరందరూ నా భక్తులు. నేను మీ నుంచి దక్షిణ ఎందుకని అడుగుతున్నానంటే, మీరు మీ జీవనోపాధి కోసం, మీ కుటుంబం కోసం ధనం సంపాదిస్తూ ఉంటారు. కాని మీరు బీదలకి దానధర్మాలు మాత్రం చేయరు. మీ కర్మల యొక్క దుష్ఫలితాలు ఏమాత్రం తగ్గవు. మీకర్మలను నశింపచేయడానికే నేను దక్షిణ అడిగి మరీ తీసుకుంటూ ఉంటాను. మీ కర్మలను పూర్తిగా తొలగిస్తాను”
ఆ విధంగా బాబా తన భక్తులయొక్క కర్మలను, ప్రారబ్ధకర్మలు, సంచిత కర్మలవల్ల కలిగే చెడు ఫలితాలను నాశనం చేస్తూ ఉంటారు.
బాబా వివరణ వినగానే, ఆయన తన భక్తులపై చూపే ప్రేమాభిమానాలకి మా తాత గారి కళ్లనుండి కన్నీళ్ళు కారడం మొదలయ్యాయి. సాయిబాబా తన భక్తుల యెడల స్వచ్ఛమయిన ప్రేమను కనపరుస్తూ, రక్షిస్తూ ఉంటారని అర్థం చేసుకున్నారు. ఆయన ఒక ఆధ్యాత్మిక సద్గురువే కాదు, ఆయనే మన తల్లి, తండ్రీ.
మా తాతగారు గొప్ప జ్యోతిష్య పండితులు కూడా. ఆయన సాయిబాబా చేతులలోను, అరికాళ్ళలోను ఒక యోగికి ఉండవలసిన రేఖలు ఉండటం గమనించారు. ఒకసారి ఆయనకు బాబా స్థానంలో హనుమంతుని దర్శనం అయింది. సాయిబాబాతో తనకు కలిగిన అనుభవాలన్నిటినీ మా తాతగారు మా యింట్లోని వాళ్ళందరికీ, ఆయన మనుమలు మనవరాళ్ళమయిన మాకూ వివరించి చెబుతూ ఉండేవారు.
సాయిబాబా మితభాషి. ఆయన మాటలెప్పుడూ సంజ్ఞలతోను, గూఢార్థాలతోను నిండి ఉండేవి. కాని ఆయన తన మాటలద్వారా ఇచ్చిన సందేశాలు ఎప్పుడూ స్పష్టంగాను, బలీయంగాను, మంగళప్రదంగాను ఉండేవి.
(ఈ ఆనంద తరంగాలు ఇంకా ఉన్నాయి)
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- భావ తరంగాలు – హేమాజోషి(నిమోన్ కర్ గారి మునిమనుమరాలు) ఆరవ బాగం
- భావ తరంగాలు – హేమాజోషి(నిమోన్ కర్ గారి మునిమనుమరాలు) నాల్గవ బాగం
- భావ తరంగాలు – హేమాజోషి(నిమోన్ కర్ గారి మునిమనుమరాలు) మూడవ బాగం
- భావ తరంగాలు – హేమాజోషి(నిమోన్ కర్ గారి మునిమనుమరాలు) ఎనిమిదవ బాగం
- భావ తరంగాలు – హేమాజోషి(నిమోన్ కర్ గారి మునిమనుమరాలు) రెండవ బాగం
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments