బాబా పిలుపు – నేనుండ నీకు భయమేల?



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

బాబా పిలుపు – నేనుండ నీకు భయమేల?

ఈ అనుభవం వరలక్ష్మి గారు పంపించారు. ఈ బాబా లీలను ఆమె మాటలలోనే తెలుసుకుందాము.

నేను చాలా నిరాశలో ఉండి ఏపనీ చేయబుద్ధి కావట్లేదు. హఠాత్తుగా నా మనసులోకి ఒక ఆలోచన వచ్చి, కంప్యూటర్ లో షిర్డీ సాయిబాబా మిరకిల్స్ అని టైపు చేసాను. అపుడు షిర్డీ సాయిబాబా లీలలు అనే బ్లాగు కనిపించింది. సాయిభక్తులందరూ వ్రాసిన లీలలను చదవడం మొదలుపెట్టాను. నా మనసులో కలిగిన ఆనందాన్ని నేనిప్పుడు వర్ణించలేను.

బాబా దయగల హృదయాన్ని చూసి బాబా చిరునవ్వుతో ఉన్న పటం చూసినప్పుడల్లా నాకు కళ్ళవెంట కన్నీరు వస్తూ ఉండేది. భక్తులు రాసిన బాబా అనుభవాలను చదివినపుడల్లా, నాకు కూడా నా అనుభవాన్ని రాయాలనిపించింది. వెంటనే నాకొచ్చిన ఆలోచన సాయి అనుగ్రహం ఎప్పుడు కలిగితే అప్పుడే రాయడం జరుగుతుందనిపించింది. కాని ఎప్పుడో జరుగుతుందనుకున్నాను, కాని ఈ రోజునే నేను రాయడం జరుగుతోంది. బాబాకి నేను ఎంతో కృతజ్ఞురాలిని.

నేను డిగ్రీ చదువుతుండగా ఈ సంఘటన జరిగింది. నేను బాగా చదువుతూండేదాన్ని, నాకు మంచి మార్కులు కూడా వస్తూ ఉండేవి. నేను ఆఖరి సంవత్సరం చదువుతున్నాను. నేను పరీక్షకు బాగానే తయారయ్యను. కాని పరీక్ష హాలులోకి వెళ్ళాక పేపరు చాలా కఠినంగా ఉంది. నాకు ఏడుపు వచ్చింది. పేపరులో ఇచ్చిన ప్రశ్నలు వేటికీ నాకు సమాధానాలు తెలియదు. నేను ఖచ్చితంగా పరీక్ష తప్పుతాననే అనిపించింది. ఎలాగో పరీక్ష రాసి ఇంటికి వచ్చి మా అమ్మతోను, సోదరుడితోను, పరీక్ష లో ఏప్రశ్నకూ సమాధానాలు సరిగా రాయలేదనీ , ఈ పరీక్ష తప్పడం ఖాయమనీ చెప్పాను. నేను ఎంతో ఏడిచాను.

మరునాటి ఉదయం నేను బాబా పూజ చేస్తూ కన్నీళ్ళతో ఇలా ప్రార్థించాను, “బాబా, నా చేయిని విడువకు, ఎల్లప్పుడూ నా చేతిని పట్టుకునే వుండు. నువ్వువదిలేస్తే నేను కింద పడిపోతాను, అప్పుడు నన్ను రక్షించేవారెవ్వరూ ఉండరు. ఇన్ని సంవత్సరాలుగా నేనెప్పుడూ ఫెయిల్ అవలేదు. ఇది చివరి సంవత్సరం. ఈ పరీక్షలో నేను ఫెయిల్ అవకూడదు. నాకు ఉద్యోగం రావడం కూడా చాలా కష్టమవుతుంది. మా నాన్నగారు కూడా తట్టుకోలేరు”

ఆరోజు నేను బాబాని ఎంతో వేడుకున్నాను. పూజ పూర్తయిన వెంటనే నేను గుడికి వెళ్ళాను. ఈ గుడిలోనే మేము సత్యనారాయణ వ్రతాలు జరిపించుకుంటూ ఉంటాము. ఈ గుడి మా తాతగారి ఇంటికి దగ్గరలో ఉంది. నేను, నా సోదరి కలిసి గుడికి వెళ్ళి మేము తెచ్చిన పూజా సామగ్రిని ఒకచోట ఉంచాము. మేమిద్దరమూ కొంచెం బియ్యము, ఆరతి ఇవ్వడానికి పళ్ళెము తేవడానికి మా తాతగారి ఇంటికి వెళ్ళాము.

మేము వెళ్ళేటప్పటికి ఇంటిలో ఎవరూ లేరు. తలుపు మాత్రం తీసి ఉంది. నేను, మా సోదరి లోపలికి వెళ్ళాము. పూజకు కావలసిన వస్తువులకోసం నేను వెతకసాగాను. ఈలోపుల ఎవరో “బాబా” అని పిలవడం వినపడింది నాకు.  అది కేవలం నా భ్రమ అనుకున్నాను, కారణం అలా పిలవడానికి అక్కడ ఎవరూ లేరు. మరలా నాకు అదే పిలుపు వినపడటంతో నా సోదరికి చెప్పాను. నా సోదరి తనకు కూడా ఆ పిలుపు వినపడినదని చెప్పి వీధివైపు బయటకు చూసి,బయట ఒక సాధువు ఉన్నాడని చెప్పింది.

అప్పుడు నేను తలుపులు వేసేయమని చెప్పాను. నాకు భయం వేసింది. పైగా ఇంటిలో ఎవరూ లేరు. ఈ రోజుల్లో ఎవరినీ నమ్మకూడదని చెప్పాను. ఆమె తలుపులు వేసింది. కాని ఒక కిటికీ మాత్రం తెరచి ఉంది. మరలా ఆ సాధువు “బాబా” అని పిలిచాడు. నేను నా సోదరితో ఆ సాధువుకు కొంచెం బియ్యం వేయమని చెప్పాను. తను వెళ్ళి బియ్యము వేయగానే ఆ సాధువు “లక్ష్మి ఎక్కడ ఉంది?” అని అడిగాడు.

నేను లోపల నుండే ఈ మాటలు విని బయటకు వచ్చి చూసాను. అప్పుడా సాధువు, “చింతించకు, అన్నీ సక్రమంగా జరుగుతాయి. బాబా అంతా మంచిగా జరిగేలా చూస్తారు” అన్నాడు. నేను మొదట నమ్మలేదు. ఆ సాధువు చేతిలో ఒక పుస్తకం ఉంది. దాని మీద బాబా బొమ్మ చూడగానే నాకు ఆశ్చర్యం వేసింది.

అప్పుడా సాధువు ఇలా అన్నాడు: “నిన్నందరూ వదలి వెళ్ళిపోవచ్చుగాక, బాబా నిన్నెప్పటికీ వదలరు. కష్టాలన్నిటినుండీ నిన్ను రక్షిస్తారు. ఆయన మీద నమ్మకం ఉంచు.” ఈ మాటలు వినగానే నాకు చెప్పలేనంత ఆనందం కలిగింది. నేను ఆ సాధువుకు కొంచెం డబ్బు ఇద్దామనుకున్నాను, కాని నా పర్సు గుడిలో సత్యనారాయణ వ్రతం పూజకోసం ఉంచిన సామాగ్రిలో ఉండిపోయింది.

అతను నన్ను టీ ఇమ్మని అడిగాడు. ఇంటిలో పాలు ఉన్నాయో లేదో తెలీదని చెప్పాను. ఆ సాధువు, “లోపలకు వెళ్ళి చూడు, కొంచెం పాలు ఉన్నాయి” అన్నాడు. నేను లోపలకు వెళ్ళి ఫ్రిజ్ లో చూశాను. అందులో ఒక కప్పులో పాలు ఉన్నాయి. నేను గబగబా టీ తయారు చేసి ఆ సాధువుకు ఇచ్చాను. ఆ సాధువు టీ త్రాగి, నన్ను దీవించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

ఆ సాధువు, నా పరీక్ష గురించి నేను పడుతున్నవేదనని తీసివేయడానికి వచ్చిన బాబా అనుకున్నాను. ఆరోజు నేను పొందిన ఆనందాన్ని మాటలలో వర్ణించలేను. పరీక్షా ఫలితాలు వచ్చాయి. నేను ఆ పేపరులో పాసయ్యాను. ఆ పేపరులో పాసవడానికి కనీసం 28 మార్కులు రావాలి. నాకు సరిగ్గా 28 మార్కులు వచ్చాయి.

ఆ మార్కులు ఎలా వచ్చాయో నాకు తెలీదు. ఎందుకంటే నేనా పేపరు అస్సలు సరిగ్గా రాయలేదు. బాబాయే నా పరీక్ష పేపరు దిద్ది నన్ను పాస్ చేయించారు. ఈ విధంగా బాబా వచ్చి నన్ను ఆశీర్వదించారు. బాబా నువ్వెప్పుడూ నన్ను సరియైన దారిలో నడిపిస్తూ ఉండు.

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles