Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై
‘‘సాయి’’ అని పిలిచారు బడేబాబా. తలెత్తి అటుగా చూశారు బాబా. బాబాతో పాటుగా శ్యామా కూడా చూశాడు. బడేబాబాని చూస్తూనే ఆనందించారు సాయి.
‘‘మిమ్మల్ని చూసి చాలా కాలం అయింది. రండి, రండి.’’ అన్నారు. బడేబాబా కూడా అలాగే మాట్లాడారు. ఇద్దరూ మాటల్లో పడ్డారు.
బడేబాబా సాయిని కలుసుకోవడం ఇదే మొదటిసారి. ఇంతకు ముందెప్పుడు కలుసుకోలేదు. ఆ సంగతి స్పష్టంగా తెలుసు శ్యామాకి.
పోనీ, సాయి ఎప్పుడయినా మాలెగాం వెళ్ళి బడేబాబాని కలుసుకున్నారా అంటే అదీ లేదు. సాయి షిరిడీ దాటి వెళ్ళలేదెప్పుడూ. అలాంటిది వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా, ప్రేమగా, చాలా కాలం నుంచి పరిచయం ఉన్న వారిలా మాట్లాడుకోవడం శ్యామాకి చిత్రమనిపించింది.
ఉండబట్టలేకపోయాడు. అడిగేశాడు సాయిని.‘‘మీరిద్దరూ ఒకరికొకరు ఎప్పట్నుంచి తెలుసు?’’
‘‘ఎప్పటి నుంచి అంటే ఏడేడు జన్మల నుంచి తెలుసు. మాది జన్మజన్మల బంధం.’’ అని నవ్వారు సాయి.
‘‘మీదీ నాది కూడా జన్మ జన్మల బంధమేనా?’’ అడిగాడు శ్యామా.
‘‘అనుమానం దేనికి? మనిద్దరిది కూడా జన్మ జన్మల బంధమే! నాకన్నీ తెలుసు. నీకే తెలియదు.’’ అన్నారు సాయి.
తనకి తెలియదు. సాయికి తెలుసు. అదెలా సాధ్యం? సందేహాలతో తల పట్టుకున్నాడు శ్యామా. గమనించారది సాయి. ఇలా అన్నారు.‘‘పదే పదే సందేహాలతో కాలాన్ని వృధా చెయ్యకు శ్యామా! పని చూడు.
’’సాయిబాబాని భక్తులతో పాటు ప్రముఖులు కూడా చాలా మంది సందర్శించేవారు. వారిలో సాధువులు, స్వాములు కూడా ఉండేవారు.
గంగఘీర్ వారిలో ఒకడు. అతను ఓ సాధువు. తీర్థయాత్రలు చేస్తూ వస్తున్నాడు. షిరిడీ గురించి, అక్కడ తిరుగాడుతున్న బాబా గురించి విన్నాడతను. చూడాలనిపించింది. వచ్చాడు.
బాబాని చూస్తూనే చేతులెత్తి నమస్కరించాడు.‘‘షిరిడీ ఓ పేడకుప్ప. ఈ కుప్పలో రత్నంలా మీరు ఉన్నారు. ఇది ఈ నేల చేసుకున్న అదృష్టం.’’ అన్నాడు గంగఘీర్.‘‘మీరు యోగీశ్వరులు, మహాత్ములు’’ అన్నాడు. బాబా పాదాల మీద పడ్డాడు.
ఇంకొకసారి ఆనందస్వామి, బాబాని దర్శించాడు. అతను అక్కల్కోట స్వామి శిష్యుడు. బాబాని చూస్తూనే అతను చేతులు జోడించాడు. ఆనందంగా కన్నీరు పెట్టుకున్నాడు.
‘‘మీరు సాయిబాబా కాదు, సాక్షాత్తు మీరు మా అక్కల్కోట మహరాజే’’ అన్నాడు. తన్మయత్వంతో చిందులేశాడు.
ఎవరు ఎలా కావాలనుకుంటే అలా కనిపించేవారు బాబా. ఆత్మీయుడుగాను, ఆధ్యాత్మికవాదిగాను, స్నేహితునిగాను, శ్రేయోభిలాషిగాను కనిపించేవారాయన. అలా కనిపించడం గొప్పతనం కాదని, తనో అద్దంలాంటివాణ్ణంటూ అందులో భక్తుల ప్రతిబంబమే కనిపిస్తున్నదనే వారు.
‘నీకు ఏం కావాలో నేను అదే! నీకు అక్కరలేనిది కూడా నేనే!’’ అని నవ్వేవారు బాబా.
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- నా మాటలలోని అర్ధం నీకు బోధ పడిందా? ఎల్లప్పుడూ అదే విధంగా ఆచరిస్తూ ఉండు
- నేనుండ నీకు భయమేల — అషిమా, బాబా అనుభూతి–Audio
- అమ్మా! నీకు బాబా గారే కలలో వచ్చి నిన్ను శిరిడీ రమ్మనమని పిలిచారు, నేను కాదు నీ కలలోకి వచ్చింది.
- నువ్వు కూడా అన్నయ్య లాగా బాబా పూజ చెయ్యి నీకు మంచి సంభందం వస్తుంది
- నీ రాధాకృష్ణుణ్ణి నేనే! నేనే నిన్నిక్కడకి రమ్మన్నాను. సేవించుకుంటావో, సాధిస్తావో అంతా నీ ఇష్టం.’’
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments